Posts

Showing posts from July, 2019

జగన్ సర్కారుకు వరల్డ్ బ్యాంక్ తీపి కబురు!

ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి 300 మిలియన్ డాలర్ల రుణాన్ని రద్దు చేసిన ప్రపంచ బ్యాంక్.. జగన్ సర్కారుకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టి ఇతర మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టులపై ఇదే మొత్తాన్ని, ఇంకా అవసరమైతే ఎక్కువ రుణాన్ని అయినా ఇచ్చేందుకు సిద్ధమని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ఇకపోతే ఈ నెల 15న ఏపీ రాజధానికి ఆర్థిక సాయంపై ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని వరల్డ్‌ బ్యాంక్‌ తెలిపింది. కేంద్రం ఉపసంహరణతోనే తమ డైరక్టర్ల బోర్డు ఆ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. ఏపీ రాజధాని అమరావతికి నిర్మాణం, అభివృద్ధికి అందించనున్న రుణ సహాయాన్ని తాము నిలిపివేస్తున్నట్టుగా వరల్డ్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వరల్డ్ బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది. అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రుణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకోవడంతో తాము విషయంలో వెనక్కితగ్గినట్టుగా ప్రపంచబ్యాంక్ తెలిపింది. మరోవైపు ఏపీకి ప్రపంచబ్యాంక్ రుణా సాయాన్ని నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించినప్పటికి

ఇవాళ సాయంత్రం విజయవాడకు రానున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్..

అమరావతి... ముఖ్యమంత్రి తో పాటు కీలక నేతలకు విందు ఇవ్వనున్న నరసింహన్.. ఏపీ గవర్నర్ గా తనకు సహాయసహకారాలు అందించినందుకు విందు ఏర్పాటు చేసిన నరసింహన్.. రేపు రాష్ట్రానికి వస్తున్న కొత్త గవర్నర్ బీబీ హరిచందన్.. ఈ నెల 24న విజయవాడ లోని రాజభవన్ లో హరిచందన్ ప్రమాణస్వీకారం...

ఇవాళ అసెంబ్లీ సమావేశాలు..

*అమరావతి* ప్రశ్నఒత్తరాలతో ప్రారంభం కానున్న సమావేశాలు... 104,108 సర్వీసుల పనితీరు,రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులో ఆలస్యం పై వైసీపీ సభ్యుల ప్రశ్నలు... గ్రామీణ గృహ నిర్మాణం లబ్ధిదారులకు చెల్లింపుల నిలిపివేత,అఖండ గోదావరి ప్రాజెక్టు పై టీడీపీ సభ్యులు ప్రశ్నలు... రేషన్ డీలర్ల తొలగింపుపై ప్రశ్న వేసిన జనసేన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్.. *సభలో అసెంబ్లీ కమిటీలకు వైసీపీ సభ్యులను ప్రకటించనున్న సీఎం జగన్* పీఏసీ కమిటీబడ్జెట్ ఎస్టిమేషన్స్ కమిటీ,పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యులను ప్రకటించనున్న సీఎం జగన్.. సంక్షేమ శాఖల బడ్జెట్ డిమాండ్ లపై సభలో ఓటింగ్

ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-2 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది

శ్రీహరికోట: ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌.. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటల వరకు 20 గంటలపాటు కొనసాగనుంది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టనున్నారు. జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ఎం1 వాహక నౌక దీన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. 3.8 టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాన్ని వాహకనౌక రోదసీలోకి తీసుకెళ్తుంది. జులై 15న తెల్లవారుజామున నిర్వహించాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఫేస్ యాప్ వాడుతున్నారా? జర జాగ్రత్త

ఫేస్ యాప్... ఇటీవల వైరల్‌గా మారిన మొబైల్ యాప్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓ వ్యక్తి కొన్నేళ్ల తర్వాత ఎలా ఉంటారో, కొన్నేళ్ల ముందు ఎలా ఉన్నారో ఫోటోని మార్చి చూపించడం ఫేస్ యాప్ ప్రత్యేకత. రష్యాకు చెందిన వైర్‌లెస్ ల్యాబ్ కంపెనీ రూపొందించిన యాప్ ఇది. ఫేస్ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. ఫేస్ యాప్ ఆల్గరిథమ్ ఓ ఫోటోను తీసుకొని డీప్ జెనరేటీవ్ కన్వొల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్స్ ద్వారా మీరు కోరుకున్నట్టుగా ఫోటోను జెనరేట్ చేస్తుంది. అంటే భవిష్యత్తులో ఎలా ఉంటారన్న దగ్గర్నుంచి జుట్టు రంగు, గడ్డం మార్చడం వరకు ఏదైనా ఫేస్ యాప్‌తో సాధ్యం. అంతేకాదు... మగాళ్లను, ఆడవాళ్లుగా, ఆడవాళ్లను మగవాళ్లుగా మార్చే 'స్వాప్ జెండర్' ఫీచర్ కూడా ఉంది. తాము భవిష్యత్తులో ఎలా ఉంటామో, స్టైల్ మార్చితే ఎలా ఉంటామో తెలుసుకునేందుకు చాలామంది ఫేస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వాడుతున్నారు. ఫేస్ యాప్ ఎక్కువగా యూత్‌ను అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే 10 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఇది ఫ్రీ యాప్. ఇన్-యాప్ పర్చేస్‌లో మరిన్ని ఫిల్టర్లున్నాయి. వాటితో ఫోటోలను మార్చి ఎంజాయ్ చేస్తున్నారు.FaceAppChallenge హ్యాష్‌ట్యా
Image
బైబై.. 2019 ఎన్‌జే2 .. భూమికి సమీపం నుంచి దూసుకెళ్లిన గ్రహశకలం .. మళ్లీ 2119 జూలై 7న భూమికి దగ్గరగా రాక .. న్యూఢిల్లీ: వింటి లాగివదిలిన బాణంలా రోదసిలో దూసుకెళ్తున్న గ్రహశకలం.. 2019 ఎన్‌జే2! 207 అడుగుల వ్యాసం ఉన్న ఈ గ్రహశకలం గంటకు 48,280 కిలోమీటర్ల వేగంతో విశ్వంలో ప్రయాణిస్తోంది. భారత కాలమానం ప్రకారం, శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు ముందు.. భూమికి అత్యంత సమీపం నుంచి.. అనగా కేవలం 31 లక్షల మైళ్ల దూరం నుంచి ఇది దూసుకుపోయింది. 31 లక్షల మైళ్లంటే మనకు బాగా ఎక్కువే అనిపించొచ్చుగానీ, ఈ విశాల విశ్వాన్ని అందులోని గ్రహాల మధ్య దూరాన్ని లెక్కలోకి తీసుకుంటే ఖగోళ శాస్త్రజ్ఞుల లెక్కప్రకారం ఇది బాగా దగ్గర కిందే లెక్క. మళ్లీ ఇది మన భూమిని 2119, జూలై 7న.. అంటే దాదాపు వందేళ్ల తర్వాత పలకరించనుంది. అప్పుడు అది భూమికి 2.38 కోట్ల మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది.

రూట్‌ నంబర్‌-300 బస్సులే టార్గెట్‌

చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న మహిళ రిమాండ్‌ చాంద్రాయణగుట్ట:  '300 రూట్‌' నంబర్‌ ఆర్టీసీ బస్సులే లక్ష్యంగా చేసుకొని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న మహిళను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. డీఎస్సై కొండల్‌రావ్‌తో కలిసి ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌ వివరాలు వెల్లడించారు. సరూర్‌నగర్, శంకర్‌నగర్‌కు చెందిన బండి కీర్తి అలియాస్‌ దుర్గ (30) దొంగతనాలు వృత్తిగా మార్చుకుంది. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే రూట్‌ నంబర్‌-300 (ఉప్పల్‌-మెహదీపట్నం) బస్సులను ఎంచుకుని చోరీలకు పాల్పడేది. సాగర్‌ రింగ్‌ రోడ్డు, ఎలబీ నగర్‌ ప్రాంతాల్లో బస్సు ఎక్కే కీర్తి కాటేదాన్‌ వెళ్లేలోగా అదను చూసి ప్రయాణికుల నగలను చోరీ చేసేది. ఫుట్‌బోర్డుపై నిలుచుని బస్సుదిగే ప్రయత్నంలో ఉన్న ప్రయాణికుల గొలుసులు కొట్టేసి ముందు స్టాప్‌లో దిగిపోయేది. ఉదయం 8.30 నుంచి 11 గంటలు, తిరిగి సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య మాత్రమే ఈమె పంజావిసిరేది. బుధవారం ఉదయం హఫీజ్‌బాబానగర్‌లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న డీఎస్సై కొండల్‌రావు, క్రైం కానిస్టేబుళ్లు ప్రశాంత్, నిఖిల్‌ సాయి, దినేశ్వర్‌లకు అనుమానాస్పదంగా కనిపించిన

సియం కేసిఆర్‌కు మావోలు హెచ్చరికలు!

హైదరాబాద్‌: తెలంగాణ సియం కేసిఆర్‌కు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. హరితహారం పేరుతో కేసిఆర్‌ ప్రభుత్వం ఆదివాసీల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుందని మావోలు ఆరోపించారు. దశాబ్దాలుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఆశ చూపి, రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ పేరిట లేఖ విడుదల అయింది. కేసిఆర్‌ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలనీ, లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని లేఖలో జగన్‌ హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్‌ బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.

BF గురించి అంత బయటపెట్టిన అమలా పాల్..

ప్రస్తుతం తెలుగు , తమిళ్ ఇండస్ట్రీ లలో అమలా పాల్ పేరు మారుమోగిపోతుంది..విడాకుల తర్వాత ఓ రేంజ్ లో రెచ్చిపోతున్న ఈ భామ..హాట్ హాట్ గా కనిపించడమే కాదు వివాదాస్పద వాక్యాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. తాజాగా ఈ భామ నటించిన ఆమె చిత్రం రేపు తెలుగు , తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న ఈమె..సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకుంది. రీసెంట్ గా అమలాపాల్ తన మనసులో ఉన్న వ్యక్తి గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే. కొద్దికాలంగా ఈ భామ ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానని తెలిపింది. 'మనం ఎంత కష్టపడినా మన కోసం ఒకరున్నారనే భావన కలగాలి.అలాంటి ఫీలింగ్ ను నా బాయ్ ఫ్రెండ్ నాకు కలిగించాడు. నాకోసం అతడు తన ఉద్యోగం కూడా మానేశాడు. ఓ చిన్న పార్ట్ టైమ్ జాబ్ చూసుకున్నాడు. నాతోనే ఉంటాడు. నన్ను బాగా చూసుకుంటాడు' అని చెప్పుకొచ్చింది.

మహేష్, రమేష్ కు నో.. నరేష్ తోనే ఉంటానంటున్న కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ మరియు విజయనిర్మల అన్యోన్య దాంపత్యం గురించి తెలిసిందే. అయితే విజయనిర్మల మృతి కృష్ణ కి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం విజయనిర్మల చనిపోయిన తర్వాత మహేష్ బాబు మరియు రమేష్ బాబు ఇద్దరూ కలిసి తమ తండ్రిని ఇల్లు మారితే మనసు కుదుట పడుతుందని నచ్చచెప్పడానికి ప్రయత్నించారట. కానీ కృష్ణ అవేమీ పట్టించుకోలేదని.. తనకు విజయనిర్మలతో ఉన్న ఇంట్లోనే జ్ఞాపకాలు ఉన్నాయని. కాబట్టి ఆ ఇంటిని వదిలే ప్రసక్తే లేదని కృష్ణ చెప్పినట్లు సమాచారం. చాలాకాలంగా కృష్ణ నరేష్ తో పాటే ఉంటున్నారు. కానీ కేవలం విజయనిర్మల చనిపోయినందువల్ల తాను నరేష్ ని వదిలి రాలేనని తన నిర్ణయాన్ని చెప్పారట. మహేష్ బాబు, రమేష్ బాబు కూడా తండ్రి నిర్ణయాన్నికి గౌరవం ఇచ్చి.. ఈ విషయంలో బలవంతం చేయలేదని తెలుస్తోంది. ఇకపోతే కుటుంబ సభ్యులు మాత్రం కృష్ణ ఒంటరిగా ఫీలవకుండా ఎప్పటికప్పుడు కలుస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నరేష్ కూడా కృష్ణ నిర్ణయానికి చాలా సంతోషించారని సమాచారం.

బీచ్ లో అందరూ చూస్తుండగా శృంగారంలో మునిగి తేలిన జంట

బీచ్ లో అందరూ చూస్తుండగా శృంగారంలో మునిగి తేలిన జంట ఒకప్పుడు శృంగారమంటే నాలుగు గోడలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఇప్పడు కాలం మారింది. చుట్టు పక్కల ఎవరు ఉన్నారు. ఏం చేస్తున్నారనేది లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా ఓ జంట బీచ్ లో అందరూ చూస్తుండగానే శృంగారంలో మునిగితేలారు. ఈ సంఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది. పూర్తి మ్యాటర్ లోకి వెళితే... ఇంగ్లాండ్ లోని హవో లాన్స్ లోని ఓ బీచ్ కి వెళ్లిన ఓ జంట దారుణంగా ప్రవర్తించింది. చుట్టుపక్కల జనాలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించారు. చిన్నపిల్లలు చూస్తున్నారన్న ఇంగితం కూడా లేకుండా అందరూ చూస్తుండగా శృంగారంలో పాల్గొన్నారు. వారు చేసిన పనికి అక్కడి వారంతా నోరెళ్ల పెట్టారు. వెంటనే ఆ ఘటనను కొందరు తమ సెల్ ఫోన్ లో బందించడం మొదలుపెట్టారు. మరికొందరేమో.. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొనడం నేరమని.. వారిపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు చెప్పారు. చిన్నపిల్లలు.. ఫ్యామిలీలు వచ్చే బీచ్ లో ఓ జంట ఇలా చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఆ జంటను అరెస్

ఒకే అమ్మాయి కోసం 5గురు యువకులు... ఇరువర్గాలు కత్తులతో దాడులు...!

ఒకే అమ్మాయిని అయిదుగురు అబ్బాయిలు ప్రేమించారు. దీంతో నేనేంటే నేనంటూ ఇద్దరు అబ్బాయిలు ఘర్షణకు దిగారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే మధ్యవర్తిత్వానికి వెళ్లిన స్నేహితులు ఇద్దరికి కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో గాయాలైన వారిని ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్న సంఘటన హైదారాబాద్‌లోని లంగర్ హౌజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. యువతి యువకుల్లో ప్రేమాయణం మాములైంది. అయితే ఒకే అమ్మాయిని ఇద్దరు ముగ్గురు కూడ ప్రేమించడం అమ్మాయి కోసం ఘర్షణలు పడడం కూడ రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితి. ఈనేపథ్యంలోనే టోలిచౌకి గుల్షన్ కాలనీకి చెందిన మహ్మద్ మసూద్ ,హకీంపేటకు చెందిన అబ్దుల్ ఖరీమ్, ప్యారామౌంట్ కాలనీకి చెందిన షారూఫ్,తోపాటు ,సలావుద్దిన్ రహ్మాన్, మహ్మాద్ హైమద్, మతీన్‌లు మురాదానగర్‌కు చెందిన షాహెదాషారాను ప్రేమించారు. ఈ నేపథ్యంలోనే మతీన్, మరియు హైమద్‌ల మధ్య ఘర్షణ చెలరేగింది. తన ప్రేమకు అడ్డురావద్దంటూ సినిమా స్టైల్లో చెప్పేందుకు హైమద్ స్నేహితులు మతీన్‌కు బెదిరించేందుకు రంగంలోకి దిగారు. దీంతో మంగళవారం రాత్రీ టోలిచౌకిలోని బృందావన్ కాలనీలో మతీన్‌ను అటాక్ చేశారు.దీంతో విషయం తెలసుకున్న మతీన్ స్నేహితులై

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ ‌రెడ్డి సర్కార్‌కు షాక్ ...

ఢిల్లీ:  గ్రీన్‌కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ట్రిబ్యునల్‌ స్టే ఇచ్చింది. యూనిట్‌ ధర 4.50 నుంచి రూ.2.44కి తగ్గించాలని గ్రీన్‌కో కంపెనీకి ఏపీ ప్రభుత్వం నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ ధరల నిర్ణయం రెగ్యులేటరీ పరిధిలోకి వస్తుందని గ్రీన్‌కో కంపెనీ తేల్చిచెప్పింది. రాజస్తాన్‌లో రూ.2.44కి యూనిట్‌ ఇచ్చినంత మాత్రాన ఏపీలో అదే ధరకు ఇవ్వడం కుదరదని గ్రీన్‌కో కంపెనీ స్పష్టం చేసింది. జులై 12న గ్రీన్‌కో కంపెనీకి చెందిన మూడు యూనిట్లకు ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని ట్రిబ్యునల్ తప్పుబట్టింది.

మంత్రికే కోటి రూపాయలు ఇవ్వజూపిన సబ్ రిజిస్టార్ ?

విజయవాడ : సుబ్రహ్మణ్యం పటమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో  రిజిస్టర్  పోస్ట్ కోసం మధ్యవర్తి ద్వారా ఓ మంత్రికి కోటి రూపాయలు లంచం ఇస్తామనే విషయం చర్చనీయాంశం అయింది.. "పటమట రిజిస్ట్రార్" ఇప్పించండి అని అత్యంత ఖరీదైన ప్రాంతం పటమట సబ్ రిజిస్టర్ పోస్ట్ కోసం మంత్రి కే కమిషన్ ఇవ్వచూపిన వైనం మీడియా లో చక్కర్లు కొడుతోంది.. ప్రతి నిత్యం వందలాదిమంది రిజిస్ట్రేషన్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.. అయితే ప్రతి రిజిస్ట్రేషన్కు 2 నుంచి 5 శాతం వరకు ఇక్కడ వసూలు చేస్తున్నారు .. కానూరు ,పటమట ,ఆటోనగర్ బెంజిసర్కిల్, తదితర ఖరీదైన ప్రాంతాలు ఈ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉండటం కలిసొచ్చే అంశం.. రోజు లక్షలాది రూపాయలు చేతులు మారుతాయి.. అసైన్డ్ భూములు అన్యాక్రాంతం భూములు సరైన పఁతాలు   లేని వాటిని కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడికి వస్తుంటారు ... అందుకే ఖరీదైన పోస్ట్ గా పటమట సబ్ రిజిస్టార్ ఆఫీస్ ముద్ర పడింది .. మంత్రి కే కోటి రూపాయలు ఇస్తామనడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చలోకి నిలిచింది పటమట రిజిస్టర్ కార్యాలయం...

ఇకపై రేషన్ డీలర్ లు ఉండరు ...

రేషన్ డీలర్ల పై ప్రభుత్వం నిర్ణయం ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేస్తున్నారు. ఇకపై రేషన్ సరుకులు డోర్‌ డెలివరీ చేయనుంది ప్రభుత్వం. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి నెలనెల సరుకులు సరఫరా చేస్తారు. వేలి ముద్రలు పడకపోయినా ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా రేషన్ అందచేస్తారు. ఈ కొత్త వ్యవస్థ వస్తున్న నేపథ్యంలో ఇకపై రేషన్ డీలర్లు ఉండరని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కలెక్టర్ల సమావేశంలో ప్రజాపంపిణీ అంశంపై చర్చ సందర్భంగా డీలర్లు ఉంటారా? ఉండరా? అన్న ప్రస్తావన వచ్చింది. ఇందుకు జగన్ స్పష్టత ఇచ్చారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ఇకపై వాలంటీర్ల ద్వారా జరుగుతుంది కాబట్టి డీలర్లు ఉండరని స్పష్టం చేశారు పెద్ద బియ్యం సరఫరా చేయడం వల్ల ప్రజలు తిరిగి వాటిని బయట అమ్ముకుంటున్నారని… అవి తిరిగి మిల్లర్లకు చేరుతున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కాబట్టి తినయోగ్యమైన సన్న బియ్యాన్నే సరఫరా చేస్తామని ప్రకటించారు.

ప్రగతి ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం లో దోపిడీ మిస్టరీ ని చేధించిన పోలీసులు

విజయవాడ : ఈనెల 12వ తేదీన ప్రగతి ట్రాన్స్ పోర్ట్ లో ప్రగతి పాండే ఉండగా ముగ్గురు అగంతకులు దాడి చేశారు పాండేని కర్రలతో చితకబాది మూడున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారు సిసి కెమెరాలు ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు ప్రగతి ట్రాన్స్ పోర్ట్ ను సంతోష్ త్రిపాఠి తో కలిసి వేణుగోపాల్ ప్రారంభించాడు వర్కింగ్ పార్టనర్ గా ఉన్న  వేణుగోపాల్ విభెదాలతో బయటకు వచ్చాడు సంస్థలో జరిగిన‌ నష్టాన్ని  ఎలాగైనా వసూలు చేసుకోవాలని వేణుగోపాల్ భావించాడు వదిన కుమారుడు విశాల్ కు విషయం చెప్పి మాస్టర్ ప్లాన్ వేశాడు సిసి కెమెరా ఆధారంగా పర్యవేక్షణ చేస్తూ విశాల్ కు సూచనలు చేశాడు విశాల్ , మరో ఇద్దరు వ్యక్తులు కలిసి 12వ తేదీన కర్రలతో దాడి చేసి మూడున్నర లక్షలు తెచ్చి  వేణుగోపాల్ కు ఇచ్చారు ఈ కేసు మిస్టరీ ని చేధించిన సిబ్బందికి రివార్డులు ఇస్తాం.

బీజేపీలోకి రాయపాటి..? రెండు రోజుల్లో ఢిల్లీకి ....

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ... తెలుగు రాష్ట్రాల్లోనూ బలాన్ని పెంచుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అసంతృప్తి నేతలను, సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాయపాటిని బీజేపీ నేత రాం మాధవ్ కలిశారు. రాయపాటి ఇంటికి వెళ్లి మరీ బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలో రాయపాటి కుటుంబానికి బలం ఎక్కువే. ఆయన కనుక బీజేపీలో చేరితే... ఆయన మద్దతుదారులంతా బీజేపీలోకి వచ్చి చేరే అవకాశం ఉంది. దాంతో పార్టీని ప్రతిష్టం చేసుకోవచ్చని బీజేపీ యోచిస్తోంది. రాం మాధవ్ ఇచ్చిన ఆఫర్ పై రాయపాటి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఢిల్లీ వచ్చి పార్టీ పెద్దలను కలుస్తానని రాయపాటి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. రాం మాధవ్ తో భేటీ తర్వాతి రోజే.. రాయపాటి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తనకున్న ఇబ్బందులను  చంద్రబాబుకి వివరించినట్లు సమాచారం.

గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో.. రేషన్ డీలర్ల మనుగడ :రేషన్ డీలర్లు ఆందోళన

విజయవాడ : గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో.. రేషన్ డీలర్ల మనుగడ ఏంటని ప్రశ్నిస్తూ విజయవాడలో రేషన్ డీలర్లు ఆందోళన గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదు... అయితే తమ భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి... తమని తొలగిస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు కానీ మీడియా సంస్థలలో రకరకాల కథనాలు వస్తున్నాయి... ప్రస్తుతం తమ జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలి... ఇప్పుడు రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేస్తే తాము. మరో ఉద్యోగం చూసుకో లేని పరిస్థితి... టెన్షన్ తట్టుకోలేక చాల మంది డీలర్లు అనారోగ్యం పాలవుతున్నారు... మా జీవితాలకు జగన్మోహన్రెడ్డి భరోసా ఇవ్వాలి...