పవన్ కళ్యాణ్ ఏం చేయాలనుకుంటున్నాడు.. కొత్త లుక్ వెనక ఆంతర్యం ఏంటి..
పవన్ కళ్యాణ్ లుక్ చుసిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి మరి. తానా సభలకు వచ్చిన పవన్ లుక్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారిప్పుడు. ఇది చూసిన తర్వాత ఈయన సినిమాలు చేస్తాడేమో అనే ఆసక్తి మొదలైంది. పైగా ఫ్యాన్స్‌కు కావాల్సింది కూడా ఇదే. వాళ్లు కూడా ఇప్పుడు ఇదొక్కటే అడుగుతున్నారు. ఒక్క సినిమా సర్.. ప్లీజ్ ఒకే ఒక్క సినిమా చేయండి.. ఆ తర్వాత మీ యిష్టం అంటున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. పవన్ కళ్యాణ్ అద్భుతమైన కెరీర్ ఫ్లాప్ సినిమాతో ముగిసిపోకూడదని వాళ్ల భయం. పవన్ కళ్యాణ్ తానా మహాసభలు 2019 అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ సినిమాతో ముగించే కంటే కూడా ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా చేసి ఆగిపోండి అంటూ అడుగుతున్నారు. అయితే దీనిపై పవన్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. తన దృష్టి మొత్తం ఇప్పుడు జనసేనపైనే ఉందంటున్నాడు. రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టాడు. అది పూర్తైన తర్వాత ఎవరూ ఊహించని విధంగా కొత్త లుక్‌లోకి వచ్చాడు పవర్ స్టార్. అప్పటి వరకు జనసేన అధినేతగా కనిపించిన ఆయన సడన్‌గా ఉన్నట్లుండి పవర్ స్టార్ అయిపోయాడు. దాంతో ఇప్పుడు ఈయన లుక్ ఇండస్ట్రీలో కొత్త చర్చలకు తెర...