కనువిందు చేస్తున్న తొలకరి మంచు ...

సిమ్లా: హిల్‌స్టేషన్‌ హిమాచల్‌ప్రదేశ్‌ లోని పలు ప్రాంతాలను నిన్న తొలకరి మంచు పలకరించింది. 

మండి జిల్లాలోని జంజేహ్లి ప్రాంతంలో హిమపాతం తుంపర్లుగా పడుతూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. 

హిమాచల్‌ క్యాపిటల్‌ సిటీ సిమ్లాతోపాటు ప్రఖ్యాత పర్యాటక క్షేత్రం కుఫ్రిలో హిమపాతం కురుస్తూనే ఉంది. 

ఇప్పటికే కాంగ్రాలో అత్యధికంగా 18.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవగా..చంబా, డల్హౌసీలో 7 మి.మీల వర్షపాతం (మంచువర్షం), జుంగీలో 2మి.మీ, జ్వాలి 1 మి.మీ, సిమ్లాలో 0.8 మిమీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 

మరోవైపు మండి జిల్లాలోని సీరజ్‌ వ్యాలీలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టూరిజం శాఖ రెండు ఇగ్లూ (మంచు ఇల్లు)లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..