గుంటూరు జిల్లా:- అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని సతైనపల్లి రూరల్ పోలీసులు గురవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. సతైనపల్లి మండలం బృగుబండ వైపు నుండి పిడుగురాళ్ల వెపు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచరం మేరకు. రూరల్ పోలీసులు మాటు వేసి లారీ ని తనిఖీ చేశారు. లారీ లో 400 బస్తాలు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. లారీని స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు...