Posts

Showing posts with the label రోడ్డు పక్క హోటల్‌కు అనుకోని అతిథి.. ఆశ్చర్యపోయిన జనాలు

రోడ్డు పక్క హోటల్‌కు అనుకోని అతిథి.. ఆశ్చర్యపోయిన జనాలు

ఈరోజుల్లో ఎమ్మెల్యే అంటే.. చుట్టూ మంది మార్బలం.. ఆర్భాటం అత్యంత కామన్. ఎమ్మెల్యే బయట అడుగుపెట్టాడంటే అనుచరుల హడావుడి మామూలుగా ఉండదు. అలాంటిది ఓ ఎమ్మెల్యే మాత్రం అత్యంత సాదాసీదాగా సామాన్యుడి తరహాలో ఓ హోటల్లో ప్రత్యక్షమయ్యాడు. ఆయనే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు..మంగళవారం ఏదో పని నిమిత్తం మంచిర్యాల మీదుగా వెళ్తుండగా.. అప్పటికే భోజన సమయం కావడంతో బెల్లంపల్లి చౌరస్తాలో కారును ఆపారు. సమీపంలోని ఓ హోటల్లోకి వెళ్లి సాధారణ వ్యక్తిలా గన్‌మెన్‌లతో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే హోటల్లో కనిపించడంతో ఆయన్ను గుర్తుపట్టినవారు ఆశ్చర్యపోయారు. తెలియనివారు ఆయన ఎమ్మెల్యే అని తెలుసుకుని అవాక్కయ్యారు.