కరుగుతున్న హిమనీనదాలు ....





కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి.

ఆర్కిటిక్ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. గ్రీన్‌లాండ్‌పై పరుచుకున్న మంచు కూడా కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో కరుగుతోంది.

పశ్చిమ అంటార్కిటికాపై ఉన్న మంచు ద్రవ్యరాశి కూడా తగ్గుతోంది. తూర్పు అంటార్కిటికాలోనూ ఈ పరిణామం మొదలవ్వొచ్చని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది.

పంటలు, జంతువులపైనా వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. మొక్కల్లో పూలు పూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. జంతువులు వలస వెళ్తున్నాయి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..