న్యూఢిల్లీ:

వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఏడవసారి భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలయిన నేపధ్యంలో మన దేశంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.

ఈ నేపధ్యంలో విజయం సొంతం చేసుకున్న టీమ్ ఇండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో ‘పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా మరో సర్జికల్ స్ట్రయిక్ చేసింది.

భారత్ టీమ్ మొత్తానికీ అభినందనలు. ఈ అత్యద్భుత విజయం ప్రతీ భారతీయునికీ గర్వకారణమని’ పేర్కొన్నారు.

కేంద్ర క్రీడాశాఖ మంత్రి రిజిజు తన ట్వీట్‌లో ‘హిందుస్థాన్ గెలుసుందని, పాకిస్తాన్ ఓడిపోతుందని ముందే చెప్పాం. ఇండియన్ టీమ్‌కు అభినందనలు’ అని రాశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?