Posts

Showing posts from June, 2019

ఓ వైపు ట్రిపుల్‌ తలాక్‌ నేరమంటూ కేంద్రం హెచ్చరిస్తున్నప్పటికి.. బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు

లక్నో : ఓ వైపు ట్రిపుల్‌ తలాక్‌ నేరమంటూ కేంద్రం హెచ్చరిస్తున్నప్పటికి.. బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా నోయిడాలో మరో ట్రిపుల్‌ తలాక్‌ సంఘటన చేసుకుంది. కూరగాయలు కొనేందుకు 30 రూపాయలు అడిగిందని భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడో ప్రబుద్ధుడు. వివరాలు.. నోయిడాకు చెందిన జైనాబ్‌‌(30) కూరగాయలు కొనడం కోసం భర్తతో పాటు స్థానిక రావోజి మార్కెట్‌కు వెళ్లింది. కురగాయలు కొనే నిమిత్తం రూ. 30 ఇవ్వాల్సిందిగా భర్తను కోరింది. దాంతో ఆగ్రహించిన ఆమె భర్త సబీర్‌(32) స్క్రూడ్రైవర్‌తో జైనాబ్‌ మీద దాడి చేయడమే కాక.. ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. ఈ సంఘటన గురించి బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘పెళ్లైన దగ్గర నుంచి సబీర్‌ నా కూతుర్ని హింసిస్తున్నాడు. అతని సోదరులు నా కుమార్తెతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో గత వారం జైనాబ్‌ మా ఇంటికి వచ్చింది. ఐదు రోజుల తర్వాత తన అత్త వారింటికి వెళ్లింది. వెళ్లిన దగ్గర నుంచి సబీర్‌ తనకు విడాకులు కావాలంటూ నా కుమార్తెను వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో కూరగాయల కోసం నా కుమార్తె 30 రూపాయలు అడిగింది. దాంతో సబీర్‌ నా కుమార్తెకు తలాక్‌ చెప్పాడ’ని వాపోయాడు. జైనాబ్‌ తండ్రి ఫిర్యా

శ్రీనివాసథియేటర్‌ వెనుక వైపు నివాసం ఉం టున్న ఉసేన్‌పీర ఇంట్లో ఆదివారం చోరీ

పులివెందుల  : పట్టణంలోని శ్రీనివాసథియేటర్‌ వెనుక వైపు నివాసం ఉం టున్న ఉసేన్‌పీర ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. ఈ సందర్భంగా బాధితుని వివరాల మే రకు...... ఉసేన్‌ పీర తన సొంత పని నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కోవరంగుట్టపల్లెకు వెళ్ళి సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకోగా తలుపులు తెరిచి ఉండడంతో వెంట నే ఆయన ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంటి హాల్‌ రూమ్‌లో బీరువా తెరిచి ఉండడం గమనించా రు. విచిత్రమైన ముగ్గులతో ఆకారాన్ని గీశారు. దీనిని బట్టి చోరీకి పాల్పడిన వారు క్షుద్రపూజ లు చేసినట్లు తెలుస్తోందన్నారు. వెంటనే ఆ యన పోలీసులకు సమాచారం అందించారు. దీనితో సీఐ సీతారామిరెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. వెంటనే డాగ్‌స్క్వాడ్‌ ను, క్లూస్‌టీంను పిలిపించి పరిసరాలను పరిశీలించారు. లక్ష రూపాయల నగదు, అరతులం బంగారు పోయినట్లు పోలీసులకు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు లోయలో పడి 31 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కేశ్వాన్‌ నుంచి కిష్త్వార్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 31 మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు సీనియర్‌ పోలీసు అధికారులు తెలిపారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.  ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికితీశామని జమ్మూ ఐజీ ఎంకే సిన్హా తెలిపారు. కాగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఘటనపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

సూర్యపేట:ఇన్‌స్టాగ్రాంలో పరిచయం.. ఆ తర్వాత ప్రేమాయణం.

సూర్యపేట:ఇన్‌స్టాగ్రాంలో పరిచయం.. ఆ తర్వాత ప్రేమాయణం.. ప్రియుడి జల్సాల కోసం సొంత ఇంట్లోనే బంగారు నగల చోరీ.. రెండు నెలలుగా పోలీసుల విచారణలో పొరుగింటి వారిపై నిందలు. సెల్‌ఫోన్‌ కాల్‌ రికార్డ్సుతో బయటపడ్డ బండారమిది. సూర్యాపేటకు చెందిన ఓ యువతి తన తాత ఇంట్లో ఉంటూ స్థానికంగా ఎం.ఫార్మసీ చదువుతోంది. ఎనిమిది నెలల క్రితం యానాం ప్రాంతానికి చెందిన కర్రి సతీష్‌ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో సతీష్‌ యువతికి ఏం మాయమాటలు చెప్పాడో తెలియదు. కారు కొనుగోలు చేసేందుకు ఆ యువతి ఇంట్లోని బీరువాలో దాచిన సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసి అతనికి బహుమానంగా అందించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 14న యువతి తాత నగలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొరుగింటి వారిపై నిందలు తమ ఇంట్లో అద్దెకు నివాసముంటున్న ఓ మహిళ చోరీ చేసి ఉంటుందని బాధితుడు పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆమె చోరీ చేయలేదని వారు నిర్ధారించుకున్నారు. ఇది ఇంటి దొంగల పనేనని భావించిన పోలీసులు ఆ దిశగా విచారించారు. మరోవైపు పోలీసు విచారణ వివరాలను ఎప్పటికప్పుడు యువతి త

టుడే న్యూస్ అప్డేట్స్

-అమరావతి:సెక్రటేరియట్ లో వివిధ శాఖల అధికారులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ.._ -AP:మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు.._ -తెలంగాణాలో నేటి నుంచి గ్రూప్-2 ఇంటర్వ్యూలు.._ వరల్డ్ కప్ లో వెస్టిండీస్- శ్రీలంక మధ్య మ్యాచ్.._

కర్ణాటక సరిహద్దు గూకుంట గ్రామంలో జయప్ప అనే భూత వైద్యుడి అరాచకం

చిత్తూరు: కర్ణాటక సరిహద్దు గూకుంట గ్రామంలో జయప్ప అనే భూత వైద్యుడి అరాచకం... దెయ్యం వదిలిస్తానని పాలిటెక్నిక్ విద్యార్థిని లావణ్యను చితకబాదిన భూత వైద్యుడు... ఒంటిపై వాతలతో తీవ్రంగా గాయపడ్డ లావణ్య... మదనపల్లెలో పాలిటెక్నీక్ చదువుతున్న లావణ్య లావణ్య రామసముద్రం మండలం పెద్ద కురప్పల్లి గ్రామ వాసి...

ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం పెనుకొండ: కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పదవ తరగతి చదువుతున్న మనోజ్ కుమార్ నాయక్ (16) ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో గొర్రెలు మేపడానికి వాటి వెంట పంపించమని గొర్రెలు తప్పిపోవడంతో తల్లి తండ్రులు ఏమంటారో అనే భయంతో ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో శెట్టిపల్లి సమీపంలోని దొక్కలదోన అటవీ ప్రాంతంలో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పెనుకొండ పోలిస్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్తలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్నీ పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో ఇకనుండీ ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం

--సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు విజ్ఞప్తి - ఉదయం పది గంటల నుండే జిల్లా ఎస్పీ అందుబాటులో ఉంటూ అర్జీలు స్వీకరిస్తారు -  ప్రజలు స్వేచ్ఛగా సమస్యలు విన్నవించుకోవచ్చు   అనంతపురం: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని... జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు విజ్ఞప్తి చేశారు. ఉదయం పది గంటల నుండీ తాను జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో అందుబాటులో ఉంటానన్నారు. ప్రజలు స్వేచ్ఛగా  గ్రీవెన్స్ డే  కార్యక్రమంలో వినతులు అందజేయవచ్చన్నారు. పాలన పారదర్శకంగా, స్నేహపూర్వకంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం గ్రీవెన్స్ డే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో ప్రతీ సోమవారం సమర్థవంతంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జిల్లా ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు

*గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు* ఢిల్లీ: గ్యాస్‌ వినియోగదారులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) గుడ్ న్యూస్ చెప్పింది. సబ్సిడీలేని గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.100.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ గ్యాస్‌ ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం బలపడడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సబ్సిడీలేని ఎల్పీజీ ధర దిల్లీలో రూ.737.50గా ఉంది. అది రూ.637కు తగ్గనుంది. సవరించిన రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక సబ్సిడీ ఎల్పీజీ ధర రూ.494.35గా ఐవోసీ నిర్ణయించింది. వినియోగదారులు ఒకసారి ఎల్పీజీ కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీగా చెల్లించే రూ.142.65 బ్యాంకు ఖాతాలో పడనుంది

183 మంది ప్రయాణికులతో రన్‌వేపై దిగిన విమానం

బెంగళూరు 183 మంది ప్రయాణికులతో రన్‌వేపై దిగిన విమానం ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనున్న పచ్చిక బయలులోకి దూసుకుపోయింది. కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. సాయంత్రం 5.40 గంటలకు దుబాయ్‌ నుంచి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ 380 విమానం రన్‌వే నుంచి మైదానంలోకి దూసుకుపోతుండటంతో అప్రమత్తమైన పైలట్‌ చాకచక్యంగా దాన్ని నిలిపివేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా విచారణకు ఆదేశించింది. ఎక్కడ తప్పు జరిగిందనేది డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) విచారణలో తేలనుంది. 2010లో రన్‌వే నుంచి విమానం కిందకు వెళ్లి ప్రమాదానికి గురవడంతో 158 మంది మరణించారు.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

న్యూఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ పలువురు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు రాహుల్‌ గాంధీని కలవనున్నారు. ఈ మేరకు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయంలో రాహుల్‌తో భేటీ అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని మే 25న రాహుల్‌ ప్రకటించారు. ఆయనకు మద్దతుగా గత 4రోజుల్లో వివిధ రాష్ట్రాల నాయకులు పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేశారు.

ముంబై రైలుమార్గంలో సోమవారం ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది.

పూణే : ముంబై రైలుమార్గంలో సోమవారం ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనతో రైల్వే అధికారులు ముంబై- పూణే మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు. ముంబై- పూణే మార్గంలో సోమవారం ఉదయం జంబుర్గ్- థాకూర్ వాడీ రైల్వేస్టేషన్ల మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ముంబై నుంచి పూణేకు రావాల్సిన పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ముంబై-పూణే నగరాల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లను ఇగత్‌పురి రైల్వేస్టేషను మీదుగా దారి మళ్లించారు

ఈ నెల 2,3 తేదీల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

కుప్పం:  ఈ నెల 2,3 తేదీల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తనను కుప్పం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిపిస్తూ వస్తున్నందుకు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పడానికి ఈ పర్యటన చేయనున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో వీలైననన్నీ ఎక్కువ గ్రామ పంచాయతీలలో చంద్రబాబు పర్యటన సాగేలా స్థానిక టీడీపీ నాయకులు రూట్‌ మ్యాప్‌ రూపొందించారు. ఖచ్చితమైన కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. ఖచ్చితమైన కార్యక్రమాలను సోమవారం సాయంత్రానికి ఖరారు చేసే అవకాశం ఉంది. చంద్రబాబు కుప్పం పర్యటన వివరాలను ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ ఆదివారం విలేకరులకు వివరించారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడి ఆలయంలో భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ నిబంధన సోమవారం నుంచే అమలుకానుంది.

అన్నవరం:  ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడి ఆలయంలో భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ నిబంధన సోమవారం నుంచే అమలుకానుంది. తొలుతగా కేవలం ఆర్జితసేవలకు మాత్రమే ఈ నిబంధన పరిమితం చేశారు. కానీ ప్రస్తుతం వ్రతాలు, కల్యాణాలు, హారతిసేవ, సహస్రదీపాలంకరణ తదితర సేవల్లో పాల్గొనే పురుషులు తప్పనిసరిగా పంచె, కండువా, కుర్తా, పైజమా... మహిళలు చీర, జాకెట్టు చున్నీతో కూడిన పంజాబీడ్రెస్‌ ధరించాలి. ఇప్పటికే తిరుపతి, విజయవాడ తదితర దేవస్థానాల్లో వస్త్రధారణ నిబంధనలు అమలుచేస్తుండగా ఆ జాబితాలో అన్నవరం చేరింది. దీనికి సంబంధించి దేవస్థానం అధికారులు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్త్రత ప్రచారం చేపట్టారు. రత్నగిరిపై పలు ప్రధాన కూడళ్లలో భక్తులకు తెలిసేవిధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నిబంధన తెలియని భక్తులు ఎవరైనా వచ్చినా వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆప్కో, ఖాదీల ద్వారా రత్నగిరిపై తక్కువధరలో దుస్తులు విక్రయాలు చేపట్టారు. ఆదిలోనే నిబంధన కఠినతరం చేయకుండా కొంత సడలింపు ఇవ్వాలని పలువురు భక్తులు కోరుతున్నారు. సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తుల్లో 70శాతంమంది వ్రతాలు ఆచరించుకునేవారుంటారు. దీంతో రత్నగిరిపై

అమెరికాలోని డాలస్​లో ఓ ప్రైవేటు విమానం కూలి 10 మంది మృతి చెందారు.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రాంతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్​ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అనంతరం సమీపంలో ఉన్న హాంగర్​(విమానాలు నిలుపు స్థలం)లోని ఈ విమానం దూసుకెళ్లిందని ఫెడరల్ ఏవియేషన్(ఎఫ్​ఏఏ) అధికారులు వెల్లడించారు. ప్రమాదం కారణంగా ఘటన స్థలంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలను గుర్తించి వారికి సమాచారం అందించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానంలో ఉన్నవారందరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఎఫ్​ఏఏ దర్యాప్తు ప్రారంభించింది.

ఏడాది చివరివరకూ ప్రత్యేకాధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి ఈ ఏడాది చివరివరకూ ప్రత్యేకాధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విశాఖ,గుంటూరు,ఒంగోలు,కర్నూలు,తిరుపతి కార్పొరేషన్లు, కందుకూరు మున్సిపాలిటీలకు  స్పెషల్ ఆఫీసర్ల గడువు పొడిగింపు రాజంపేట, నెల్లిమర్ల, రాజాం నగర పంచాయతీలకు  ప్రత్యేక అధికారుల కొనసాగింపు.

ఈ ఏడాది చివరివరకూ ప్రత్యేకాధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి ఈ ఏడాది చివరివరకూ ప్రత్యేకాధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విశాఖ,గుంటూరు,ఒంగోలు,కర్నూలు,తిరుపతి కార్పొరేషన్లు, కందుకూరు మున్సిపాలిటీలకు  స్పెషల్ ఆఫీసర్ల గడువు పొడిగింపు రాజంపేట, నెల్లిమర్ల, రాజాం నగర పంచాయతీలకు  ప్రత్యేక అధికారుల కొనసాగింపు.

గిరగిరా తిరిగిన హెలికాప్టర్.. బీజేపీ MPకి తప్పిన ప్రమాదం

గిరగిరా తిరిగిన హెలికాప్టర్.. బీజేపీ MPకి తప్పిన ప్రమాదం...... రాజస్థాన్ లోని అల్వార్ ఎంపీ మహంత్ బాలక్ నాథ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన హెలికాప్టర్ లో.. కోటకాసీమ్ లోని లాడ్ పూర్ కు వచ్చారు. అయితే.. హెలిప్యాడ్ దగ్గరకు … వచ్చాక హెలికాప్టర్ లో టెక్నికల్ ఫాల్ట్ వచ్చింది. సరిగా ల్యాండింగ్ చేయలేకపోయాడు పైలట్.  కంట్రోల్ తప్పిన హెలికాప్టర్… హెలిప్యాడ్ కు కొద్ది దూరంలో.. గాల్లో నాలుగైదు రౌండ్లు కొట్టింది. పైలట్ చివరకు.. ఎలాగోలా హెలికాప్టర్ ను కంట్రోల్ లోకి తెచ్చాడు. రౌండ్లు కొడుతున్న హెలికాప్టర్ ను మళ్లీ గాల్లోకి తీసుకెళ్లగలిగాడు. ల్యాండింగ్ ప్రాబ్లమ్ ఉండటంతో.. అలాగే వెనక్కి తీసుకెళ్లాడు.

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

అమరావతి ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు ఉదయం 10.30 నుంచి 12.30 వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేసిన డీజీపీ ప్రజల వద్ద నుంచి వచ్చే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా ఏర్పాటు వచ్చిన అర్జీలు, ఫిర్యాదుల పై ఎటువంటి చర్యలు తీసుకున్నారో అర్జీదారునికి తెలపాలని ఆదేశాలు ఇచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్ వచ్చిన ప్రతి ఫిర్యాదు కంప్యూటర్ లో  రిజిస్ట్రేషన్ చేసే విధంగా కార్యాచరణ.

చిలకలూరిపేట లో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురు మృతి

గుంటూరు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున  జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది తిరుపతి నుండి దైవ దర్శనం చేసుకొని పాలకొల్లు వెళ్తున్న 11 మంది భక్తులతో కూడిన ఫార్చ్యూన్ వాహనం ఆగి ఉన్న లారీని శరవేగంతో ఢీకొనడంతో వాహనంలో ఉన్న ఐదుగురు, ఇద్దరు పిల్లలు ముగ్గురు పెద్ద వాళ్లతో మొత్తం ఐదుగురు సంఘటనా స్థలంలో మరణించారు మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి ఆరుగుర్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు వాహనంలో డ్రైవరు ఇరుక్కుపోవడంతో జెసిబి సాయంతో బయటకు తీసి రక్షించారు వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బు వారి పాలెం గ్రామానికి చెందిన వారు, వీరంతా ఫోటోగ్రఫీ పూర్తిగా చేసుకుంటూ ఇరు కుటుంబాల వారు తిరుపతి దైవ దర్శనం నిమిత్తం వెళ్లి వస్తుండగా ఈ ఘోర సంఘటన జరిగింది నరసరావుపేట డి.ఎస్.పి రామ వర్మ హుటాహుటిన చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు మృతులు...1) సూర్య భవాని 22 సంవత్సరాలు, 2)వెంకట్ 30 సంవత్సరాలు, 3)గీతేశ్వరి బాబు 4 సంవత్సరాలు,4) సోనాక్షి 5 సంవత్సరాలు, 5)మనోజ్  22 సంవత్సరాలు.

దళిత యువకుడితో లేచిపోయిందని.... చెల్లెల్ని చితకబాదిన అన్నలు

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తమ కులం కాని వ్యక్తిని ప్రేమించి...అతడితో లేచిపోవడానికి ప్రయత్నించిందని యువతిని పట్టుకొని చావబాదారు... ఆమె కుటుంబసభ్యులు. బైక్‌పై వెళ్తున్న యువతిని పట్టుకొని కర్రలతో దారుణంగా కొట్టారు. ఆమె వద్దని బతిమాలాడిన వినిపించుకోలేదు. జూన్ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగోలోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో ధర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే యువతికి కుటుంబసభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు అన్నల్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 22 ఏళ్ల యువతి దళిత యువకుడ్ని ప్రేమించింది.అతడితో తన జీవితం పంచుకోవాలనుకుంది. ఈవిషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు ఆమెను వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. తమకులానికి చెందిన వ్యక్తిని పెళ్లాడాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యుల కంటపడింది. బైక్‌పై వెళ్తున్న ఆమెను అడ్డుకున్న అన్నలు... కొండపై తీసుకెళ్లి చావబాదారు. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. వద్దని ఎంత బతిమాలాడిన వినలేదు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద

మంచు గుహ కాదు... మోదీ గుహ... పాపులర్ అయిపోయిందిగా...

మీకు గుర్తుండే ఉంటుంది. లోక్ సభ ఎన్నికల ప్రచారం తర్వాత... మే 18న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ప్రత్యేక గెటప్‌లో కనిపించిన ఆయన కాస్ట్యూమ్స్‌పై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. అదే రోజున ఆయన అక్కడి ఓ గుహలో రాత్రంతా ధ్యానం చేశారు కదా. అప్పట్లో ఆయన ధ్యానం చేస్తున్న ఫొటో వైరల్ అయ్యింది. ఇప్పుడా గుహకు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. అక్కడకు వెళ్లే పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. రద్దీ ఎంతలా అయిపోయిందంటే... ముందుగా బుకింగ్స్ కూడా చేసుకుంటున్నారట. మామూలుగా ఆ గుహ సందర్శనకు ఆన్‌లైన్ బుకింగ్ ఉంటుంది. ఐతే... ఇదివరకు ఎవరూ అక్కడకు పెద్దగా వెళ్లేవాళ్లు కాదు. ఇప్పుడు సీన్ మారింది. ఏకంగా జులై మొత్తానికీ బుకింగ్స్ అయిపోయాయి. జులైలో కొత్తగా బుకింగ్స్ లేవంటున్న అధికారులు... కావాలంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్‌కి బుకింగ్స్ చేసుకోమని చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఆ నెలల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్‌లు కొనసాగుతుంది. ఈ గుహ ఇదివరకు లేదు. ఏడాది కిందట ఏర్పడింది. తర్వాత దాన్ని మనుషులు దూరగలిగేలా డెవలప్ చేశారు. అయినప్పటికీ ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.

ఆర్.ఎస్ కు ఎస్కార్ట్ కొనసాగింపు

శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కు ఇటీవల కొత్త ప్రభుత్వం ఆయన ఎస్కార్ట్ ను తొలగించింది. అయితే ఇదే  అంశాన్ని  డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం శాసనమండలిలో లేవనెత్తారు. పునరాలోచన చెసిన ప్రభుత్వం కేబినేట్ హోదాలో ఉన్న సుబ్రహ్మణ్యం కు   ఎస్కార్ట్ ను ఈరోజు నుండి పునరుద్ధరించింది.

పంజాగుట్టలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. జర్నలిస్ట్ దుర్మరణం

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట ప్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్‌ వైపు వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న పత్రికా జర్నలిస్ట్ మహ్మద్ తాజుద్దీన్ అనే వ్యక్తి ప్లైఓవర్‌పై నుంచి కిందపడి మృతి చెందాడు. మరోవైపు బైక్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతుడు కరీంనగర్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. అయితే కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో బీభత్సం సృష్టించడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని వాహనదారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.