జగన్​ ఇవాళ స్వయంగా వీక్షించనున్నారు

అమరావతి

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి జగన్​ ఇవాళ స్వయంగా వీక్షించనున్నారు.

ప్రమాద స్థలికి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకోనున్న సీఎం జగన్... ఆ ప్రాంతాన్ని విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తారు.

ఆ తరువాత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.

ఉదయం 11 గంటలకు పురపాలక కార్యాలయం వద్ద అధికారులతో ముఖ్యమంత్రి జగన్​ సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియాతో సీఎం మాట్లాడనున్నారు.

మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని ఇప్పటికే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ప్రకటించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?