Posts

Showing posts with the label వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఏడవసారి భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి
Image
న్యూఢిల్లీ: వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఏడవసారి భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలయిన నేపధ్యంలో మన దేశంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో విజయం సొంతం చేసుకున్న టీమ్ ఇండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో ‘పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా మరో సర్జికల్ స్ట్రయిక్ చేసింది. భారత్ టీమ్ మొత్తానికీ అభినందనలు. ఈ అత్యద్భుత విజయం ప్రతీ భారతీయునికీ గర్వకారణమని’ పేర్కొన్నారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి రిజిజు తన ట్వీట్‌లో ‘హిందుస్థాన్ గెలుసుందని, పాకిస్తాన్ ఓడిపోతుందని ముందే చెప్పాం. ఇండియన్ టీమ్‌కు అభినందనలు’ అని రాశారు.