బిస్కెట్లు వద్దు... ఇకపై మీటింగ్స్‌లో హెల్తీ స్నాక్స్ మాత్రమే... కేంద్రం ఆదేశం.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ... అధికారిక సమావేశాల్లో ఆరోగ్యకరమైన స్నాక్స్ మాత్రమే ఇవ్వాలనే కండీషన్ పెట్టింది. ఇప్పటివరకూ ఇస్తున్న బిస్కెట్లను ఇకపై ఇవ్వరాదని ఆదేశించింది. ఇకపై అధికారిక మీటింగ్స్‌లో వేపిన శనగలు, బఠాణీలు, బాదం, ఖర్జూరాలు, వాల్‌నట్స్ వంటివి మాత్రమే ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఆదేశించారు. అందువల్ల ఇకపై ప్రభుత్వ క్యాంటీన్లలో బిస్కెట్ ప్యాకెట్లు కనిపించవు. మీటింగ్స్‌లో కూడా బిస్కెట్లను ఇవ్వరు. వాటి బదులుగా మరమరాలు,  శనగలు, ఖర్జూరాలు, వేపిన శనగలు, బాదంపప్పులు, అక్రోట్లు వంటి ఆరోగ్యకరమైన ఆహార చిరుతిళ్లు, పప్పులు, గింజలను మాత్రమే అందుబాటులో ఉంచుతారు.

అధికారిక సమావేశాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను అమ్మరాదని ఇదివరకు ఆరోగ్య శాఖ ఇచ్చిన ఆదేశాల్ని మరోసారి గుర్తుచేశారు హర్షవర్ధన్. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో వాటర్ తాగడం ఆరోగ్యానికి హానికరమని కేంద్ర ఆరోగ్య శాఖ భావించింది. బిస్కెట్లలో మైదా అనేది ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు చెబుతుండటంతో... బిస్కెట్ల బదులు... ఆరోగ్యానికి మేలు చేసే... హెల్తీ స్నాక్స్ మాత్రమే ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..