దేశంలో మరో ప్రైవేటు రైలు పట్టాలెక్కనుంది

గుజరాత్

దేశంలో మరో ప్రైవేటు రైలు పట్టాలెక్కనుంది. లఖ్​నవూ-దిల్లీ మధ్య ప్రస్తుతం నడుస్తున్న తేజస్​ ప్రైవేట్​ ఎక్స్​ప్రెస్​ విజయవంతమైన క్రమంలో అహ్మదాబాద్​-ముంబయి మార్గంలో మరో తేజస్​ను నేడు ప్రారంభించనుంది ఐఆర్​సీటీసీ. 

జనవరి 19 నుంచి రాకపోకలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.

ఈ రైలును రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీలు ఇవాళ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. 

వాణిజ్య రాకపోకలు ఈనెల 19 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. 

వారానికి ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. 

అత్యాధునిక సౌకర్యాలతో పూర్తి ఏసీ ట్రైన్‌గా తేజస్‌ ముందుకొచ్చింది. 

ఈ రైలులో ఒక్కోటి 56 సీట్ల సామర్థ్యం కలిగిన రెండు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ చైర్‌కార్స్‌తో పాటు 8 చైర్‌ కార్స్‌తో మొత్తం 736 మంది ప్రయాణికులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు.

ట్రైన్​ బుకింగ్​ సేవలను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. 

ఐఆర్​సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌ యాప్‌ రైల్‌కనెక్ట్‌ ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను నమోదు చేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..