జియోగిగాఫైబర్‌తో టీవీ, 4కె కనెక్షన్ కూడా.. ఎలా రిజిష్టర్ చేసుకోవాలో తెలుసుకొండిలా ..?
హైదరాబాద్ : రిలయన్స్ అంటే సంచనాలకు మారుపేరు. జియోతో 4జీ నెట్‌వర్క్‌ను సామాన్యుడి చేతిలో ఉంచారు. ఇప్పుడు జియో గిగా ఫైబర్ కూడా మరో ట్రెండ్ సెట్ చేయబోతోంది. గిగా ఫైబర్‌తో కంపెనీ భారీ ఆఫర్స్ ప్రవేశపెట్టబోతునట్టు ప్రకటించింది. దీంతో టీవీ, 4 కే కనెక్షన్, ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. అయితే మీరు ఎంపికచేసుకునే ప్లాన్‌ను బట్టి ఆఫర్స్ వర్తిస్తాయని షరతు విధించారు. వచ్చేనెల 5న జియో గిగాఫైబర్ సేవలు అందుబాటులోకి వస్తాయి. వీటి ప్లాన్స్ రూ.700 నుంచి రూ. 10 వేల వరకు ఉంటాయి. ఇంటర్నెట్ డేటా స్పీడ్ 100 ఎంజీబీఎస్‌తో మొదలై 1 జీబీపీఎస్ వరకు ఉంటుంది. గిగాఫైబర్ కనెక్షన్‌తో ఆకర్షణీయమైన లాభాలు కూడా ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. వివిధ ఫ్లాన్లతో వినియోగదారులకు ఆకట్టుకునే ఫీచర్స్ అందిస్తామని చెప్తున్నాయి. వినియోగదారుడు ఎంచుకునే ప్లాన్‌ను బట్టి ఉచితంగా హెచ్‌డీ లేదా 4కే ఎల్ఈడీ టీవీని కూడా పొందొద్దు. అన్ లిమిటెడ్ కాలింగ్‌తో ఉచితంగా ల్యాండ్ లైన్ కనెక్షన్, 4 కే సెట్ టాప్ బాక్స్ కూడా అందజేస్తారు. గిగా ఫైబర్ వచ్చే బెనిఫిట్స్ అన్నీ సబ్ స్కేబర్లు ఎంచుకునే ప్లాన్స్‌ను బట్టి ఉంటాయి. గిగా ఫైబర్ ...