Posts

Showing posts with the label ఇండియాతో మ్యాచ్‌కు ముందు పాక్ పరిహాసం.
క్రికెట్ వరల్డ్ కప్ 2019: ఇండియాతో మ్యాచ్‌కు ముందు పాక్ పరిహాసం... భారత పైలట్‌ మీద వ్యంగ్యంగా టీవీ యాడ్ పాకిస్తాన్ టెలివిజన్ రూపొందించిన అడ్వర్టైజ్‌మెంట్‌లోని నటుడు.. అభినందన్ తరహాలో గుబురు మీసాలతో, భారత క్రికెట్ జెర్సీ ధరించి కనిపిస్తాడు. ఈ వీడియోలో తనను అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వటానికి ఆయన నిరాకరిస్తాడు. కానీ ఈ వీడియోలో.. రాబోయే భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ గురించి ప్రశ్నలు అడుగుతారు. భారత జట్టులో ఎవరెవరు ఉంటారు?' వంటి ప్రశ్నలు అడుగుతారు. ఒక టీ కప్పుతో టీ తాగుతున్న నటుడు అభినందన్ తరహాలో 'క్షమించండి.. ఆ వివరాలు నేను చెప్పకూడదు' అని బదులిస్తాడు. అనంతరం అతడిని విచారణ నుంచి వెళ్లిపోవచ్చని చెప్తారు. అతడు వెళ్లిపోతుంటే మళ్లీ ఆపి చేతిలో ఉన్ కప్‌ను ఇచ్చి వెళ్లాలని నిర్దేశిస్తారు. క్రికెట్ ప్రపంచ కప్‌ ట్రోఫీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అది. భారత్ - పాకిస్తాన్‌ల మధ్య ఇటీవల జరిగిన తీవ్ర ఉద్రిక్త సంఘటనను వ్యంగ్యంగా మలచి క్రికెట్‌కు అన్వయించిన అడ్వర్టైజ్‌¿మెంట్ ఇది. ఈ యాడ్ భారత్‌లో చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. ఈ రకంగా యాడ్ తయారుచేసి ప్రసారం చేయటం ''స...