Posts

Showing posts with the label జియో దెబ్బ.... ఎయిర్‌టెల్ కళ్లు చెదిరే ఆఫర్‌

జియో దెబ్బ.... ఎయిర్‌టెల్ కళ్లు చెదిరే ఆఫర్‌

రిలయన్స్ జియో గిగాఫైబర్ దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు దిగొస్తున్నాయి. జియోను ఎదుర్కొనేందుకు తాజాగా ఎయిర్‌టెల్ భారీ ఆఫర్ ప్రకటించింది. జియో దెబ్బతో దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ మార్కెట్ కుదేలైంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌టెల్ షేర్‌మార్కెట్లో కూడా పతనమైంది. తాజాగా జియో దెబ్బతో ఎయిర్‌టెల్-వి ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవల్లోని మూడు ప్లాన్లతో 200 జీబీ నుంచి 1000 జీబీ వరకు అదనపు డేటా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ రూ.799, ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099, ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599తో ఈ అదనపు డేటా ఆఫర్ లభిస్తుంది. ఈ ప్లాన్లను వచ్చే డేటాను చూస్తే రూ. 799 బేసిక్ ప్లాన్‌లో ప్రస్తుతం 40 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ డేటా లభిస్తోంది. ఇప్పుడు దీనికి అదనంగా 200 జీబీ డేటాను ఆరు నెలల కాలపరిమితితో ఇస్తున్నట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది. ప్లాన్‌లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్‌తో, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక రూ.1099 ఎయిర్‌టెల్ ఎంటర్టైన్‌మెంట్ ప్లాన్‌లో ఇప్పటి వరకు 100 ఎంబీపీఎస్ వేగంతో 300 జీబీ డేటా లభిస్తోంది. ఇప్పుడు దీనికి అదనంగా 500 జీబీ డేటా ఆరునెలల కాలపరిమితితో లభిస...