Posts

Showing posts with the label రేపే ఏరువాక పౌర్ణమి.
Image
ఏరువాక సాగాలో అన్నో చిన్నన్నో.... నీ కష్టమంతా తీరాలో...రన్నో చిన్నన్నో... రేపే  ఏరువాక పౌర్ణమి. యర్రబాలెం,కాజ  వినాయక దేవాలయాల ముస్తాబు. మంగళగిరి: మండే ఎండలకు వీడ్కోలు పలుకుతూ... తొలకరి తెలుగు వారింట అడుగుపెట్టింది. తరలివచ్చిన తొలకరి జల్లులతో నేల తల్లి పులకరించే మధుర క్షణాలు ఏరువాక పౌర్ణమి. రైతన్నలు తమ పంటసాగును పవిత్రంగా ప్రారంభించే పరమ పవిత్రమైన రోజు ఇది. ఈ పవిత్రమైన ఏరువాక పౌర్ణమి నాడు రైతులు తమకు పంటను ప్రసాదించే భూమి తల్లిని పూజిస్తారు. ఎద్దులకు పసుపు, కుంకుమలతో అందంగా అలంకరిస్తారు. మూపురాలకు నమస్కరించి వృషభ పూజ చేస్తారు. నాగలికి హల ప్రవాహ పూజను నిర్వహిస్తారు. ఎడ్లను కాడికి పూన్చి, ఇంటి ఇల్లాలు నీళ్ళ బిందెతో ఎదురురాగా, ధాన్యలక్ష్మీని ఇంటికి తోడ్కోని తెచ్చే బసవన్నలను అలంకరించి, పూజించి, దుక్కి దున్నడానికి శుభసూచకంగా టెంకాయ కొట్టి, తలపాగా చుట్టి నాగళ్ళతో సాగుకు శ్రీకారం చుడతారు. అయితేగత కొన్ని సంవత్సరాలుగా ఏరువాక పౌర్ణమి నాటికి ఋతుపవనాలు రాక తొలకరి లేకపోవడంతో  పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. గత సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్క...