ప్రభుత్వం ప్రతి పనికీ  గడువు పెట్టింది.

ఏదైనా ధ్రువీకరణ పత్రం పొందాలంటే సవాలక్ష సమస్యలు. కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయే వారు చాలా మందే ఉన్నారు. అధికారుల అలసత్వం, ప్రజల అవగాహన లోపం, కొన్ని ప్రాంతాల్లో పని ఒత్తిడి వల్ల సకాలంలో సేవలు అందవు. అయితే ప్రభుత్వం ప్రతి పనికీ  గడువు పెట్టింది. ఏ పని ఎంత గడువు లోపల చేయాలనే స్పష్టత ఉన్నా ఆచరణలోనే ఏదీ అమలు కావడం లేదు. మనకు కావాల్సిన సేవల గురించి ముందే ఒక అవగాహన ఉంటే పని సులువుగా ఉంటుంది. కుల, ఆదాయ , స్వస్థలం వంటి ధ్రువీకరణ పత్రాలు ఎంతో అవసరం. అయితే వీటిని ఎలా పొందాలో.. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక విద్యార్థులు అయోమయానికి గురవుతుంటారు. అవసరమైన ధ్రువపత్రాలు ఎలా తీసుకోవాలి..ఒక్కో ధ్రువీకరణ పత్రం తీసుకోడానికి ఎన్ని రోజుల వ్యవధి ఉంటుంది..తదితర వివరాలు తెలుసుకుందామా.. -న్యూస్‌టుడే, అర్థవీడు
ఈబీసీ: ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు చెందిన ధ్రువీకరణ పత్రాలను ఉన్నత వర్గాలకు అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వం 10 శాతం కోటాను ఈబీసీ వర్గాలకు అమలు చేస్తోంది. ఈ ధ్రువీకరణ పత్రం అవసరమైన వారు సంబంధిత ఫారం నింపి మీసేవా కేంద్రాల్లో    సమర్పించాలి. ఈ ధ్రువపత్రం ఉపకార వేతనాలకు కూడా  ఉపయోగపడుతుంది.
విరామ పత్రం: మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో విరామ(గ్యాప్‌) ధ్రువపత్రం పొందవచ్చు. అనారోగ్య, ఇతర కారణాలతో మధ్యలో చదువులు మానేసిన వారు మళ్లీ  కొనసాగించేందుకు విద్యార్థులకు, అభ్యర్థులకు ఈ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. చదువులో విరామం ఎందుకొచ్చిందో తెలియజేయడానికి రూ.10 విలువైన స్టాంప్‌ పేపర్‌పై అఫిడవిట్‌ చేయించి, దానిపై నోటరీతో పాటు ఇద్దరు గెజిటెడ్‌ అధికారుల సంతకాలు చేయించి విద్యార్హత పత్రాలతో కలిపి మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దారు విచారించి విరామ పత్రం అందజేస్తారు. 
కుల ధ్రువీకరణ పత్రం: కుల ధ్రువీకరణ పత్రం కోసం సమీపంలోని మీసేవా కేంద్రాలకు వెళ్లి అక్కడ సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి..ఆధార్‌కార్డు, విద్యాసంస్థలు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాల నకలు, బోనోఫైడ్‌ జత చేసి దరఖాస్తు సమర్పించాలి. ఆయా పత్రాలపై గ్రామ వీఆర్వో, ఆరై, డిప్యూటీ తహసీల్దారు సంతకాలను మీసేవా సిబ్బంది చేయిస్తారు. అనంతరం అంతర్జాలంలో వివరాలు నమోదు చేసి రెవెన్యూ కార్యాలయాలకు పంపిస్తారు. దీంతో మీసేవా నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు డిజిటల్‌ సంతకాల ద్వారా ఆమోదించి మళ్లీ మీసేవాకు పంపుతారు. విద్యార్థులు కేంద్రానికి వెళ్లీ కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవచ్చు. 
ఆదాయం: ఈ ధ్రువీకరణ పత్రాన్ని మీసేవా కేంద్రం ద్వారా పొందాలి. ఆధార్, రేషన్‌కార్డు, విద్యార్హతల టీసీలు, ఇంటి పేరుతో ఉన్న తల్లిదండ్రులు గుర్తింపు కార్డులను దరఖాస్తు పత్రాలకు జతచేసి మీసేవాలో అందజేయాలి. 
నివాసం: నివాస ధ్రువీకరణ పత్రం మీసేవా కేంద్రం ద్వారా ఆధార్, రేషన్‌కార్డులో పాటు నివాసం ఉంటున్న ప్రాంతానికి సంబంధించిన చిరునామా.. గుర్తింపు కార్డులు, బోనోపైడ్‌ పత్రాలు ముఖ్యం. వీటిపైన గ్రామ వీఆర్వో సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ పత్రాలను పూర్తి చేసి మీసేవా కేంద్రంలో అందజేస్తే అక్కడి నుంచి రెవెన్యూ కార్యాలయానికి చేరుతాయి. అధికారులు విచారించి నివాస పత్రాన్ని అందజేస్తారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..