ముంబై వరుస పేలుళ్ల దోషి .. పెరోల్ పై మిస్సింగ్

ముంబై: 1993 ముంబై వరుస పేలుళ్ల దోషి జలీస్‌ అన్సారీ కనిపించకుండా పోయాడు. 

68 ఏళ్ల జలీస్‌ అన్సారీ ముంబై వరుస పేలుళ్ల కేసులో రాజస్థాన్‌లోని అజ్మీర్‌ కేంద్రకారాగారంలో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. 

ఇటీవలే అతడు 21 రోజుల పేరోల్‌పై బయటకు వచ్చాడు. 

అయితే పెరోల్‌పై ఉన్న సమయంలో ప్రతీ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జలీస్‌ అన్సారీ అగ్రిపడా (ముంబై) పోలీస్‌స్టేషన్‌లో హాజరవ్వాల్సి ఉంటుంది. 

అయితే గురువారం రోజు జలీస్‌ అన్సారీ పీఎస్‌కు రాలేదు. 

దీంతో అతడి కొడుకు జైద్‌ అన్సారీ తన తండ్రి జలీస్‌ అన్సారీ కనిపించకుండా పోయాడని పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. 

కేసు నమోదు చేసుకున్న ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు జలీస్‌ అన్సారీ కోసం ఆపరేషన్‌ ప్రారంభించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..