టాప్ 10 న్యూస్‌ - 10 AM,

1. విజయనిర్మల కన్నుమూత

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. సుప్రసిద్ధ నటులు సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి అయిన ఆమె వయస్సు 73 సంవత్సరాలు. వీరిద్దరూ సుమారు 50 చిత్రాల్లో కలిసి నటించారు. ఏడేళ్ల వయస్సులో తమిళ చలనచిత్ర రంగప్రవేశం చేసిన ఆమె 200లకు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. 44 సినిమాలకు దర్శకత్వం వహించి ‘అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ’గా గిన్నిస్‌ రికార్డును సాధించారు. 15కు పైగా చిత్రాలను నిర్మించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. శంకుస్థాపనలకు సర్వం సిద్ధం

తెలంగాణ కొత్త సచివాలయం, శాసనసభ భవనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం, చట్టసభ నిర్మాణాలు చాలా ప్రాధాన్యమైనవి కావడంతో రెండు కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు ప్రస్తుత సచివాలయం డి-బ్లాక్‌ వెనుకభాగంలోని తోటలో సచివాలయ భవనానికి, 11 గంటలకు ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఆవరణలో శాసనసభ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాష్ట్ర విధ్వంసానికి నాంది: తెదేపా నేతలు

‘‘దాడుల పట్ల కార్యకర్తలు సంయమనం పాటించాలి. బాధిత కుటుంబాలకు పార్టీ నేతలు అండగా ఉండాలి. ఆయా ప్రాంతాల్లో పర్యటించి వారికి భరోసా కల్పించాలి. దాడులు, దౌర్జన్యాలపై డీజీపీని కలిసి వినతిపత్రం అందించాలి’’అని ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో బుధవారం ఉండవల్లిలో తెదేపా ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజావేదికను కూల్చేయడం ద్వారా రాష్ట్ర విధ్వంసానికి వైకాపా ప్రభుత్వం నాంది పలికిందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇక సుజల భారత్‌

దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ప్రజలకు నీళ్లు దొరకడం లేదు. పలుచోట్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో జల సంరక్షణను ప్రజా ఉద్యమంలా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా సీనియర్‌ అధికారులను  నియమించింది. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ‘జల్‌శక్తి అభియాన్‌ (జేఎస్‌ఏ)’లో భాగంగా వీరంతా ఆయా జిల్లాల్లో జల సంరక్షణ, సమర్థ నీటిపారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయి: ఆర్‌బీఐ

వివిధ నాణేల చెల్లుబాటుపై రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టతనిచ్చింది. 50 పైసలు, 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణేలన్నీ చెల్లుతాయని తెలిపింది.అన్నిరకాల నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని ఆర్‌బీఐ బుధవారం స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆటో ప్రయాణం మరింత భద్రం!

రాత్రి వేళల్లో ఆటోలో వెళ్లే ప్రయాణికుల భద్రతను పెంపొందించేలా సరికొత్త ఫీచర్‌ను ‘గూగుల్‌ మ్యాప్స్‌’ అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే వారి భద్రతకు ఢోకా లేకుండా ‘స్టే సేఫర్‌’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘‘అనుకున్న దారిలో కాకుండా మరో మార్గంలోకి వాహనం వెళ్లగానే... వినియోగదారుల కుటుంబ సభ్యులు, మిత్రులకు వాహనం వెళ్తున్న మార్గాన్ని ఈ ఫీచర్‌ తెలియజేస్తుంది. అంతేకాదు. వాహనం ప్రస్తుతం ఎక్కడుందో తెలుసుకునేలా ‘లైవ్‌ స్టేటస్‌’ను కూడా వారికి అందుబాటులో ఉంచుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నేడు విండీస్‌తో భారత్‌ ఢీ

ప్రపంచకప్‌లో గత మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై కష్టపడి గెలిచిన భారత్‌ జట్టు మరో సమరానికి సిద్ధమైంది. గురువారం జరిగే పోరులో కోహ్లి సేన.. వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో విండీస్‌ ఫామ్‌ చూస్తే భారత్‌కే విజయావకాశాలు ఎక్కువ. 5 మ్యాచ్‌లు ఆడి 9 పాయింట్లతో ఉన్న టీమ్‌  ఇండియా.. ఈ మ్యాచ్‌లో నెగ్గితే సెమీఫైనల్‌ అవకాశాలు మరింత మెరుగవుతాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ అదరగొట్టింది. 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 1 నుంచి సుప్రీంలో కొత్త రోస్టర్‌ విధానం

వేసవి సెలవుల అనంతరం జులై 1 నుంచి సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి కొత్త రోస్టర్‌ విధానాన్ని ప్రకటించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాల(పిల్‌)ను ఇకపై సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన ఐదు ధర్మాసనాలు విచారించనున్నాయి. ఎన్నికల అంశాలను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంతోపాటు జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం కూడా విచారించనుంది. కోర్టు ధిక్కార వ్యాజ్యాలను జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర, జస్టిస్‌ యు.యు.లలిత్‌ ధర్మాసనాలు విచారిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విశ్రాంత ఉద్యోగికి రూ.100 కోట్ల ఆస్తులు!

పదవీ విరమణ పొందేనాటికి సురేశ్‌ ఉపాధ్యాయ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఓ సబ్‌ డివిజనల్‌ స్థాయి అధికారి. ఆయనపై పలు ఫిర్యాదులు రావటంతో సోదాలు నిర్వహించిన మధ్యప్రదేశ్‌ ఆర్థిక నేర విభాగం అధికారులు ఆయన కూడగట్టిన ఆస్తులను చూసి నివ్వెరపోయారు. దాడుల్లో రూ.100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. భార్య, కుమారుడి పేర్ల మీద 70 ఎకరాల భూములున్నాయి. కేజీ బంగారం, 5 కేజీల వెండి, రూ.2.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజ్‌వర్దన్‌ మహేశ్వరీ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కాంగ్రెస్‌ పార్టీది దురహంకారం

కాంగ్రెస్‌ పార్టీ తన దురహంకారం వల్లే ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని, అందుకే ఈవీఎంలను అనుమానిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. జమిలి ఎన్నికల విషయంలోనూ వారి తీరు ఇలాగే ఉందని.. వాళ్లకు ఈ విషయం నచ్చినా నచ్చకపోయినా కనీసం చర్చకు ముందుకు రావాలని అన్నారు. లోక్‌సభలో తన మాటలతో నిప్పులు చెరిగిన  ప్రధాని మోదీ రాజ్యసభలోనూ అదే వాగ్దాటిని ప్రదర్శించారు. కేపి

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది