హైదరాబాద్‌ బయల్దేరాల్సిన విమానానికి ముప్పు తప్పింది

చిత్తూరు

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ బయల్దేరాల్సిన విమానానికి ముప్పు తప్పింది.

రేణిగుంట విమానాశ్రయంలో స్పైస్‌జెట్‌ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే.. దాంట్లో సాంకేతిక లోపం తలెత్తింది.

ఈ విషయాన్ని గమనించిన పైలట్‌ సురక్షితంగా విమానాన్ని ల్యాండ్‌ చేశారు.

ఈ సమయంలో విమానంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

మొత్తానికి ప్రమాదాన్ని ముందే పైలట్‌ పసిగట్టడంతో.. అటు ఎయిర్‌పోర్టు అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?