కేరళలో ఇప్పటికే వ్యాపించిన నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఇంకా ఆలస్యంగా రానున్నాయి.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడమే దీనికి కారణం .దీనివల్ల భారతదేశానికి ఎటువంటి ప్రయోజనం లేకపోగా, రుతుపవనాల వ్యాప్తికి మాత్రం ఆటంకం కలుగుతుందని ఐఎండి తెలిపింది. రుతుపవనాలు ఆలస్యం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాలులు రానున్న రెండు రోజుల్లోకొనసాగనున్నాయి. మరోవైపు క్యుములో నింబస్‌మేఘాలకారణంగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, 30 నుండి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు సోమవారం ఉత్తరకోస్తా, యానాం తదితర ప్రాంతాల్లో అక్కడక్కడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో జల్లులు, పిడుగులు, ఉరుములు పడ్డాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో వేడి గాలులు కొనసాగాయి