Posts

Showing posts with the label ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు.
Image
ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం​ అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. విజయవాడ జాతీయ రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు గాయాలపాలయ్యారు. అదే రహదారిలో వెళుతున్న వైద్యశాఖ మంత్రి ఈ ఘటనను చూసి వెంటనే స్పందించి తన కాన్వాయ్‌లో క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి పంపించారు. ఏలూరు నుండి అమరావతిలోని అసెంబ్లీకి వెళుతున్న ఆళ్ల నాని విజయవాడ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.