మందకొడిగా మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు మందకొడిగా ట్రేడవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9.24 సమయంలో నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 12,344 వద్ద.. 6 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ 41,926 వద్ద ట్రేడవుతున్నాయి. చాలా కార్పొరేట్‌ సంస్థల ఆదాయాల అంచనాలపై సానుకూలతలు లేకపోవడంతో మార్కెట్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క టెలికం సంస్థలు ఏజీఆర్‌ ఛార్జీలు చెల్లించాలని సుప్రీం ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను తిరస్కరించడం కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసింది.
నేడు మొత్తం 18 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. మరోపక్క అమెరికా ఉత్పాదకరంగ డేటా బలంగా ఉండటంతో వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. వీటి ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా చూపుతోంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..