అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది.

ఒసాకా: అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. ఇరు దేశాధినేతలు అర్థాంతరంగా రద్దయిన వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించడానికి అంగీకరించినట్లు సమాచారం. అలాగే చర్చలు ఓ కొలిక్కి వచ్చే వరకూ ఎలాంటి పన్ను పెంపు ఉండబోదని ట్రంప్‌ హామీ ఇచ్చినట్లు చైనా అధికారిక మీడియా పేర్కొంది. మేలో జరగాల్సిన చర్చలు రద్దయిన విషయం తెలిసిందే. దీంతో చైనా వస్తువులపై సుంకాలు పెంచుతామన్న ట్రంప్‌ నిర్ణయం తాజా ప్రకటనతో నిలిచిపోయినట్లే. అంతకు ముందు ఒసాకా వేదికగా జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న ఇరువురు వాణిజ్య యుద్ధం ముగింపు దిశగా సానుకూల ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఆ వెనువెంటనే ఈ ప్రకటన రావడం గమనార్హం. 
అయితే దీనిపై అమెరికా నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చైనాతో బలమైన సంబంధాలు కోరుకుంటున్నామని.. అందుకు చైనా కూడా సిద్ధంగా ఉందని ట్రంప్‌ ద్వైపాక్షిక సమావేశంలో పేర్కొన్నారు. చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని, ఘర్షణ వల్ల ఇరు దేశాలకు నష్టమని వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ సైతం అమెరికాతో మెరుగైన సంబంధాల దిశగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అందుకనుగుణంగానే ప్రస్తుత ప్రకటన వెలువడడం విశేషం. 
చైనా నుంచి అమెరికాలోకి దిగుమతి అవుతున్న 250 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25శాతం పన్నును పెంచిన విషయం తెలిసిందే. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయానికి బదులుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సైతం అమెరికా నుంచి చైనాలోకి దిగుమతి అవుతున్న 110 బిలియన్ అమెరికన్‌ డాలర్ల వస్తువులపై పన్నులను పెంచారు. జూన్‌ 2018లో ప్రారంభమైన ఈ వాణిజ్య యుద్ధం ఇప్పటి వరకు కొనసాగింది

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..