Posts

Showing posts from 2020

చాక్లెట్ తింటే పడక గదిలో రెచ్చిపోతారు

 ప్రేమ కావ్యంలో చాక్లెట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రేమ బంధంతో ఒక్కటైన వారు తమ బంధం మరింత బలపడాలంటే డార్క్ చాక్లెట్స్ తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్స్ తింటే పడకగదిలో రెచ్చిపోతారట..తర్వాత వారి మధ్య బంధం మరింత బలపడుతుందంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ప్రేమికుల రోజున గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుని..తమ మధ్య బంధాన్ని మరింత ఇనుమడింపజేసుకుంటున్నారు. ప్రేమికుల వారోత్సవాల్లో మూడో రోజైన నేడు(ఫిబ్రవరి 9) చాక్లెడ్ డేగా జరుపుకుంటున్నారు. ప్రేమ కావ్యంతో శృంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. డార్క్ చాక్లెట్స్ తినడం ద్వారా  సెక్స్ కోరికలుపెరుతాయని పరిశోధనల్లో తేలాయి. చాక్లెట్స్ తిని తమ సంసార జీవితాన్ని మరింత సుఖమం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.  పడక గదిలో రెచ్చిపోవాలంటే చాక్లెట్స్‌తో పాటు వీటిని కూడా ట్రై చేయాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.  పాలకూర తినడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.. దీంతో పాటు కోరికలు పెరుగుతాయి. వెల్లుల్లి తినడం వల్ల ఆడవారు, మగవారిలోనూ లైంగిక వాంఛ పెరుగుతుందని నిర్ధారణ అయింది. ధనియాల పొడిని నీటిలో కలిపి కాసింత పసుపు వేసి తాగడం వల్ల సెక్స్ కోరికలు

నన్ను డైరెక్ట్ చేసేంత ఉందా నీకు .. ... బుర్ర తిరిగుండాలి హరీష్ కి !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' సినిమాని డైరెక్టర్ చేసే ఛాన్స్ అందుకొని ఊహించని షాకిచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆ తర్వా డీజే - గద్దలకొండ గణేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయినా పవన్ అవేవీ పట్టించుకోకుండా 'గబ్బర్ సింగ్' తీసిన నమ్మకంతో హరీష్ ని నమ్మి మరో ఛాన్స్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ సక్సెస్ నేపథ్యంలో హరీష్ తో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు కాబట్టి ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల్లో హరీష్ బిజీగా ఉన్నాడు. క్రిష్ తో పవన్ 27 సినిమా పూర్తవ్వగానే.. హరీష్ శంకర్ తో పవన్ 28 ప్రాజెక్ట్ కి డేట్స్ ఇస్తాడట. ఆ నేపథ్యంలో హరీష్ శంకర్ స్టేట్ మెంట్లు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. 'గబ్బర్ సింగ్' అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పవన్ 28 ఉంటుందని హరీష్ గొప్పలు పోతున్నాడు. అంతేకాదు.. పవన్ సినిమా అవ్వగానే.. మెగాస్టార్ చిరంజీవితోను సినిమా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడట. చిరుతో సినిమానా ..! అంటే.. అది నిజమేనని హరీష్ కన్ఫామ్ చేసేసాడు కూడా. పవన్ కళ్యాణ్ 28 తర్వాత మెగాస్టార్ నే డైరెక్ట్ చేస్తాననని రీసె

నిరుద్యోగులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్.. కూర్చున్న చోటునుంచే డబ్బులు సంపాదించడమెలా?

Image
ఇప్పుడు యువత కష్టపడకుండానే డబ్బులను సంపాదించే మార్గాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. వీటి వలన కొందరు సక్సెస్ అవుతుంటే.. కొందరు నష్టాల బారిన పడుతున్నారు. కానీ దేనినైనా తెలివిగా చేస్తే తప్పకుండా ఆదాయాన్ని సంపాదించవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు టెక్నాలజీ పరంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఏటీఎంలు వచ్చిన దగ్గరినుంచీ డబ్బుల లావాదేవీలు మరింత సులువయ్యాయి. ఏటీఎంలు దాదాపు 9 రకాల సేవలను అందిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి ఆర్బీఐ నిరుద్యోగులకు మంచి ఆఫర్‌ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 'వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని' తెరపైకి తీసుకొచ్చింది ఆర్బీఐ.ఇప్పటికే వివిధ బ్యాంకింగ్ సంస్థలు ఆర్బీఐకి దరఖాస్తు కూడా చేసుకున్నాయి. ఇందులో 12 సంస్థలకు ఆర్బీఐ లైసెన్స్‌లు కూడా కేటాయించింది. అంతేకాకుండా ఈ కంపెనీలు ఏటీఎంలను ఏర్పాటు చేసే వారికి కూడా అవకాశం కల్పిస్తున్నాయి. ఏటీఎంను నెలకొల్పడం ఎలా? మీరు ఏటీఎంను ఏర్పాటు చేయాలనుకుంటే.. ముందు బిజీగా ఉన్న మార్కెట్‌లో 25 నుంచి 50 చదరపు అడుగుల స్థలం ఉండాలి. మీరు టై అప్ అయిన బ్యాంక్ లేదా కంపెనీ.. మీకు 'వైట్ లేబుల్ ఏటీఎం'లను అందిస

కనువిందు చేస్తున్న తొలకరి మంచు ...

సిమ్లా: హిల్‌స్టేషన్‌ హిమాచల్‌ప్రదేశ్‌ లోని పలు ప్రాంతాలను నిన్న తొలకరి మంచు పలకరించింది.  మండి జిల్లాలోని జంజేహ్లి ప్రాంతంలో హిమపాతం తుంపర్లుగా పడుతూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది.  హిమాచల్‌ క్యాపిటల్‌ సిటీ సిమ్లాతోపాటు ప్రఖ్యాత పర్యాటక క్షేత్రం కుఫ్రిలో హిమపాతం కురుస్తూనే ఉంది.  ఇప్పటికే కాంగ్రాలో అత్యధికంగా 18.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవగా..చంబా, డల్హౌసీలో 7 మి.మీల వర్షపాతం (మంచువర్షం), జుంగీలో 2మి.మీ, జ్వాలి 1 మి.మీ, సిమ్లాలో 0.8 మిమీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.  మరోవైపు మండి జిల్లాలోని సీరజ్‌ వ్యాలీలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టూరిజం శాఖ రెండు ఇగ్లూ (మంచు ఇల్లు)లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.

తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం ...

అహ్మదాబాద్‌: తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభమైంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్‌గోయల్‌ రైలును అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.  కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పీయుష్‌గోయల్‌ మాట్లాడుతూ... రైలు నడిచే టైంటేబుల్‌ను ప్రకటించామని, జనవరి 19వ తేదీ నుంచి రెగ్యులర్‌గా వారానికి 6 రోజలు రైలు నడుస్తుందని తెలిపారు.  పూర్తి ఏసీతో కూడిన ఈ రైలు 736 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుంది.  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ ముబైల్‌ యాప్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ తీసుకోవచ్చు.  తత్కాల్‌ కోటా, ప్రీమియం తత్కాల్‌ కోటా ఇందులో లేవు. జనరల్‌ కోటా, విదేశీ టూరిస్ట్‌ కోటా మాత్రమే ఉన్నాయి.  ప్రయాణికులందరికీ ఐఆర్‌సీటీసీ ద్వారా రూ.25 లక్షల ఉచిత భీమా కల్పిస్తున్నాం. రైలు ఆలస్యం అయితే గంట ఆలస్యానికి రూ.100, రెండు గంటల ఆలస్యానికి రూ.250లను ఐఆర్‌సీటీసీ పరిహారంగా చెల్లిస్తుంది.  ప్రతీ ప్రయాణికుడికి ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బాటిల్ కు అదనంగా ప్రతి కోచ్‌లో ఆర్‌వో వాటర్‌ ఫిల్టర్‌ను ఏర్పాటు చేస

ముంబై వరుస పేలుళ్ల దోషి .. పెరోల్ పై మిస్సింగ్

ముంబై: 1993 ముంబై వరుస పేలుళ్ల దోషి జలీస్‌ అన్సారీ కనిపించకుండా పోయాడు.  68 ఏళ్ల జలీస్‌ అన్సారీ ముంబై వరుస పేలుళ్ల కేసులో రాజస్థాన్‌లోని అజ్మీర్‌ కేంద్రకారాగారంలో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.  ఇటీవలే అతడు 21 రోజుల పేరోల్‌పై బయటకు వచ్చాడు.  అయితే పెరోల్‌పై ఉన్న సమయంలో ప్రతీ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జలీస్‌ అన్సారీ అగ్రిపడా (ముంబై) పోలీస్‌స్టేషన్‌లో హాజరవ్వాల్సి ఉంటుంది.  అయితే గురువారం రోజు జలీస్‌ అన్సారీ పీఎస్‌కు రాలేదు.  దీంతో అతడి కొడుకు జైద్‌ అన్సారీ తన తండ్రి జలీస్‌ అన్సారీ కనిపించకుండా పోయాడని పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు జలీస్‌ అన్సారీ కోసం ఆపరేషన్‌ ప్రారంభించారు.

ముఖేష్ సింగ్ క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి ముఖేష్‌సింగ్‌ క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు.  ముఖేశ్‌ సింగ్‌ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ హోంశాఖకు పంపిచారు.  హోంశాఖ వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపింది. తాజాగా రాష్ట్రపతి ముఖేష్‌సింగ్‌ దరఖాస్తును తిరస్కరించారు.  ముఖేష్ సింగ్ క్షమాభిక్ష దరఖాస్తును ఒక వేళ రాష్ట్రపతి తిరస్కరించినా దోషులకు కనీసం 14 రోజులు గడువు ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో ఈ నెల 22న ఉరి శిక్ష అమలు సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్‌ జైలు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.  దీంతో నిందితులు కావాలనే తమ ఉరిని వాయిదా వేసేందుకు క్షమాభిక్ష, క్యురేటివ్‌ పిటిషన్ల పేరుతో నాటకాలాడుతున్నారని నిర్భయ తల్లిదండ్రులు, పలువురు అధికారులు, సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు ముఖేశ్‌ క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేంద్రానికి సిఫారసు చేశారు.

భారత రత్న కన్నా మహోన్నతుడు మహాత్మా గాంధీ. :సుప్రీం కోర్టు

ఢిల్లీ మ‌హాత్మా గాంధీకి భార‌తర‌త్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తేవాల‌న్న అభ్య‌ర్థ‌న‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.  అలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేని ఇవాళ‌ అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టంచేసింది.  మ‌హాత్మా గాంధీ మ‌హోన్న‌త‌మైన వ్య‌క్తి అని, ఆయ‌నకు ఉన్న గుర్తింపు చాలా విశాల‌మైన‌ద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది.  భార‌త ర‌త్న బిరుదు క‌న్నా.. మ‌హాత్మాగాంధీ ఎంతో ఉన్న‌తుడ‌ని కోర్టు పేర్కొన్న‌ది.  మ‌హాత్మా గాంధీ.. జాతిపిత అని, ఆయ‌న్ను ప్ర‌జ‌లు ఎంతో ఉన్న‌తంగా చూస్తార‌ని, ఆయ‌న‌కు ఉన్న గుర్తింపు అన‌న్య‌మైంద‌ని కోర్టు తెలిపింది.  గ‌తంలోనూ ఇదే అంశంలో కోర్టులో ప‌లుమార్లు పిల్స్ వేశారు. కానీ కోర్టు తిర‌స్క‌రిస్తూనే వ‌చ్చింది.  మ‌హాత్మా గాంధీకి భార‌తర‌త్న ఇవ్వ‌డం అంటే ఆయ‌న్ను, ఆయ‌న చేసిన సేవ‌ల‌ను త‌క్కువ చేసి చూడ‌డం అవుతుంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది.

2020 జనాభా లెక్కింపు

2020 జనాభా లెక్కింపు .. కేంద్రం కసరత్తు ఢిల్లీ: 2020 జనాభా లెక్కింపు, ఎన్‌పీఆర్‌ కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.  ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ నేతృత్వంలో సమావేశం జరగనుంది.  సమావేశంలో కేంద్ర హోశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, జనాభా లెక్కింపు అధికారులు పాల్గొననున్నారు.  2020 జనాభా లెక్కింపు, జాతీయ జనాభా రిజిస్టర్‌ మార్గదర్శకాలపై చర్చించనున్నారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.  శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.  స్వామివారి సర్వదర్శనానికి 10గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.  శ్రీవారిని నిన్న 83,077 మంది భక్తులు దర్శించుకున్నారు.  29,329 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

మందకొడిగా మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు మందకొడిగా ట్రేడవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9.24 సమయంలో నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 12,344 వద్ద.. 6 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ 41,926 వద్ద ట్రేడవుతున్నాయి. చాలా కార్పొరేట్‌ సంస్థల ఆదాయాల అంచనాలపై సానుకూలతలు లేకపోవడంతో మార్కెట్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క టెలికం సంస్థలు ఏజీఆర్‌ ఛార్జీలు చెల్లించాలని సుప్రీం ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను తిరస్కరించడం కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసింది. నేడు మొత్తం 18 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. మరోపక్క అమెరికా ఉత్పాదకరంగ డేటా బలంగా ఉండటంతో వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. వీటి ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా చూపుతోంది.

నైరుతీ రుతుపవనాల ప్రవేశంతోనే కొంత జాప్యం ...

Image
వాతావరణం :: న్యూఢిల్లీ: కొన్నేండ్లుగా వాతావరణం మార్పులతో దేశంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంలో కొంత జాప్యం జరుగుతున్నది.  దీంతో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న తీరు మారుతున్నది.  ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఈ ఏడాది నుంచి రుతుపవనాల అంచనా తేదీల్లో మార్పులు చేయనున్నదని కేంద్ర భూగోళ శాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం రాజీవన్‌ అధికారికంగా తెలిపారు.  విత్తనాలు నాటుకునే రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  వర్షాకాలం సాధారణం గా జూన్‌ - సెప్టెంబర్‌ వరకు ఉంటుంది. నైరుతి రుతుపవనాలు జూన్‌ 1న కేరళను తాకుతాయి.  ఈ తేదీలో ఎలాంటి మార్పు ఉండదని, మిగతా రాష్ర్టాలకు, ప్రధానంగా మధ్య భారతావనిలోని పది సబ్‌ డివిజన్లలో (ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్‌, తూర్పు మధ్యప్రదేశ్‌, విదర్భ, మధ్య మహారాష్ట్ర, కొంకన్‌, గోవా, గుజరాత్‌లోని కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాలు) నైరుతి రుతుపవనాలు విస్తరించే తేదీల ప్రకటనలో మాత్రమే మార్పు ఉంటుందని ఐఎండీ తెలిపింది.  ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకను పూర్తిగా అంచనా వేసిన తర్వాత ఈ రాష్ర్టాలకు విస్తరించే కొత్త తేదీలను ఏప్రిల్‌ నెలలో ప్రకటించే అవకాశమున్నట్లు ఐఎ

ప్రభావం ఎలా ఉంటుంది ....?

Image
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుదన్నదానిపై స్పష్టత లేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహార ఉత్పత్తిపైనా తీవ్ర ప్రభావం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలుల వల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు. భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచుపడుతుంది. తీరాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో వేసవుల్లో కరవు ముప్పు ఎక్కువవుతుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీతంగా ఉండొచ్చు. పరిస్థితులకు అంత త్వరగా అలవాటుపడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేసింది.

ఉష్ణోగ్రత ఎంత పెరగవచ్చు .....?

భూ ఉపరితల ఉష్ణోగ్రత 1850‌తో పోల్చితే 21వ శతాబ్దం చివరినాటికి 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగొచ్చు. చాలా వరకూ అంచనాలు ఇదే సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే ఇకపైనా కొనసాగితే పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీ సెంటీ‌గ్రేడ్‌లు కూడా ఉండొచ్చని డబ్ల్యూఎంఓ అంటోంది. ఉష్ణోగ్రతలో 2 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల పెరుగుదల ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్చని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు కట్టడి చేసుకోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు, నాయకులు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు అదుపు చేయాలంటే సమాజం అన్ని విధాలుగా త్వరితగతిన మారాల్సి ఉంటుందని ఇంటర్‌గవర్న్‌మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) నివేదిక అభిప్రాయపడింది. గ్రీన్ హౌజ్ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగుతున్న కృషికి ఐరాస నేతృత్వం వహిస్తోంది. చైనా నుంచే అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, యురోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఉన్నాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే, వీటిలో ఉద్గారాలు చాలా ఎక్కువ. ఇప్ప

కరుగుతున్న హిమనీనదాలు ....

Image
కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఆర్కిటిక్ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌పై పరుచుకున్న మంచు కూడా కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో కరుగుతోంది. పశ్చిమ అంటార్కిటికాపై ఉన్న మంచు ద్రవ్యరాశి కూడా తగ్గుతోంది. తూర్పు అంటార్కిటికాలోనూ ఈ పరిణామం మొదలవ్వొచ్చని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. పంటలు, జంతువులపైనా వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. మొక్కల్లో పూలు పూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. జంతువులు వలస వెళ్తున్నాయి.

గ్లోబల్ వార్మింగ్‌కు ఆధారాలు ....

Image
శిలాజ ఇంధనాలను మండించడం వల్లే అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతోంది. కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులను నరికి, కాల్చేయడం వల్ల కూడా కార్బన్ వెలువడుతోంది. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువవుతోంది. 1750లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు 30 శాతం పెరిగాయి. గత 8 లక్షల ఏళ్లలో వాతావరణంలో ఈ స్థాయిలో కార్బన్ డై ఆక్సైడ్ ఎప్పుడూ లేదు. మనుషుల చర్యల వల్ల మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి ఇతర గ్రీన్ హౌజ్ వాయువులు కూడా వెలువడుతున్నాయి. అయితే, కార్బన్ డై ఆక్సైడ్ అంతటి స్థాయిలో అవి లేవు. గ్లోబల్ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా? పారిశ్రామిక విప్లవం కన్నా ముందునాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది. అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20 ఏళ్లు.. గత 22 ఏళ్లలోనే ఉన్నాయి. 2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది.

గ్రీన్ హౌజ్ వాయువులు ....

Image
అయితే, ఈ గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయం వల్ల వెలువడే వాయువులు తోడై మరింత శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం) , వాతావరణ మార్పులు అంటారు. గ్రీన్ హౌజ్ వాయువులు ఇవే... గ్రీన్ హౌజ్ వాయువుల్లో అత్యంత ప్రభావవంతమైంది నీటి ఆవిరి. కానీ, అది వాతావరణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రామికీకరణ కన్నా ముందు ఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవనరులు దాన్ని పీల్చుకోగలవు.

గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ ....

గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ దీనికి కారణమని వారు చెబుతున్నారు. గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్ హౌజ్ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలితంగా వాతావరణం, భూ ఉపరితంల వేడెక్కుతున్నాయి. ఈ ఎఫెక్ట్ లేకపోతే భూమి ఇంకో 30 డిగ్రీ సెంటీగ్రేడ్స్ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమయ్యేది.

గ్లోబల్ వార్మింగ్

గ్లోబల్ వార్మింగ్: వాతావరణ మార్పు అంటే ఏమిటి... భూమి వేడెక్కితే ఏమవుతుంది ..? గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి పెనువిపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. ఇంతకీ వాతావరణ మార్పుల గురించి మనకేం తెలుసు? వాతావరణ మార్పు అంటే ... భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువగా, తక్కువగా కూడా ఉంది. ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మనల్ని సృష్టించిన దేవుడు ఎంత శక్తి ఇచ్ఛాడో మీకు తెలుసా ?

దేవుడు మనిషిని సృష్టించడం సైన్సు పరంగా తెలుసుకుందాం మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి. మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను * హార్మోనియం లో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి * మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి *మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది * మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును *మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును *మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి * మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి * మనిషి శరీరములోని

టుడే న్యూస్ అప్డేట్స్

ఆంధ్రప్రదేశ్‌: ► నేడు క్యాంప్‌ ఆఫీసులో సీఎం జగన్‌తో హైపవర్‌ కమిటీ భేటీ ►ఇప్పటికే జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్‌ కమిటీ ►అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం జగన్‌కు పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ ఇవ్వనున్న హైపవర్‌ కమిటీ ►ఇప్పటికే మూడు సార్లు సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపిన హైపవర్‌ కమిటీ జాతీయం ►ఢిల్లీ: రాత్రి 7 గంటలకు కేంద్ర కేబినెట్‌ భేటీ   ►ఢిల్లీ: నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్‌ స్పోర్ట్స్‌ ►నేడు భారత్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ►రాజ్‌కోట్‌ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ►ఇప్పటికే మూడు వన్డేల సరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌ ►కేప్‌టౌన్‌: నేడు నుంచి అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీ ►19న లంక, 21న జపాన్‌, 24న కివీస్‌తో తలపడనున్న భారత్‌

దేశంలో మరో ప్రైవేటు రైలు పట్టాలెక్కనుంది

గుజరాత్ దేశంలో మరో ప్రైవేటు రైలు పట్టాలెక్కనుంది. లఖ్​నవూ-దిల్లీ మధ్య ప్రస్తుతం నడుస్తున్న తేజస్​ ప్రైవేట్​ ఎక్స్​ప్రెస్​ విజయవంతమైన క్రమంలో అహ్మదాబాద్​-ముంబయి మార్గంలో మరో తేజస్​ను నేడు ప్రారంభించనుంది ఐఆర్​సీటీసీ.  జనవరి 19 నుంచి రాకపోకలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఈ రైలును రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీలు ఇవాళ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.  వాణిజ్య రాకపోకలు ఈనెల 19 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.  వారానికి ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది.  అత్యాధునిక సౌకర్యాలతో పూర్తి ఏసీ ట్రైన్‌గా తేజస్‌ ముందుకొచ్చింది.  ఈ రైలులో ఒక్కోటి 56 సీట్ల సామర్థ్యం కలిగిన రెండు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ చైర్‌కార్స్‌తో పాటు 8 చైర్‌ కార్స్‌తో మొత్తం 736 మంది ప్రయాణికులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు. ట్రైన్​ బుకింగ్​ సేవలను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.  ఐఆర్​సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌ యాప్‌ రైల్‌కనెక్ట్‌ ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను నమోదు చేసుకోవచ్చు.

మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేడు కీలక భేటీ

న్యూఢిల్లీ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేడు కీలక భేటీ నిర్వహించనుంది.  ఏప్రిల్​లో చేపట్టనున్న జాతీయ జనాభా పట్టిక సహా జనగణనపై చర్చించనుంది.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు.  అయితే ఈ భేటీలో తమ రాష్ట్ర అధికారులు పాల్గొనేది లేదని బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తేల్చి చెప్పారు

నేడు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టుల్లో నేడు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరగనుంది.  పెన్నా గ్రూప్ కేసులో అనుబంధ చార్జ్‌షీట్‌పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ ప్రక్రియను ప్రారంభించనుంది.  తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్​ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్​ అధికారి శామ్యూల్, గనుల శాఖ మాజీ సంచాలకుడు వీడీ రాజగోపాల్, డీఆర్​ఓ సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మ విచారణకు హాజరుకానున్నారు.  పెన్నా గ్రూప్‌నకు భూములు, గనుల కేటాయింపుల్లో సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఇతర అధికారులు అవినీతి నిరోధక చట్టం ప్రకారం నేరానికి పాల్పడినట్లు సీబీఐ అభియోగపత్రంలో పేర్కొంది.  ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పెన్నా గ్రూప్ అధినేత ప్రతాప్ రెడ్డి పిటిషన్‌ పైనా నేడు వాదనలు జరగనున్నాయి.

రాశిఫలం - 17/01/2020

తిథి:  బహుళ సప్తమి ఉ.11.14, కలియుగం-5121, శాలివాహన శకం-1941 నక్షత్రం:  చిత్త రా.తె.4.50 వర్జ్యం:  మ.1.54 నుండి 3.23వరకు దుర్ముహూర్తం:  ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి మ.12.24 నుండి 01.12వరకు రాహు కాలం:  ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం:  (అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. వృషభం:  (కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. మిథునం:  (మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనంవల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా నుండుట మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు. కర్కాటకం:  (పునర్వసు

గుంటూరు ప్యాసింజర్ రైలు 20 రోజుల పాటు రద్దు ..

కాచిగూడ: కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 2.40నిమిషాలకు బయలుదేరే కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్‌ రైలు కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి ..  ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 5 తేదీ వరకు 20 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే సీనియర్‌ డీసీఎం వెంకన్న తెలిపారు.  రైల్వే ప్రయాణికుల కోసం మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి గుంటూరు రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో రైల్వే పనులను ఆధునీకరిస్తున్నట్లు...  అందుకు కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి నిత్యం బయలేదేరుతున్న గుంటూరు ప్యాసింజర్‌ రైలు వచ్చేనెల 5వ తేదీ వరకు రద్దు చేస్తున్న ట్లు ఆయన పేర్కొన్నారు. ఈమార్పును రైల్వే ప్రయాణికులు గమనించగలరని ఆయన విజ్ఞప్తి చేశారు.

జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం ..

నెల్లూరు జిల్లా : సూళ్లూరుపేట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది.  శుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌-5 వాహకనౌక ద్వారా జీశాట్‌ 30 ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు.  దీని బరువు 3357 కిలోలు.  ఇది కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. దీని ద్వారా టెలివిజన్, టెలి కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సంబంధించిన మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.  ఇన్‌శాట్‌- 4ఏ స్థానంలో సేవలందించేందుకు జీశాట్‌-30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.  భారత్‌కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్‌-30 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది.