Posts

Showing posts from September, 2019

ఈ `ఆకు`తో సంతానం గ్యారెంటీ అంటున్న పరిశోధకులు..

ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతోంది. బిజీ లైఫ్‌లో మానసిక ఒత్తడి, వాతావరణ కాలుష్యం పెరగడం, జీవనశైలి, పౌష్టికాహారంలోపంవల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి సంతానలేమి సమస్యకు దారితీస్తోంది. ఇది ప్రస్తుత సమాజంలో అతిపెద్ద సమస్యగా మారింది. దీనికోసం వైద్యుల వద్ద లక్షలు ఖర్చు పెడెతున్నారు. అయితే మన సనాతన ఆయుర్వేదంలో దీనికి ఒక ఆకు దివ్యౌషదంగా తేలింది. పరిశోధనల్లో వీర్యకణాల వృద్ధిని ఈ చెట్టు ఆకు అద్భుతంగా పనిచేస్తుందని తేలిసింది. అదే 'జామ ఆకు'. జామ ఆకుల జ్యూస్ తాగడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి బాగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జామ ఆకులతో సంతానలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు. వాస్తవానికి జామ ఆకుల వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నట్టు పరిశోధనలో వెల్లడైంది. ముఖంగా జామఆకుల్లో ఆరోగ్య ప్రయోజనాలను చూసినట్లైతే జామఆకుల్లో నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే. మాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి.జామా ఆకులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మనకు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అలాగే శరీరంలో చెబు కొవ్వును తొలగించి బరువును అదుపులో ఉంచుతుంది.

వాల్మీకి సినిమా నిలుపుదల

అనంతపురం జిల్లాలో వాల్మీకి సినిమా నిలుపుదల చేస్తు కలెక్టర్ ఆదేశాలు...

దసరా సెలవులు ....

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు వర్తించనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సందర్భంగా సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మరియు ఇతర విద్య సంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9వరకూ దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

తల్లి కొడుకు హత్మా హత్యయత్నం

కృష్ణజిల్లా : గుడివాడ శోభన హోటల్ లో తల్లి కొడుకు హత్మా హత్యయత్నం కొడుకు చైతన్య(31)మృతి తల్లి జానకిదేవి (57) పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు ఈ నెల 9వ తేదీ నుండి హోటల్ లో రూమ్ నెంబర్ 204 లో వుంటున్నారు వీరూ హైదరాబాద్ రంగారెడ్డిజిల్లా సరూర్ నగర్ కి చెందిన వారీగా గుర్తింపు.

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.37,660, విశాఖపట్నంలో రూ.39,170, ప్రొద్దుటూరులో రూ.37,000, చెన్నైలో రూ.37,770గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.35,910, విశాఖపట్నంలో రూ.36,030, ప్రొద్దుటూరులో రూ.34,300, చెన్నైలో రూ.36,200గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.46,700, విశాఖపట్నంలో రూ.47,500, ప్రొద్దుటూరులో రూ.46,800, చెన్నైలో రూ.50,300 వద్ద ముగిసింది.

వివిధ కోర్టుల్లో ఏళ్లతరబడిగా పెండింగులో ఉన్న క్రిమినల్ కేసుల పరిష్కారం ఇక సత్వరం జరగనుంది

లక్నో .  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి ఈ ప్రాసిక్యూషన్ విధానాన్ని మొదటిసారి అమలు చేయాలని యూపీ సర్కారు నిర్ణయించింది. యూపీలో మరో వారం రోజుల్లో కేసుల సత్వర దర్యాప్తునకు ఈ ప్రాసిక్యూషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు యూపీ రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రిన్సిపల్ కార్యదర్శి అవనీష్ అవస్థీ వెల్లడించారు. దీనిలో భాగంగా లక్నో నగరంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో న్యాయశాఖ అధికారులు, ఉద్యోగులు, పోలీసులకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. కోర్టులో సాక్షులు హాజరయ్యేందుకు వీలుగా వారికి ఎస్ఎంఎస్ లు అందించాలని, ప్రభుత్వ న్యాయవాదులకు మొబైల్ ఫోన్ ద్వారానే కేసుల దర్యాప్తు తేదీలను తెలియజేయాలని యూపీ డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు. కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ ప్రాసిక్యూషన్ విధానంలో డేటాబేస్ ను ఏర్పాటు చేశామని సర్కారు ప్రకటించింది.

నేడు ప్రధాని నరేంద్రమోదీ 69వ పుట్టినరోజు

గుజరాత్ నేడు ప్రధాని నరేంద్రమోదీ 69వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా గుజరాత్​లోని సర్దార్​ సరోవర్​ జలాశయాన్ని సందర్శించనున్నారు. అనంతరం 'నమామి దేవి నర్మదా' ఉత్సవాన్ని ప్రారంభించి.. నర్మదా జిల్లా కేవడియా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు ప్రధాని జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా జరిపేందుకు భాజపా ఏర్పాట్లు సిద్ధం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది

అమరావతి ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల శివప్రసాదరావు చనిపోయారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ...రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది . నేడు, రేపు సంతాప దినాలుగా పాటించనుంది. అన్ని నియోజకవర్గాల్లో నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కోడెల సంతాప సభలు ఏర్పాటు చేయడంతోపాటు...పార్టీ కార్యాలయలపై జెండాలను అవతనం చేయాలని సూచించారు. కోడెల ఆత్మహత్య చేసుకోవాడానికి దారితీసిన పరిస్థితులు...ప్రభుత్వం వేధింపుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు వైకాపా కుట్రలపై ఐక్యంగా పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రైల్లో చెలరేగిన మంటలు

సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు సూపెర్ఫాస్ట్ రైల్లో చెలరేగిన మంటలు ..భయాందోళనలో  ప్రయాణికులు... A1 .B1 ఏసీ బోగీల్లో ఫైర్...

'పల్నాడు పులి' కోడెల శివప్రసాద్ ఇకలేరు..

హైదరాబాద్:  ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కోడెల తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా.. గత కొన్ని రోజులుగా ఈయన్ను కేసులు చుట్టుముట్టడంతో.. రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. కోడెలను గుంటూరులో ఆయన అభిమానులు, అనుచరులు 'పల్నాడు పులి'గా పిలుచుకుంటూ ఉంటారు.

బోటు ప్రమాద ఘటన వివరాల కోసం అధికారులు కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేశారు

అమరావతి:  బోటు ప్రమాద ఘటన వివరాల కోసం అధికారులు కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేశారు . ఏపీలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూముల ద్వారా ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కల్పించారు.   కాకినాడ- 18004253077 రాజమహేంద్రవరం 0883 2442344 ఎటపాక సబ్‌ కలెక్టరేట్‌- 0874 8285279 రంపచోడవరం- 1800 4252 123 అమలాపురం ఆర్డీవో- 0885 6233100 కాకినాడ ఆర్డీవో- 0884 2368100 రంపచోడవరం ఆర్డీవో- 0885 7245166 విశాఖ కలెక్టరేట్‌- 1800 425 00002 ప.గో. కలెక్టరేట్‌- 1800 233 1077 మచిలీపట్నం కలెక్టరేట్‌- 08672 252847

గాలింపు చర్యలు ముమ్మరం

బోటు ప్రమాదం నేపథ్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, నౌకాదళ సిబ్బంది దిగారు. సహాయ చర్యల్లో అగ్నిమాపకదళ సిబ్బంది, గజ ఈతగాళ్లు పాల్గొంటున్నారు. రెండు నౌకాదళ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.

విషాదం నింపుతున్న ఆదివారం

విషాదం నింపుతున్న ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదం పలువురు పర్యాటకుల ప్రాణాలను బలిగొంది. వారాంతపు సెలవుదినం కావడంతో విహారానికి వెళ్లిన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తెలుగు రాష్ట్రాల ప్రజలను ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో ఆదివారం కాస్తా విషాదాదివారంగా మారింది. ఈ ఒక్క ఘటనే కాదు.. గతంలో జరిగిన పడవ బోల్తా ఘటనలూ ఆదివారమే జరగడం గమనార్హం. కృష్ణా, గోదావరి నదుల్లో గతంలో జరిగిన ఘటనలు చూస్తే ఈ విషయం అవగతమవుతోంది. విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం 2017 నవంబర్‌ 12న కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన భక్తులు బోటులో ప్రయాణిస్తుండగా అది బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు. 2018 జులైలో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో లాంచీ తిరగబడటంతో 15 మంది మృతి చెందారు.

రాజస్థాన్​లో పలు ప్రాంతాలు జలమయం

రాజస్థాన్​లో పలు ప్రాంతాలు జలమయం వరద నీటి ఉద్ధృతితో రాజస్థాన్​లోని పలు జిల్లాల్లో ఆనకట్టల గేట్లు ఎత్తివేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. చిత్తోర్​గఢ్​, కోటలో వందాలాది ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు ఇంటిపై కప్పుపై తలదాచుకున్నారు. మరికొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి.

భారీ వర్షాలకు పలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి

మధ్యప్రదేశ్​ భారీ వర్షాలకు పలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి . ఆదివారం దాదాపు 45వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 150 పునరావాస కేంద్రాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు. వరదల కారణంగా మందసౌర్​, నీమచ్​ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

యురేనియం తవ్వకాల వల్ల కలిగే నష్టాలు

హైదరాబాద్ నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల కలిగే నష్టాలపై చర్చించేందుకు సోమవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకనటలో తెలిపింది. ఇక్కడి దస్‌పల్లా హోటల్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే సమావేశానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, రేవంత్‌రెడ్డి, వి.హన్మంతరావు, అసదుద్దీన్‌ ఒవైసీ, రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కోదండరాం, చెరుకు సుధాకర్‌, తదితరులు హాజరవుతారని పేర్కొంది. సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్‌, వీహెచ్‌ ఆదివారం పరిశీలించారు.

ప్రమాద మృతుల కుటుంబాలను నేడు తెదేపా నేతల బృందం పరామర్శించనుంది

అమరావతి పడవ ప్రమాద మృతుల కుటుంబాలను నేడు తెదేపా నేతల బృందం పరామర్శించనుంది . పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో తెదేపా నేతలు నేడు రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. దుర్ఘటన పూర్వాపరాలను నేతలు అడిగి తెలుసుకోనున్నారు. బాధిత కుటుంబాలను కలిసి వారికి ధైర్యం చెప్పనున్నారు. టీడీఎల్పీ ఉపనేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, దేవినేని ఉమా మహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, జ్యోతుల నెహ్రు, ఎమ్మెల్లే ఆదిరెడ్డి భవాని తదితరులు పరామర్శించనున్నారు.

జగన్​ ఇవాళ స్వయంగా వీక్షించనున్నారు

అమరావతి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి జగన్​ ఇవాళ స్వయంగా వీక్షించనున్నారు . ప్రమాద స్థలికి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకోనున్న సీఎం జగన్... ఆ ప్రాంతాన్ని విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తారు. ఆ తరువాత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు పురపాలక కార్యాలయం వద్ద అధికారులతో ముఖ్యమంత్రి జగన్​ సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియాతో సీఎం మాట్లాడనున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని ఇప్పటికే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ప్రకటించారు.

ప్రమాదానికి గురైన బోటు(లాంచి)కి ఎలాంటి అనుమతులు లేవు:అవంతి శ్రీనివాస్ రావ్

గోదావరిలో ప్రమాదానికి గురైన బోటు (లాంచీ)కు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాయల్‌ వశిష్ట బోటును ప్రయివేట్‌ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప‍్పుతున్నట్లు చెప్పారు. మరోవైపు బాధితులను రక్షించేందుకు పర్యాటక శాఖ హుటాహుటీన రంగంలోకి దిగింది. *సహాయక చర్యలకు రంగంలోకి దిగిన హెలికాఫ్టర్‌* ఇందుకోసం టూరిజం విభాగం నుంచి రెండు బోట్లను సంఘటనా స్థలానికి పంపించారు. అలాగే సహాయక చర్యల కోసం మంత్రి అవంతి ...విశాఖ నేవీ అధికారులతో మాట్లాడారు. నేవీ హెలికాఫ్టర్‌తో పాటు అధునాతన బోట్లను ఘటనా స్థలానికి పంపించాలని కోరారు. లాంచీ మునకకు వరద ఉధృతే కారణమని తెలుస్తోంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. ఉదయభాస్కర్‌, ఝాన్సీరాణి అనే బోట్లు ప్రమాదానికి గురై అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలకు హోంమంత్రి ఆదేశం అలాగే బోటు ప్రమాదంపై హోంమంత్రి సుచరిత ఆరా తీశారు. సహాయక చర్యలపై డీజీపీ, జిల్లా ఎస్పీతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గల్లంతు అయినవారి కోసం గాలించి సరక్షిత ప

షాకింగ్ న్యూస్: చెప్పులు వేసుకుని బైక్ నడిపితే ఫైన్.. జైలు కూడా!

కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మరిన్ని మార్పులు తీసుకొస్తున్నారు. అవి వాహనదారులకు ఉపశమనం కలిగించేలా లేవు. రోడ్లమీదకు రావాలంటే వణుకు పుట్టిస్తున్నాయి. టూ-వీలర్స్ నడిపేటప్పుడు వాహనదారులు స్లిప్పర్స్ వంటివి వాడకూడదట. ఈ రూల్‌ను నిర్లక్ష్యం చేసి చెప్పులేసుకుని డ్రైవింగ్ చేస్తే.. వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. అక్కడితో అయిపోలేదు. మొదటిసారి చెప్పుల్లేకుండా డ్రైవింగ్ చేస్తే వెయ్యి రూపాయలు.. అదే రెండో సారి కూడా చేస్తే 15రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే. నవభారత్ టైమ్స్ ఆగష్టులో తెలిపిన వివరాల ప్రకారం.. రూల్ ఇప్పటికే ఉన్నా కొన్ని ప్రదేశాల్లో తప్పనిసరిగా పాటించాలని నిబంధనలు విధించడం లేదని తెలిపింది. ట్రాఫిక్ నియమాల ప్రకారంగా..చెప్పులు లేదా శాండిల్స్ వేసుకుని టూవీర్స్ నడపడం నేరం కిందకు వస్తుందని..దీనికి ఫైన్ కూడా ఉంటుందనీ వార్తలు వస్తున్నాయి. కాగా..ఈ నిబంధన కూడా వాహనదారుని భద్రత కోసమే చట్టంలో పొందుపరిచారని సమాచారం. చెప్పులు, లేదా స్లీపర్స్ వేసుకుని వాహనం నడిపే వారికి రూ. 1000 జరిమానా విధిస్తారు. అలా మరోసారి కూడా పట్టుబడితే 15 రోజుల పాటు జైలుశిక్ష విధిస్తారట.

మందు అమ్ముతాం

మందు అమ్ముతాం : సేల్స్ మెన్ ఉద్యోగాల కోసం పీజీ విద్యార్ధులు బారులు: ఎమ్మెల్యేలకు గిరాకీ..!! మద్యం అమ్మేందుకు పట్టభద్రులు..పోస్టు గ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్నారు. అక్టోబర్ నుండి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో మద్యం దుకాణాలను నిర్వహించనుంది. ఇందుకోసం సేల్స్ మెన్ .. సూపర్ వైజర్లు నియామకం ప్రారంభించింది. ఈ పోస్టుల కోసం అభ్యర్ధులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసారు. ఉన్నత విద్యా వంతులు సైతం ఈ పోస్టులు దక్కించుకోవటానికి పోటీ పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెస్తున్నారు. సచివాయల పోస్టుల పరీక్షలు పూర్తయ్యాయి. ప్రశ్నా పత్రాలు కఠినంగా ఉన్నాయని చెబుతున్న అభ్యర్దులు ఇప్పుడు మందు అమ్మటానికి సైతం ముందుకు వచ్చారు. దీంతో.. ఇప్పుడు ఏపీలో సచివాలయ పోస్టులకే కాదు..మద్యం అమ్మకాల పోస్టులకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో మద్యం దుకాణాల్లోని పోస్టులను రాజకీయ నాయకులు, అధికారులు కలిసి భారీగా ముడుపులు తీసుకుని కొందరికి కేటాయించేశారని, అందుకే తమకు సమాచారం కూడా కొందరు అభ్యర్దులు పలు ప్రాంతాల్లో ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెద్ద సంఖ్యలో విడుదల చేసిన పోస్టుల్లో సచివాలయ ఉద్యో

హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్...!

హైదరాబాద్ ఐటీ కారిడార్ లో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించటం కోసం సరి - బేసి విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదననను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తుంది. ఐటీ కారిడార్ లో భవిష్యత్తులో ఏర్పడే ముప్పును నియంత్రించటానికి పలు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది. నిన్న ఈ అంశం గురించి అధికారులు 100 మంది ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా వస్తున్న కంపెనీలు, పెట్టుబడులు, నిర్మాణాలు, కాలుష్యం, వాహన రద్దీ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సరి - బేసి విధానంలో వాహనాలను అనుమతించటంతో వాహన రద్దీని తగ్గించాలనే అంశం గురించి చర్చించినట్లు సమాచారం. కార్ పూలింగ్ విధానం ద్వారా రహేజా పార్కు - రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్క్ - ఐకియా మార్గాల్లో కార్ల రద్దీని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను పెంచాలనే ప్రతిపాదన కూడా చేసినట్లు తెలుస్తోంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ - విప్రో సర్కిల్ వరకు బీ ఆర్ టీ ఎస్ మార్గాన్ని వేగంగ

ఆంధ్రాలో అద్భుతం : 74 బామ్మ తల్లి కాబోతోంది.. నేడే సిజేరియన్..!

మహిళ ఎన్ని సాధించినా.. మాతృత్వం పొందలేకపోతే.. అదో పెద్ద వెలితిగానే ఉండిపోతుంది. అమ్మ అయినప్పుడే అమ్మాయికి పరిపూర్ణత అంటారు. కానీ ఓ యువత తల్లి కాలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ సమాజం అవన్నీ పట్టించుకోదు. ఈ విషయంలో అది మహిళ లోపంగానే భావిస్తుంది. గొడ్రాలు వంటి పదాలతో హింసిస్తుంది. తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి మంగాయమ్మ కూడా ఇదే సమస్య ఎదుర్కొంది.. ఐదేళ్లు, పదేళ్లు కాదు.. ఆమె అమ్మా అని పిలిపించుకోవడం కోసం ఏకంగా.. 50 ఏళ్లకు ఎదురు చూసింది. ఎవరైనా పెళ్లైన పదేళ్ల వరకూ పిల్లలు పుట్టకపోతే.. ఇక పట్టించుకోరు. కొందరు అంతగా పిల్లలు కావాలనుకుంటే సంతాన సాఫల్య పద్దతులవైపు వెళ్తారు. కానీ ఎర్రమట్టి మంగాయమ్మ దంపతులకు వాటి సంగతి పెద్దగా తెలియలేదు. ఎర్రమట్టి మంగాయమ్మకు.. రాజారావుతో 1962లో పెళ్లయింది. ఇప్పుడు ఆమెకు 74 ఏళ్లు.. ఇటీవల ఆమెకు తెలిసిన ఒకావిడ 55 ఏళ్ల వయసులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి అయ్యింది. ఈ విషయం తెలిసాక మంగమ్మకు తానూ తల్లిని కావాలనుకుంది. గుంటూరులోని అహల్య నర్సింగ్‌ హోమ్‌ను సంప్రదించింది. వారు కృత్రిమ పద్దతుల్లో ఆమెకు గర్భధారణ చేయించారు. మంగాయమ్మకు బీ

జియో గిగాఫైబర్​ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

ముంబై జియో గిగాఫైబర్​ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రాడ్​బ్యాండ్​, ల్యాండ్​లైన్​, టీవీ కనెక్షన్​లు ఒకే ప్యాకేజీగా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. కాంప్లిమెంటరీగా సెట్​టాప్​ బాక్స్​ను ఉచితంగా అందివ్వనున్నట్లు సమాచారం. జియో గిగా ఫైబర్​ ప్రత్యేకతలు జియో గిగా ఫైబర్​ సేవల్లో... వివిధ ప్లాన్లు రూ.700 - రూ.10,000 మధ్య లభిస్తాయి. 100 ఎంబీపీఎస్ నుంచి గరిష్ఠంగా​ 1 జీబీపీఎస్​ స్పీడ్​ వరకు ఇంటర్నెట్​ ప్లానులు ఉన్నాయి. వార్షిక ప్లాన్​ తీసుకున్నవారికి హెచ్​డీ టీవీ సెట్​ ఉచితంగా అందిస్తారు. ల్యాండ్​లైన్​ ఫోన్​, జియో 4కే సెట్​టాప్​ బాక్స్​ ఉచితంగా ఇస్తారు. జియో ఫైబర్​తో అల్ట్రా హై డెఫినిషన్​ ఎంటర్​టైన్​మెంట్​, హోమ్​ సెక్యూరిటీ, స్మార్ట్​ హోమ్ సొల్యూషన్స్​ వంటి సేవలు పొందవచ్చు. చలనచిత్రాలు, ఇతర వీడియో కంటెంట్​ మొబైల్​ యాప్స్​ ఉచితంగా లభిస్తాయి. మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్​, ఎస్​టీబీ వీడియో కాలింగ్​ సౌకర్యాలు ఇందులో లభిస్తాయి. అయితే ఇందు కోసం వినియోగదారులు తమ టీవీ సెట్​లకు కెమెరాను అనుసంధానించుకోవాలి. ల్యాండ్​లైన్​ నుంచి దేశంలో ఎక్కడికైనా అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యం

*_టుడే న్యూస్ అప్డేట్స్_*

_👉-రష్యాలో ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన.._ _👉-తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.._ _👉-నేటి నుంచి ఏపీలో కొత్త ఇసుక విధానం.._ _👉-తూ.గో జిల్లాలో చంద్రబాబు పర్యటన.._ _👉-తూ.గో నేడు,రేపు కోనసీమలో పవన్ పర్యటన.._ _👉-భారత్ లో నేటి నుంచి జియో ఫైబర్ సేవలు.._

మల్కాజిగిరి విష్ణుపురి కాలనీ లోని గణేష్ మండపం లో అగ్నిప్రమాదం

*మల్కాజిగిరి  విష్ణుపురి కాలనీ లోని గణేష్ మండపం లో అగ్నిప్రమాదం * *అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అగ్నిప్రమాదం* *తప్పిన ప్రాణ నష్టం , అగ్నికి ఆహుతి ఐన వాహనాలు* *ఫైర్ సిబ్బంది రావడంతో అదుపులోకి వచ్చిన మంటలు* మల్కాజిగిరి లోని విష్ణుపురి కాలనీలో అపస్మ్రుతి . విష్ణుపురి కాలనీలోని మైత్రీ నివాస్ అనే అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది . తప్పిన ప్రాణనష్టం , 2కార్లు 10ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయ ి , స్థానికుల సహాయంతో మిగితా వాహనాలు బయటకి తీసుకువచ్చిన అపార్ట్మెంట్ వాసులు. అగ్నిమాపకసిబ్బంది రావడంతో అదుపులోకి వచ్చిన మంటలు . మండపంలో ఏర్పాటు చేసిన అఖండ దీపం తో మంటలు వ్యాప్తించాయని చెబుతున్న స్థానికులు.

ప్రకాశం బ్యారేజ్ కి భారీ వరద నీరు

*విజయవాడ* ప్రకాశం బ్యారేజ్ కి భారీ వరద నీరు మొన్నటి వరకు అంతర్రాష్ట్ర వరద ప్రకాశం బ్యారేజీకి పోటెత్తితే, ఇప్పుడు భారీగా లోకల్‌ వరద నీరు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు బ్యారేజీకి మొదలైన వరద మున్నేరు, మధిర వాగుల నుంచి కొనసాగుతున్న నీటిప్రవాహం ఈ రెండు వాగుల నుంచి బ్యారేజీకి చేరుతున్న 30వేల క్యూసెక్కుల నీరు మొత్తం 20 గేట్లను అడుగు మేర ఎత్తి కిందకి నీటిని వదిలిన అధికారులు సముద్రం లో కలుస్తున్న 18500 వేల క్యూసెక్కుల వరద నీరు మరో 14,500 క్యూసెక్కుల నీరు కాల్వలకు వదులుతున్న అధికారులు కొద్దిరోజుల క్రితం వచ్చిన వరదల కారణంగా సుమారుగా 300 టీఎంసీల సముద్రంలోకి నిండు కుండలా కనిపిస్తున్న  ఎగువ, దిగువ భాగాలు మరో రెండు, మూడు రోజులపాటు ఖమ్మం జిల్లా నుంచి వరద నీరు వచ్చే అవకాశం వరద కారణంగా వినాయక నిమజ్జనానికి జరుగుతున్న ఏర్పాట్లకు అంతరాయం ఏటా బ్యారేజీకి దిగువన విగ్రహ నిమజ్జనాలకు ఏర్పాట్లు బ్యారేజీ 20 గేట్లను ఎత్తడంతో ఈ పనులకు ఆటంకం

వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వైకాపా ప్రభుత్వం

అమరావతి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వైకాపా ప్రభుత్వం .... ఇవాళ జరగబోయే నాలుగో మంత్రివర్గ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చించనుంది. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వంటి విధానపరమైన అంశంతో పాటు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, రివర్స్‌ టెండరింగ్‌, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, నూతన ఇసుక విధానం లాంటి..... కీలకమైన అంశాలపై నేటి మంత్రి వర్గ భేటీలో సమాలోచనలు చేయనుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదం! ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. విశ్రాంత IPS అధికారి ఆంజనేయరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై ఇప్పటికే సంబంధిత అధికారులతో సీఎం జగన్‌ చర్చించారు. రహదారి రవాణా సంస్థలోని 51 వేల మందిని యథాతథంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నారు. ఇందుకయ్యే 3 వేల 500 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వమే మోయనుంది. అయితే సంస్థను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు విలీనానికి అడ్డంకిగా మారాయి. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య ఆర్టీసీ ఆస్తుల పంపకాల విషయం పెండింగ్‌లో ఉండటం కాగా... సంస్థలో 39 శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉండ