మంచు గుహ కాదు... మోదీ గుహ... పాపులర్ అయిపోయిందిగా...

మీకు గుర్తుండే ఉంటుంది. లోక్ సభ ఎన్నికల ప్రచారం తర్వాత... మే 18న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ప్రత్యేక గెటప్‌లో కనిపించిన ఆయన కాస్ట్యూమ్స్‌పై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. అదే రోజున ఆయన అక్కడి ఓ గుహలో రాత్రంతా ధ్యానం చేశారు కదా. అప్పట్లో ఆయన ధ్యానం చేస్తున్న ఫొటో వైరల్ అయ్యింది. ఇప్పుడా గుహకు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. అక్కడకు వెళ్లే పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. రద్దీ ఎంతలా అయిపోయిందంటే... ముందుగా బుకింగ్స్ కూడా చేసుకుంటున్నారట. మామూలుగా ఆ గుహ సందర్శనకు ఆన్‌లైన్ బుకింగ్ ఉంటుంది. ఐతే... ఇదివరకు ఎవరూ అక్కడకు పెద్దగా వెళ్లేవాళ్లు కాదు. ఇప్పుడు సీన్ మారింది. ఏకంగా జులై మొత్తానికీ బుకింగ్స్ అయిపోయాయి.

జులైలో కొత్తగా బుకింగ్స్ లేవంటున్న అధికారులు... కావాలంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్‌కి బుకింగ్స్ చేసుకోమని చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఆ నెలల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్‌లు కొనసాగుతుంది.

ఈ గుహ ఇదివరకు లేదు. ఏడాది కిందట ఏర్పడింది. తర్వాత దాన్ని మనుషులు దూరగలిగేలా డెవలప్ చేశారు. అయినప్పటికీ ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ప్రధాని మోదీ వెళ్లేసరికి... ఇప్పుడు చాలామంది క్యూ కడుతున్నారు. ఇదేదో బాగుందని భావిస్తున్న అధికారులు... ఇలాంటి మరో మూడు గుహలను నిర్మిస్తామని చెబుతున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..