Posts

Showing posts from October, 2019

ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హత్య

ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హత్య: తుని ఎమ్మెల్యే సహా ఐదుగురిపై ఫిర్యాదు.. కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం ఎస్‌. అన్నవరంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అయితే ఈ దారుణానికి పాల్పడిందెవరన్న విషయం ఇంతవరకూ తెలియరాలేదు. తాజాగా.. హత్య విషయంలో సత్యనారాయణ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తుని వైసిపి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో సహా మరో ఐదుగురి పేర్లను ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. విలేకరి హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన విషయం విదితమే. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డీజీపీని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

ఆర్టీసీ కార్మికులకు భారీ షాక్

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మొదలై 13వ రోజుకు చేరుకున్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కార్మికులు డిమాండ్ లపై సరైన హామీ ఇవ్వలేదు. అది కాక సమ్మె చేస్తున్న 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను ఉద్యోగంలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పేసారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అసంబద్ధమైన అని విమర్శించారు. అయితే ఆర్టీసీ సమ్మెకు ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ మద్దతు తెలపగా రోజు రోజుకు ఉధృతమవుతోంది ఆర్టీసీ సమ్మె. కాగా ఈ నెల 19న తెలంగాణ బంద్ నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఓ వైపు కెసిఆర్ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నప్పటికీ... ఆర్టీసీ కార్మికులు మాత్రం వెనక్కి తగ్గకుండా సమ్మె నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం తమను ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్తాపం చెంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తమ ఆత్మహత్యలతో అయినా కనీసం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్

ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హత్య

*ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హత్య: తుని ఎమ్మెల్యే సహా ఐదుగురిపై ఫిర్యాదు..* కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం ఎస్‌. అన్నవరంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అయితే ఈ దారుణానికి పాల్పడిందెవరన్న విషయం ఇంతవరకూ తెలియరాలేదు. తాజాగా.. హత్య విషయంలో సత్యనారాయణ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తుని వైసిపి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో సహా మరో ఐదుగురి పేర్లను ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. విలేకరి హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన విషయం విదితమే. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డీజీపీని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

టీవీ9 బ్రేకింగ్ ప్లేట్ మార్ఫింగ్.. విద్యార్థుల్లో అలజడికి కుట్ర

టీవీ9 బ్రేకింగ్ ప్లేట్‌ను మార్పింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థుల్లో అలజడికి కుట్ర చేస్తున్నారు.  వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన టీవీ9 యాజమాన్యం.. పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.  కాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణాలోని విద్యాసంస్థలకు ఈ నెల 19 వరకు సెలవులను పొడిగించగా..  టీవీ9 బ్రేకింగ్ ప్లేట్‌ను ఉపయోగించిన కొందరు సెలవులు ఈ నెల 31వరకు పెంపు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.  దీనిపై చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం సిద్ధమైంది.  ఇక ఈ నెల 21న తెలంగాణాలోని విద్యాసంస్థలు పున: ప్రారంభం కానున్నాయి.

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ...

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.  24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,570, విజయవాడలో రూ.38,000, ప్రొద్దుటూరులో రూ.38,100, చెన్నైలో రూ.38,260గా ఉంది.  ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,720, విజయవాడలో రూ.35,250, ప్రొద్దుటూరులో రూ.35,320, చెన్నైలో రూ.36,610గా ఉంది.  వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,900, విజయవాడలో రూ.47,000, ప్రొద్దుటూరులో రూ.46,300, చెన్నైలో రూ.48,700 వద్ద ముగిసింది.

బిగ్ బ్రేకింగ్

విజయవాడ బిగ్ బ్రేకింగ్... పొట్టిపాడు టోల్ గేట్ వద్ద టాస్క్ ఫోర్స్  పోలీసులు వేర్వేరు దాడులు...280 కిలోలు గంజాయి పట్టివేత... 240 కిలోలు టెంపో బస్సు . ఆర్టీసీ బస్సు లో 40 కిలోల స్వాధీనం.. గన్నవరం పోలీసు స్టేషన్ కి తరలింపు.. ఒక మహిళ సహా 12 మంది అరెస్ట్

పీఎంసీ బ్యాంక్​ కుంభకోణంలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ భారీగా ఆస్తులు సీజ్​

పీఎంసీ బ్యాంక్​ కుంభకోణంలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ భారీగా ఆస్తులు సీజ్​ చేసిన నేపథ్యంలో ప్రధాన నిందితులైన హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు ​రాకేశ్​ వాద్వాన్, సారంగ్ వాద్వాన్‌.. తమ ఆస్తులను అమ్మాలని అభ్యర్థించారు. ఈ మేరకు ఆర్​బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఈడీలకు లేఖ రాశారు. రోల్స్​ రాయిస్​ కార్లు, విమానం, ఓడ ఇతర ఆస్తులను అమ్మి బ్యాంకు​ బకాయిలు చెల్లించాల్సిందిగా కోరారు. పంజాబ్,​ మహారాష్ట్ర కో-ఆపరేటివ్​ బ్యాంక్​ కుంభకోణంలో ముంబయి ఆర్థిక కార్యకలాపాల పోలీస్​ వింగ్ ​వాద్వాన్లను అరెస్టు చేసింది. బుధవారం రోజు నిందితులను కోర్టు.. జ్యుడీషియల్​ కస్టడీకి అప్పగించిన నేపథ్యంలో ఈడీ జత చేసిన తమ 18 రకాల ఆస్తులను అమ్మటానికి అనుమతినిచ్చారు. అమ్మకపు ఆస్తుల వివరాలు... ఆస్తులు అమ్మకానికి అనుమతించిన జాబితాలో రాకేశ్​​కు చెందిన అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ కాంటినెంటల్, బీఎండబ్ల్యూ 730 ఎల్‌డీ, అంబాసిడర్ ​వంటి కార్లు ఉన్నాయి. వీటితో పాటు సారంగ్​కు చెందిన ఫాల్​కన్​ 2000 విమానం, ఆడీ ఏజీ కారు, మరో రెండు విద్యుత్ కార్లు, మూడు క్వాడ్​ బైకులు, స్పీడ్​ బోట్లను విక్రయించడానికి అంగీకరించారు. 'ప్రజా

ప్రముఖ నటి రమ్యకృష్ణ.. తొలిసారిగా భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తోంది

ప్రముఖ నటి రమ్యకృష్ణ.. తొలిసారిగా భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తోంది.  మరాఠీ హిట్ చిత్రం 'నటసామ్రాట్'కు రీమేక్​గా రూపొందిస్తున్న ఈ సినిమాకు 'రంగమార్తాండ' అనే టైటిల్​ ఖరారు చేశారు. ఓ పోస్టర్​ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలో ప్రకాశ్​రాజ్ కనిపించనున్నాడు. వీటితో పాటే చాలాకాలం తర్వాత కృష్ణవంశీ తీస్తున్న సినిమా ఇది కావడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది 2017లో 'నక్షత్రం' తీశాడు కృష్ణవంశీ. సందీప్‌ కిషన్‌, సాయిధరమ్‌ తేజ్‌, రెజీనా తదితరులు నటించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టు పట్టాలెక్కించలేదీ డైరెక్టర్. ఇప్పుడు ఈ చిత్రం ప్రకటించాడు

నవంబర్​ 18 నుంచి పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు..!

నవంబర్​ 18 నుంచి పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు..! నవంబర్​ 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నేతృత్వంలో బుధవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్​ కమిటీ(సీసీపీఏ) సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. నవంబర్​ 18న నుంచి డిసెంబర్​ 13 వరకు సమావేశాలు సాగనున్నట్లు తెసుస్తోంది. అయితే... అధికారికంగా ఎలాంటి షెడ్యూల్​ వెల్లడికానప్పటికీ దాదాపు ఇవే తేదీలు ఖరారయ్యే అవకాశముంది. గతేడాది పార్లమెంట్​ వింటర్​ సెషన్​ 2018 డిసెంబర్​ 11న ప్రారంభమై 2019 జనవరి 8 వరకు కొనసాగింది. ఈ ఏడాదిలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి కాలం జరిగిన సెషన్​ అదే. సభ జరగనున్న కాలం, సెషన్​ సిట్టింగ్​లపై వచ్చే వారం జరగనున్న కేబినెట్​ భేటీ అనంతరం.. అధికారికంగా ప్రకటించనున్నారు. అదే సమయంలో పార్లమెంట్​ ఉభయసభల్లో చర్చించాల్సిన అంశాలపై కార్యాచరణ రూపొందించనున్నారు. ఆర్డినెన్స్​లు చట్టాలుగా...! ఈ సమావేశాల్లో రెండు కీలక అత్యవసరాదేశాలను చట్టంగా రూపొందించాలని చూస్తోంది భాజపా. ముఖ్యంగా మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొనేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన

దేశంలో కొత్త జాతీయ విద్యావిధానం అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది

దేశంలో కొత్త జాతీయ విద్యావిధానం అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. కొత్త ముసాయిదా కోసం ఈ నెలాఖర్లో ఓ కమిటీని నియమించనుంది నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఎడ్యుకేషనల్​​ రీసర్చ్​ అండ్​ ట్రైనింగ్​ (ఎన్​సీఈఆర్​టీ). 14 ఏళ్ల నుంచి అమలులో ఉన్న ప్రస్తుత జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదా విధానాన్ని కమిటీ పరిశీలించి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల చివర్లో కమిటీ... జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదాను (ఎన్​సీయఫ్​)ను పునఃపరిశీలించి కొత్త విధానం అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనుందని ఎన్​సీఈఆర్​టీ డైరెక్టర్​ రుశికేష్​ సేనాపతి తెలిపారు. కొత్త విద్యా విధానంలో భాగంగా పాఠ్య ప్రణాళిక నిర్మాణాత్మక, ఆవిష్కరణ, విశ్లేషణ-ఆధారిత, అందరికీ అర్థమయ్యే రీతిలో అభ్యాస శైలి ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు. 'కొత్త విద్యా విధానం తుది ముసాయిదా కోసం ఎదురు చూస్తున్నాం. ఈ నెల చివర్లో కమిటీ నివేదికను సమర్పిస్తుంది. నివేదిక ప్రకారం కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఆ కొత్త పాఠ్యప్రణాళిక ప్రకారమే నూతన పుస్తకాలను తీసుకొస్తాం.'' -సేనాపతి, ఎన్​సీఈఆర్​టీ డైరెక్టర్​. చివరిసారిగా 2005లో పాఠ్య ప్రణాళిక ముసాయిదాను సవరించారు. 1975, 1

భారత స్టార్ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా.. తను టీనేజ్​లో ఉన్నప్పటి​ ఫొటోను ట్విట్టర్​లో పంచుకొని, ఆసక్తికర వ్యాఖ్యను జోడించాడు

భారత స్టార్ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా.. తను టీనేజ్​లో ఉన్నప్పటి​ ఫొటోను ట్విట్టర్​లో పంచుకొని, ఆసక్తికర వ్యాఖ్యను జోడించాడు. ప్రస్తుతం వన్డేల్లో టాప్ బౌలర్​గా కొనసాగుతున్నాడు బుమ్రా. కెరీర్​ ప్రారంభంలో తొలిసారిగా అవార్డు తీసుకున్నప్పటి ఫొటో, ఇటీవలే అవార్డు తీసుకుంటున్న మరో ఫొటో రెండింటినీ కలిపి పోస్ట్ చేశాడీ క్రికెటర్. అక్కడి నుంచి మొదలై, ఇక్కడ వరకు వచ్చానని ఓ వ్యాఖ్య జోడించాడు 25 ఏళ్ల ఈ క్రికెటర్​... చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు. భారత క్రికెట్​ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్న బుమ్రా... ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న ఆ సమయంలో కష్టాలను ఎదురొడ్డి నిలిచానని ఒకానొక సందర్భంలో చెప్పాడీ బౌలర్. చిన్నతనంలో ఎదురైన పరిస్థితులు తనను మరింత దృఢంగా తయారు చేశాయని అన్నాడు.

భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ నియంత్రణ రేఖను సందర్శించారు పాక్​ ఆర్మీ చీఫ్​

భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ నియంత్రణ రేఖను సందర్శించారు పాక్​ ఆర్మీ చీఫ్​ జనరల్​ జావేద్​ బజ్వా. అక్కడి భద్రతా పరిస్థితుల గురించి పాక్​ సైనికులను అడిగి తెలుసుకున్నారు. కశ్మీర్​లను ఒంటరిగా విడిచిపెట్టబోమని ఉద్ఘాటించారు. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అనంతరం.. భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్థాన్​ ఆర్మీ చీఫ్​ జనరల్​ జావేద్​​ బజ్వా.. నియంత్రణ రేఖను సందర్శించారు. పాక్​ దళాలను కలుసుకొని భద్రతా పరమైన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. 'నియంత్రణ రేఖ వద్ద సైనికులను పాక్​ ఆర్మీ చీఫ్​ కలుసుకున్నారు. అక్కడి పరిస్థితుల గురించి సమీక్షించారు.' - పాక్​ సైన్యం కశ్మీరీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా విడిచిపెట్టబోమని బజ్వా పునరుద్ఘాటించారు. కశ్మీర్ ప్రజల కోసం ఎంత దూరమైనా వెళతామని తెలిపారు.

టిక్​టాక్ వీడియోల సరదా కోసం కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే మరికొందరు వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

పోలీస్​ స్టేషన్​ లోపల వీడియో తీసి టిక్​టాక్​లో పోస్ట్ చేసిన నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. గుజరాత్​లోని బనాస్​కాంఠా జిల్లాలో ఈ ఘటన జరిగింది. టిక్​టాక్ వీడియోల సరదా కోసం కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే మరికొందరు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పోలీస్​ స్టేషన్​లో వీడియో తీసి దానిని టిక్​టాక్​లో అప్​లోడ్​ చేశారు గుజరాత్​కు చెందిన వ్యక్తులు. అదికాస్తా వైరల్ అయి పోలీసుల కంటపడింది. వెంటనే కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. ఇదీ జరిగింది... ఓ కేసు విచారణలో భాగంగా ఐదుగురిని అగథల్​ ​స్టేషన్​కు పిలిపించారు పోలీసులు. ఐదుగురిలో ఒకరిని విచారిస్తుండగా మిగిలిన నలుగురు పక్క గదిలో ఉండి వీడియో రికార్డు చేశారు. విచారణ ముగిశాక వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత వీడియోను టిక్​టాక్ యాప్​లో అప్​లోడ్​ చేశారు. ఆ వీడియోకు సంబంధించిన లింక్​ వాట్సాప్​ ద్వారా పోలీసు అధికారికి అందింది. "మాకు వాట్సాప్​లో టిక్​టాక్​ వీడియో రికార్డు చేసిన లింక్​ వచ్చింది. ఈ చర్యకు పాల్పడినందుకు వారిపై ఐపీసీ సెక్షన్​ 505 ప్రకారం, ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేశాము." -ఎస్ఎస్ రాణే, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్​ పో

లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ఎస్​బీఐ కార్డ్ నూతన ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది.

లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ ఎస్​బీఐ కార్డ్ నూతన ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. కార్డ్​, పిన్ అవసరం లేకుండానే మొబైల్ యాప్​ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేందుకు 'ఎస్​బీఐ కార్డ్​ పే' సేవలను నేడు ప్రారంభించింది. మొబైల్​ ఫోన్​ను ఉపయోగించి కాంటాక్ట్ ​లెస్ చెల్లింపులు చేసే.. 'ఎస్​బీఐ కార్డ్​ పే' సేవలను ప్రారంభించింది ఎస్​బీఐ కార్డ్. ఈ కొత్త ఫీచర్​తో కాంటాక్ట్​ లెస్ పేమెంట్​లను స్వీకరించే పాయింట్​ ఆఫ్ సేల్​ను ఉపయోగించవచ్చని పేర్కొంది. క్రెడిట్ కార్డ్​ను భౌతికంగా వినియోగించే అవసరం లేకుండా కేవలం ఒక్క క్లిక్​తో చెల్లింపులు చేయొచ్చని తెలిపింది. ఎలా వాడాలంటే... ఎస్​బీఐ కార్డ్​ వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించేందుకు.. ముందుగా ఎస్​బీఐ కార్డ్​ మొబైల్​ యాప్​ను అప్డేట్​ చేసుకోవాలి. తర్వాత వన్​ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇక పాయింట్​ ఆఫ్​ సేల్ డివైజ్​కు దగ్గరలో స్మార్ట్​ ఫోన్​ను ఉంచి సులభంగా చెల్లింపులు జరపొచ్చు అని ఎస్​బీఐ కార్డ్​ ఎండీ, సీఈఓ హర్​ దయాల్ ప్రసాద్ తెలిపారు. డెబిట్, క్రెడిట్ కార్డుల సంస్థ 'వీసా' కార్డుపై ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయి

13 రామచిలుకలను అదుపులోకి తీసుకొని దిల్లీ కోర్టులో హాజరుపరిచారు సీఐఎస్​ఎ​ఫ్​ అధికారులు.

ఢిల్లీ 13 రామచిలుకలను అదుపులోకి తీసుకొని దిల్లీ కోర్టులో హాజరుపరిచారు సీఐఎస్​ఎ​ఫ్​ అధికారులు.  చిలుకలను కోర్టులో ప్రవేశపెట్టడమేంటి అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే? కాకపోతే అవి ఏ తప్పూ చేయలేదు. అక్రమంగా ఆ చిలుకలను విదేశానికి తరలిస్తూ ఓ ఉజ్బెకిస్థాన్​ జాతీయుడు పట్టుబడ్డాడు. అతనితో పాటు ఆ చిలుకలను అదుపులోకి తీసుకొని కోర్టుకు తీసుకొచ్చారు అధికారులు. ఈ సంఘటన దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. దిల్లీ కోర్టులో 13 రామచిలుకలను ప్రవేశపెట్టారు అధికారులు. చిలుకలను కోర్టుకు తీసుకురావడమేంటని అనుకుంటున్నారా.. అయితే చిలుకలు తప్పేం చేయలేదు. వాటిని అక్రమంగా వేరే దేశానికి తరలిస్తున్న వ్యక్తితో పాటుగా కోర్టుకు తీసుకొచ్చారు సీఐఎస్​ఎఫ్​​ అధికారులు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చెప్పులు ఉంచే అట్టపెట్టెల్లో చిలుకలను ఉంచి... అధికారుల కళ్లుకప్పి గుట్టుగా తమ దేశానికి తీసుకుపోదాం అనుకున్నాడో వ్యక్తి . అతని ప్రయత్నం బోల్తాకొట్టి భద్రతాధికారుల తనిఖీల్లో దొరికిపోయాడు. నిందితుడిను అదుపులోకి తీసుకుని, చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు 'చిలుకలను ఓ దుక

మీసం తిప్పిన అధికారిపై వర్ల రామయ్య ఫిర్యాదు

తాడేపల్లి మీసం తిప్పిన అధికారిపై వర్ల రామయ్య ఫిర్యాదు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తనపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తనను అసభ్యకరంగా దూషించిన శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద ఫిర్యాదు చేశారు.  పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించే అధికారం శ్రీనివాసరావుకి లేదన్న వర్ల... వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు కొంతమంది పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పుడు శ్రీనివాసరావు ఏమయ్యాడు ప్రశ్నించారు.  తనకు పోలీసులంటే గౌరవం ఉందని 20 సంవత్సరాలు ఆ శాఖలో పనిచేశానని గుర్తు చేశారు. పోలీసులపై ఎప్పుడు తాను విమర్శలు చేయలేదని చెప్పారు సిట్ నోటీస్ లపై ౼౼౼౼౼౼౼౼ వైఎస్‌ వివేకా హత్యకేసులో సిట్‌ నుంచి తనకింకా ఎలాంటి నోటీసులు అందలేదని వర్లరామయ్య తెలిపారు. పోలీసులు లక్ష్యంగా చేసుకుని ఇచ్చారోలేదో నోటీసులు చూశాకే స్పందిస్తానని ఆయన అన్నారు

లింగమనేని రమేష్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం వాదనలు జరిగాయి. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు తగిన సమయం లేకపోవటంతో నేటికి వాయిదా వేసింది.

అమరావతి లింగమనేని రమేష్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం వాదనలు జరిగాయి. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు తగిన సమయం లేకపోవటంతో నేటికి వాయిదా వేసింది. కృష్ణానది కరకట్ట వద్ద నిర్మించిన లింగమనేని రమేష్ భవనం కూల్చివేతకు సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ భవన యజమాని పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు తగిన సమయం లేకపోవడంతో విచారణను నేటికి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె . విజయలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి. ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ... కూల్చివేతకు నోటీసులిచ్చే అధికారం సీఆర్‌డీఏ అధికారులకు లేదని పునరుద్ఘాటించారు. సంజాయిషీ నోటీసుకు అధికారుల ముందు హాజరై తగిన పత్రాలు సమర్పించి వివరణ ఇవ్వడానికి గడువు కోరితే ఇవ్వలేదన్నారు. కూల్చివేత నోటీసును రద్దు చేయాలని కోరారు. అడ్వొకేట్ జనరల్ ఎస్ . శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ... అనుమతి లేని కట్టడాలపై చర్యలు తీసుకునే అధికారం సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఉందన్నారు. చట్ట ప్రకారం అనుమతులు పొందకుండా పిటిషనర్ నిర్మాణం

పట్టణ గృహనిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్‌

అమరావతి పట్టణ గృహనిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్‌ చేపట్టనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.  వివిధ దశల్లో ఉన్న నిర్మాణాల కాంట్రాక్టులు, టిడ్కోలో రివర్స్ టెండరింగ్​కు వెళ్లనున్నట్లు వివరించారు.  ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా టిడ్కో రివర్స్ టెండర్​కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. పట్టణప్రాంత గృహనిర్మాణ ప్రాజెక్టుల విషయంలోనూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించినట్లు... పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు... ఈ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపడతామని తెలిపారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి అనుగణంగానే పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులు చేపడుతోన్న ఏపీ టిడ్కోలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాల్సిందిగా మంత్రి బొత్స ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు టెండర్లు ఖరారు చేస్తూ... ప్రజాధనం దుర్వినియోగం అయ్యేలా వ్యవహరించారని పేర్కొన్నారు. దీనికి ఫుల్​స్టాప్ పెట్టేందుకు ఇప్పటికీ ప్రారంభంకాని పనుల

వైఎస్ఆర్ నవోదయం పథకాన్ని ఇవాళ ప్రారంభం కానుంది.

అమరావతి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చెందిన రుణాలను ఒకే విడతలో రీస్ట్రక్చర్ చేసేందుకు వీలుగా వైఎస్ఆర్ నవోదయం పథకాన్ని ఇవాళ ప్రారంభం కానుంది.  ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా పరిశ్రమల శాఖ ఈ పథకాన్ని ప్రారంభించనుంది.  2020 మార్చి 31 తేదీ లోపు ఇబ్బందుల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాలు రీషెడ్యూలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈమేరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి వచ్చిందని పరిశ్రమల శాఖ తెలిపింది. వైఎస్ఆర్ నవోదయం పేరిట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాలు ఏక కాలంలో రీషెడ్యూలు చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. రిజర్వు బ్యాంకు సూచనల మేరకు రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఆ ఇబ్బందుల నుంచి తప్పించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. 9 నెలల కాలంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన రుణాలు రీషెడ్యూలు చేసేలా సదరు బ్యాంకులకు ప్రభుత్వం హామీలు జారీ చేయనుంది. ఒన్ టైమ్ రీస్ట్రక్చరింగ్ పేరిట ఈ కార్యాచరణ చేపట్టనున్నారు. 2020 మా

ఓవైపు చర్చలు...మరోవైపు షాకులు.. తెలంగాణ సర్కారు కొత్త స్కెచ్‌

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో..తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. సమ్మెపై కఠినంగా, ప్రణాళికబద్దంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం...రవాణా, రెవెన్యూ, ఆర్టీసీ, పోలీసు అధికారులు సమన్వయంతో ముందుకెళ్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు ఓ వైపు...చర్చల ఎత్తుగడ మరోవైపు సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11వ రోజు జరిగిన సమ్మెలో 62 శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. రెండ్రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో...రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.రీజినల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వందశాతం బస్సులు నడిపేలా సత్వర చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. ఆర్టీసీ పరిధిలోని గరుడ, రాజధాని ఏసీ బస్సులు మినహా ప్రతి బస్సు నిర్దేశించిన రూట్లలో నడువాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4,192 మంది తాత్కాలిక డ్రైవర్లు, 4192 మంది తాత్కాలిక కండక్టర్లు విధులు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. 4,192 ఆర్టీసీ, 1,952 అద్దె బస్సులు కలుపుకొని

తెలంగాణ అర్టీసీ కొత్త ఎండి ఎవరంటే

ఇప్పటికే గత కొద్దిరోజలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఏపీ మాదిరిగా తమను కూడా ప్రభుత్వంలో విలీనం చేసి, తమ కోరికలను తీర్చాలని ఆర్టీసీ కార్మికులు ఇటీవల ప్రభుత్వంతో చర్చలు జరుపగా, ప్రభుత్వ పెద్దలు మాత్రం వారి కోరికలను తీర్చే విధంగా హామీ ఇవ్వకపోవడంతో ఆర్టీసీ నాయకులు సమ్మె బాట పట్టడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ చర్చల్లో ఆర్టీసీ నాయకుల గొంతెమ్మ కోరికలు తీర్చే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రానికి లేదని, కావున సమ్మె విరమించాలని ముఖ్యమంత్రి, ఆర్టీసీ నాయకులను కోరారు.యి అయితేయకులు అందుకు ససేమిరా అనడంతో వెంటనే ప్రభుత్వ యంత్రాగాన్ని రంగంలోకి దించి ప్రైవేట్ బస్సు డ్రైవర్స్ అలానే కండక్టర్స్ ని తాత్కాలికంగా తీసుకుని ప్రజలకు సేవలు అందించాలని ఒక హుకుం జారీ చేసారు సీఎం. కాగా దీని పై తెలంగాణ హై కోర్ట్ లో వ్యాజ్యం కూడా వేయడం జరిగింది. అయితే నేటి ఉదయం హై కోర్ట్ ఇచ్చిన తీర్పు మేరకు, అటు ఆర్టీసీ యూనియన్లు మరొక్కసారి అలోచించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని, అలానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా సానుకూలంగా వ్యవహరించి ఆర్టీసీ కార్మికుల పట్ల కొంత సామరస్యాన్ని కలిగి ఉండి వారికి న్

ముఖ్యమంత్రిని కలిసిన అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌

అమరావతి:  హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్‌మాన్‌ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సీఎంని తొలిసారి కలుసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సమయంలో రిఫ్‌మాన్‌ శ్రీ వైయస్‌.జగన్‌తో సమావేశమయ్యారు. గ్రామ సచివాలయాలతోపాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. అవినీతి రహిత, పారదర్శక, సుపరిపాలనలో భాగంగా తీసుకొచ్చిన విధానాల గురించీ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆమేరకు తగిన కృషిచేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పాలనాసంస్కరణలపై రిఫ్‌మాన్‌ ప్రశంసలు కురిపించారు.

ఎస్ బీ ఐ ఖాతా దారులకు మరో షాక్

భారతీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా...తన షాకుల పరంపర కొనసాగిస్తోంది. ఈ నెల మొదటి వారంలో మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి విధించిన సంగతి తెలిసిందే. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం మూడుసార్లు ఉండగా...దాన్ని తగ్గిస్తూ నెలకు ఒక్కసారికి మాత్రమే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఇది ఖాతాదారులకు తీవ్ర నిరాశ కలిగించింది. అదే ఒరవడిలో మరో పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది. రూ.లక్షలోపు బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లకు వర్తింప చేస్తూ బ్యాంక్ అకౌంట్లలోని డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించింది. వచ్చే నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ రెపో రేటు తగ్గింపు ఎస్‌బీఐ నిర్ణయానికి కారణం అయింది.రెపో రేటును 0.25 శాత మేర తగ్గిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల రెపో 5.15 శాతానికి దిగొచ్చింది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది మొత్తంగా ఆర్‌బీఐ 135 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. ఈ నేపథ్యంలో సేవింగ్స్ అకౌంట్లపై రూ.లక్ష వరకు డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఎస్‌బీఐ ఈ కీలక నిర

నోరుజారిన వైసీపీ నేత: మరో ‘ఆణిముత్యం’ అంటూ నెటిజన్ల సెటైర్లు

నోరుజారిన వైసీపీ నేత:  మరో ‘ఆణిముత్యం’ అంటూ నెటిజన్ల సెటైర్లు గుంటూరు: తమ అధినేతలను ప్రసన్నం చేసుకునేకుందుకు చాలా మంది నేతలు వారిపై ప్రశంసలు చేయడం సాధారణ విషయమే.  ఈ సందర్భంలోనే పలువురు నేతలు పొరబాట్లు చేస్తూ విమర్శలను ఎదుర్కొవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంటారు.  తాజాగా ఓ వైసీపీ నేత కూడా ఇలాంటి జాబితాలో చేరిపోయారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ ఏసురత్నం రైతు భరోసా పథకంపై ప్రశంసలు కురిపించారు.  పనిలో పనిగా ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా ప్రశంసలతో ముంచెత్తారు.  జగన్ పాలనను ప్రశంసిస్తూ ఏదో చెప్పబోయిన ఆయన నోరు జారారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనబోయి స్వర్గీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు ఏసురత్నం.  ఇంతలో పక్కనున్న వారు తప్పును సరిదిద్దడంతో.. వెంటనే కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయినా మళ్లీ తడబడ్డారు.  స్వర్గీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా భారీగా వర్షాలు పడ్డాయన్నారు.

అయోధ్య కేసులో ముగిసిన విచారణ

అయోధ్య కేసులో ముగిసిన విచారణ..  తీర్పును రిజర్వ్ లో ఉంచిన సుప్రీంకోర్టు .. న్యూఢిల్లీ : అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు విచారణను ముగించింది.  దాదాపు 40 రోజుల పాటు ఏకధాటిగా సుప్రీంకోర్టు ఈ కేసును విచారించింది.  చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యం వహించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వైరి పక్షాల వాదనలను విన్నది.  ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వాదనలను వింటామని సుప్రీంకోర్టు ప్రకటించినప్పటికీ... ఒక గంట ముందే అంటే 4 గంటలకే విచారణ ముగిసినట్టు ప్రకటించింది.  ఇంతకు మించి వినడానికి ఏమీ లేదని తెలిపింది. తుది తీర్పును పెండింగ్ లో ఉంచింది.  నవంబర్ 17న ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగానే తుది తీర్పును వెలువరించే అవకాశాలు ఉన్నాయి.

మందు బాబులకు శుభవార్త

హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం సిండికేట్లను నిలువరించడానికి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. నవంబర్1, 2019 నుంచి మొదలయ్యే మద్యం షాపుల్లో క్రయ విక్రయాల కోసం ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ఏ 4 మద్యం షాపుల టెండర్ల ప్రక్రియలో సిండికేట్‌గా ఏర్పడేందుకు దరఖాస్తుదారులను కొంతమంది కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ దృష్టికి ఫిర్యాదులు రావడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. మద్యం సిండికేట్ల రూపంలో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా అనైతిక మార్గాల్లో మద్యం వ్యాపారం చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తెలంగాణ ఎక్సైజ్ చట్టం 36బీ, 41ల ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం అమ్మితే చట్ట ప్రకారం 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. ఎక్సైజ్‌శాఖ తరఫున మరో రూ.2 నుంచి 3లక్షల అపరాధ రుసుము కట్టేలా నిబంధనలు రూపొందించారు.

కేసీఆర్ కి షాక్ ఇవ్వనున్న పార్టీ నాయకులు

ఆర్టీసీ కార్మికులు కేవలం వారి సమస్య కాకుండా కేసీఆర్ కి మరో కొత్త సమస్య తెచ్చి పెట్టారు తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కాంగ్రెస్ - బీజేపీ - టీడీపీ - వామపక్షాలన్నీ కూడా కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. ఇక ఇదే సమయంలో అధికార టీఆర్ ఎస్ నేతలు కదలికలు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. తాము ఇతర పార్టీల్లోకి జంప్ చేయడానికి ఇదే సరైన సమయమని పలువురు ఎమ్మెల్యేలు - ఎంపీలు - నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తమ సన్నిహితుల వద్ద చర్చిస్తున్నట్లు సమాచారం. నిజానికి.. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు మరింత జోష్తో ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా తెలంగాణలో టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు - నేతలు బీజేపీ గూటికి చేరుతారనే ప్రచారం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత జోరందుకుంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ వివేక్ తదితరులు కమలం గూటికి చేరారు. మంత్రివర్గ విస్తరణకు ముందు - ఆ తర్వాత పలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మ్యానిఫెస్టోలో పేర్కొనడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి

ముంబై:  ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వీరసావర్కర్‌కు భారతరత్న ఇస్తామని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మ్యానిఫెస్టోలో పేర్కొనడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.  అయితే ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా తప్పు పట్టారు.  రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించిందని, ఇప్పుడు అదే వైఖరిని సావర్కర్‌పై చూపిస్తుందని మోదీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అకోలాలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు.  ‘‘వీర సావర్కర్ జాతీయతను నేర్పించిన వారు. ఆధునిక భారతానికి సంస్కారం నేర్పిన వారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడుతోంది. కాంగ్రెస్‌కు ఇది అలవాటే.  రాజ్యంగ నిర్మాత అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించింది.  ప్రస్తుతం సావర్కర్ విషయంలోనూ ఇదే చేస్తోంది’’ అని అన్నారు

ఉత్తర కొరియా అధ్యక్షుడు‌కు సంబంధించి అక్కడి ప్రభుత్వ మీడియా విడుదల చేసిన చిత్రాలు తాజాగా సంచలనం సృష్టిస్తున్నాయి.

పోంగ్యాంగ్:  ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌కు సంబంధించి  అక్కడి ప్రభుత్వ మీడియా విడుదల చేసిన చిత్రాలు తాజాగా సంచలనం సృష్టిస్తున్నాయి.  ఆ దేశంలోనే అత్యంత పవిత్ర పర్వతమైన 'పయక్టూ' మీద తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తున్న కిమ్ చిత్రాలు అక్కడి ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.  కిమ్ కొత్త ఆపరేషన్‌కు తెరతీశారా అని వారు చర్చించుకుంటున్నారు. అయితే వారలా భావించటం వెనుక బలమైన కారణమే ఉంది. కొరియన్ విప్లవానికి, కిమ్ వంశానికీ ఆ పర్వతంతో చారిత్రాత్మకమైన సంబంధం ఉంది. దీంతో ప్రజలు, ప్రభుత్వాధికారులు మరో గొప్ప ఆపరేషన్‌కు దీన్ని సంకేతంగా భావిస్తున్నారు.  ప్రపంచం అబ్బురపడే రితీలో ఉత్తర కొరియా అడుగులు వేయబోతోందని వారు భావిస్తున్నారు.  గతంలో విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో కిమ్ అనేక సార్లు ఈ ప్రవిత్ర పర్వతంపైకి వెళ్లారు.  దీంతో కిమ్ నుంచి మరో కీలక నిర్ణయం వెలువడనుందని ప్రజలు భావిస్తున్నారు.  2017లో ఆ దేశం చేపట్టిన అతి పెద్ద ఖండాంతర క్షిపణి పరీక్షల ముందు కూడా పయక్టూ పర్వతంపై కిమ్ వెళ్లిన విషయాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారు.  కాగా..అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం..పాశ్చాత్య విధానాలపై కిమ్ ధిక్కార

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ...

తిరుమల:  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది.  శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.  ఏడుకొండలవాడి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.  స్వామివారిని నిన్న 86,715 మంది భక్తులు దర్శించుకున్నారు.  29,001 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలే అజెండాగా ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది

అమరావతి రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలే అజెండాగా ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చ జరగనుంది.  నవరత్నాల్లోని కీలకమైన సంక్షేమ పథకాల అమలు కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.  వైఎస్​ఆర్ ఆసరా పథకంలో భాగంగా చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే అంశంపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.  పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించనుంది. మత్స్యకారుల సంక్షేమ కోసం ... చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే మొత్తాన్ని పది వేలకు పెంచే అంశంపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.  గతంలో మత్స్యకారులకు రూ. 4500 చెల్లించిన ప్రభుత్వం...ప్రస్తుతం పరిహారాన్ని 10 వేలకు పెంచాలని నిర్ణయించింది.  ఈ అంశంపై కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. ఇక డ్వాక్రా మహిళల కోసం గతంలో వెలుగు పేరుతో చేపట్టిన పేదరిక నిర్మూలన పథకాన్ని వైఎస్ఆర్ క్రాంతి పథంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇప్పటికే తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా కేబినెట్ రాటిఫై చేయనుంది.  వ్యవసాయ మిషన్ సమావేశంలో వైఎస్సార్ రైతు భరోసా పథకానికి వేయి

అయోధ్య కేసు విచారణ నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది

న్యూఢిల్లీ రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసు విచారణ నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది.  మంగళవారం రోజు విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి ఈ అంశంపై కాస్త స్పష్టత నిచ్చారు.  నేటితో వాదనలు పూర్తవనున్నాయని వ్యాఖ్యానించారు. తొలుత విచారణ అక్టోబర్​ 18 కల్లా పూర్తి చేయాలని గడువుగా పెట్టుకుంది అత్యున్నత న్యాయస్థానం.  ఇటీవల అక్టోబర్​ 17న వాదనలు ముగిస్తామని వెల్లడించింది.  తాజాగా మరో రోజు ముందుగానే వాదనలు ముగించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది.  హిందూ, ముస్లిం వర్గాలు.. ఎదుటి పక్షాల వాదనలపై తమ తమ తుది అభిప్రాయాలను వెల్లడించేందుకు ఈ రోజు సాయంత్రం 5 గంటలవరకు సమయం ఇచ్చే అవకాశముంది. అయితే... అయోధ్య కేసు విచారణలో తుది తీర్పు నవంబర్​ 4-5 తేదీల్లో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  విచారణ ముగుస్తుండటం- ఏ సమయంలోనైనా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ఈ నేపథ్యంలో డిసెంబర్​ 10 వరకు అయోధ్యలో 144 సెక్షన్​ విధించారు. మధ్యవర్తిత్వం విఫలమైన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఆగస్టు 6 ను

కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరాన్ని ప్రశ్నించి, అరెస్టు చేసేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి అనుమతి

న్యూఢిల్లీ ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరాన్ని ప్రశ్నించి, అరెస్టు చేసేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది.  ప్రస్తుతం తిహార్‌ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆయన్ని ఈడీ అధికారులు బుధవారం ప్రశ్నించి, అరెస్టు చేయనున్నారు.  వాస్తవానికి సీబీఐ పెట్టిన కేసులో గత 55 రోజులుగా తిహార్‌ జైల్లో ఉన్న చిదంబరం కస్టడీ గురువారం ముగియనున్నది.  చిదంబరాన్ని ప్రశ్నించాక, అవసరమైతే అరెస్టు చేయడానికి జడ్జి అజయ్‌ కుమార్‌ అనుమతి ఇచ్చారు.  కాగా, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో బెయిలివ్వాల్సిందిగా కోరుతూ చిదంబరం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు సిద్ధమవుతోన్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ

చంద్రుడిపైకి 2024లో.. మనుషులను పంపేందుకు సిద్ధమవుతోన్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా కొత్తతరం స్పేస్​సూట్‌లను ఆవిష్కరించింది. వీటిలో ఒక స్పేస్​సూట్‌ను ఎక్స్‌ప్లోరేషన్‌ ఎగ్జ్రా వెహిక్యులర్‌ మొబిలిటీ యూనిట్‌ లేదా గ్జెముగా నాసా పిలుస్తోంది.  గ్జెమూను చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉపయోగించేందుకు డిజైన్ చేసింది. చంద్రుడిపై ఎక్కువ కాలం పరిశోధనలు చేసేందుకు గ్జెము ఉపకరిస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మరో స్పేస్​సూట్‌ను.... ఓరియన్ క్రూ సర్వైవల్ సిస్టమ్‌గా పిలుస్తోంది. ఓరియాన్ అంతరిక్ష నౌక కోసం నాసా దీన్ని రూపొందించింది.  చంద్రుడిపైకి తొలి మహిళను పంపేందుకు 'ఆర్టెమిస్‌' అనే భారీ ప్రాజెక్టును నాసా చేపట్టింది.  మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా పంపటానికి ప్రయత్నాలు చేస్తున్నామని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టైన్ అన్నారు. ఇప్పుడున్న అన్నింటి కన్నా ఈ సూట్లు​ చాలా విభిన్నం. చంద్రుడిపై ఉండే వాతావరణానికి అనుగుణంగా సూట్​ను తయారు చేసినట్లు నాసా మేనేజర్ క్రిస్ హాన్సెన్ తెలిపారు.  సూట్​లో ఏదైనా అంతరాయం కలిగితే దాన్ని భూమి మీదకు తీసుకురాకుండా పైనే సమస్యను పరిష్కరించవచ్చని స్పష్టం

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ..

ముంబై: వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.  24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,600, విజయవాడలో రూ.38,000, విశాఖపట్నంలో రూ.39,750, ప్రొద్దుటూరులో రూ.38,000, చెన్నైలో రూ.38,430గా ఉంది.  ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,750, విజయవాడలో రూ.35,250, విశాఖపట్నంలో రూ.36,570, ప్రొద్దుటూరులో రూ.35,240, చెన్నైలో రూ.36,780గా ఉంది.  వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,800, విజయవాడలో రూ.47,000, విశాఖపట్నంలో రూ.46,900, ప్రొద్దుటూరులో రూ.46,900, చెన్నైలో రూ.49,700 వద్ద ముగిసింది.

తెలంగాణ లో అస్సలు ఏం జరుగుతుంది.

దసరా ముందు వరకు తెలంగాణాలో దాదాపుగా అంతా సవ్యంగా ఉన్నది. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇవ్వడం, దాన్ని తెరాస పార్టీ పెద్దగా సీరియస్ గా తీసుకోకపోవడంతో ఒక్కసారిగా వేడి రగులుకుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. గత 11 రోజులుగా సమ్మె జరుగుతున్నది. పైగా సమ్మెకు దిగి కార్మికులు సొంతంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నారని చెప్పింది. దీంతో సమ్మెను మరింతగా ఉదృతం చేశారు. సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదని చెప్పి ప్రైవేట్ బస్సులను తిప్పుతున్నారు.తాత్కాలిక ఉద్యోగులను నియమించి బస్సులను నడుపుతున్నారు. అయితే, బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉంటె, తెలంగాణాలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడాని గవర్నర్ ను ఢిల్లీకి రమ్మని చెప్పడంతో.. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్ళింది. ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమె ప్రధాని మోడీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించబోతున్నారు. ఈ విషయాలతో పాటుగా ఆర్టీసీ సమ్మె గురించి కూడా ఆమె మోడీకి వివరించబోతున్నారు. అటు అమిత్ షాను కూడా ఆమె ఈరోజు కలవబోతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయం గురించి అమిత్ షాకు వివరించబోతున్నట్టు తెల

ఆర్టీసీ సమ్మెను ఆపగలిగే అతనొక్కడే.. కానీ ఇంకా సహాయం కొరని కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కి తను పదవిలోకి వచ్చిన చాలా నాళ్ల తర్వాత అతి పెద్ద సవాలు ఎదురయింది. ఏదో గాలివాన కొట్టుకొనిపోతుంది అనుకున్నా ఆర్టీసీ సమ్మె కాస్తా శ్రీనివాస్ మరణంతో చాలా తీవ్రంగా మారింది. ఇప్పుడు ఈ సెగ మరింత పెరిగి ఇతర డిపార్ట్మెంట్స్ కు కూడా అంటుతోంది. ఇప్పటికే దసరా సెలవులను అక్టోబరు 19వ తేదీ వరకు పొడిగించి కెసిఆర్ చాలా చెడ్డ పేరు మూటకట్టుకున్నాడు. అంతకుమించి పొడిగించాలంటే మాత్రం విద్యాసంస్థలు కచ్చితంగా ఒప్పుకోవు. సరే అలాగే వాటిని నడుపుదాం అన్న బస్సులు అందుబాటులో లేక పోయే..! కాబట్టి రానున్న రోజుల్లో పరిస్థితి మరింత విషమంగా మారను న్న విషయం మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఆర్.టి.సి సమ్మెను ఆపగలిగే సత్తా ఉన్న నాయకుడు హరీష్ రావు అనడంలో ఎలాంటి సందేహం లేదు.మొన్నటి వరకు ఆర్టీసీ ప్రెసిడెంట్ గా పనిచేసిన హరీష్ రావు కి యూనియన్ లతో సత్సంబంధాలు ఉన్నాయి. అందులో చాలామంది అతనికి వ్యక్తిగతంగా బాగా పరిచయం మరియు ఇప్పుడు సమ్మె ముందుండి నడిపిస్తున్న అశ్వత్థామరెడ్డి హరీష్ రావు ప్రోత్సహించి ఆదరించినవాడే. అశ్వత్థామ రెడ్డిని హరీష్ రావే ఉన్నత పదవులు ఇస్తూ మంచి స్థాయికి చేర్చాడు. హరీష్ రావును కాని

SMSతో ఆధార్ - పాన్ లింక్

పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం తప్పనిసరి. సెప్టెంబర్ 30తో ముగిసిన ఈ గడువును డిసెంబర్ 2019 వరకు పొడిగించారు. ఈ గడువులోగా ఆధార్‌తో లింక్‌ చేయకపోతే ఆ పాన్‌కార్డు పని చేయదు. మరి, వీటిని ఎలా లింక్ చేయాలి? రెండు నిమిషాల్లోనే పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయవచ్చు. పాన్‌ కార్డును ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేయడం చాలా సులభం. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్‌ వెబ్‌సైట్‌ ద్వారా సులువుగా లింక్ చేసుకోవచ్చు. ఇదివరకే రిజిస్టర్ చేసుకున్న యూజర్లు ఇన్‌కం టాక్స్ ఇండియా ఇ ఫైలింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. యూజర్ ఐడీ, పాస్‌వర్డుతో లాగిన్ కావాలి. ప్రొఫైల్ సెట్టింగ్‌లోకి వెళ్తే 'లింక్‌ ఆధార్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ అడిగిన వివరాలు ఇచ్చి పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోకపోయినా కంగారుపడాల్సిన పనిలేదు. అలాంటి వాళ్లు ఇన్‌కం టాక్స్ ఇ ఫైలింగ్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి, హోమ్‌పేజీలో ఎడమవైపు ఉన్న 'లింక్‌ఆధార్' అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. అక్కడ పాన్‌కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మీ పేరు ఎంటర్ చేస్తే పనైపోయినట్లే. లేదంటే ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకు

ఇరవై మూడు సమస్యలపై వినతి పత్రం..

ప్రధాని నరేంద్రమోదీ తో ఒక గంటకు పైగా  కెసిఆర్ భేటీ.. ఇరవై మూడు సమస్యలపై వినతి పత్రం.. 1. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ లో వెనుకబడిన జిల్లాలకు 450 కోట్లు - 5 వ విడత సహాయం. 2. NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) సహాయంతో ఆదిలాబాద్ జిల్లా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ. 3. తెలంగాణ హైకోర్టులో న్యాయ మూర్తుల సంఖ్య ను 24 నుండి 42 వరకు పెంచడం. 4. తెలంగాణ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు. 5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) యొక్క అనుమతి. 6. కొత్త జిల్లాల్లో 23 జవహర్ నవోదయ విద్యాలయాల (జెఎన్‌వి) మంజూరు. 7. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు: పనులు పూర్తి చేయడానికి మరియు వేగ వంతం చేయడానికి నిధుల అవసరం. 8. ఎన్‌ఐటిఐ ఆయోగ్ సిఫారసు చేసిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లకు ఆర్థిక సహాయం (రూ .5000 కోట్లు, రూ. 19205 కోట్లు). 9. ఖమ్మం జిల్లా లోని బయ్యారాం వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - దాని కోసం పునర్వ్యవస్థీకరణ చట్టం అందించ బడింది. 10. మెదక్ జిల్లా, జహీరాబాద్ వద్ద జాతీయ పెట్టుబడి మరియు తయారీ జ

తెలంగాణ ఆర్టీ‌సీలో స‌మ్మె సైరెన్ మోగింది

హైద‌రాబాద్:- తెలంగాణ ఆర్టీ‌సీలో స‌మ్మె సైరెన్ మోగింది . త్రిస‌భ్య క‌మిటీతో కార్మి‌క సంఘాల చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యా‌యి. ముందే నిర్ణ‌యించిన‌ట్లు‌గా ఇవాళ అర్ధ‌రాత్రి నుంచే స‌మ్మె‌కు దిగుతున్న‌ట్లు తెలంగాణ ఆర్టీ‌సీ ఐకాస ఛైర్మ‌న్ అశ్వ‌త్ధా‌మ‌రెడ్డి‌స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌మైన హామీలేందునే స‌మ్మె‌కు వెళుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లు త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. డిమాండ్ల ప‌రిష్కా‌రానికి ఏర్పా‌టు చేసిన ఐఏఎస్‌ల త్రిస‌భ్య క‌మిటీ ఏ నిర్ణ‌య‌మూ తీసుకునే ప‌రిస్థి‌తుల్లో లేద‌ని ఆయ‌న చెప్పా‌రు. ఎలాంటి నోటీసుల‌కు భ‌య‌ప‌డొద్ద‌ని, నిర్భ‌యంగా రేపు ఉద‌యం నుంచి కార్మి‌కులు స‌మ్మె‌కు అన్ని వ‌ర్గా‌లు మ‌ద్ద‌తు తెల‌పాల్సిందిగా ఐకాస నాయ‌కులు కోరారు. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ఆర్టీ‌సీ సంస్ధ‌ను ప్ర‌భుత్వం కాపాడాల‌ని కోరారు. నాలుగేళ్లు‌గా ఏటా స‌మ్మె నోటీసు ఇస్తూ‌నే ఉన్నా‌మ‌ని, అయినా స‌మ‌స్య‌ను స‌రిష్క‌రించ‌లేద‌ని అన్నా‌రు. ఆర్టీ‌సీలో 50 వేల మంది కార్మి‌కులు పాల్గొంటార‌ని తెలంగాణ ఆర్టీ‌సీ ఐకాస ఛైర్మ‌న్ అశ్వ‌త్ధా‌మ‌రెడ్డి‌ చెప్పారు...

విద్యుత్తు ఉద్యోగుల విభజనలో కీలక అడుగులు పడ్డాయి.

హైదరాబాద్ విద్యుత్తు ఉద్యోగుల విభజనలో కీలక అడుగులు పడ్డాయి. తెలంగాణ విద్యుత్తు సంస్థలతోపాటు ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన ఉద్యోగులకు ప్రాథమిక కేటాయింపు చేస్తూ ధర్మాధికారి నియమించిన ఉపకమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చారు. స్థానికత ఆధారంగా తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు, ఏపీ ఉద్యోగులను ఏపీకే కేటాయిస్తూ ఉప కమిటీ సభ్యుడు ఎస్‌.అశోక్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. ఏపీ స్థానికత కలిగిన 1157 మంది ఉద్యోగులను తాత్కాలిక కేటాయింపు కింద ఏపీకి కేటాయించారు.

ఆ బాలుడు పదేళ్ల కిందట తప్పిపోయాడు.మూగ, చెవుడు. అయినా చేతిరాత కుటుంబ సభ్యులను కలిపింది.

ఆ బాలుడు పదేళ్ల కిందట తప్పిపోయాడు. ఆయనకు మూగ, చెవుడు. అయినా ఆయన చేతిరాత కుటుంబ సభ్యులను కలిపింది. గంజాం జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై శిశు సంక్షేమ కమిటీ (సీీడబ్ల్యుసీ) సభ్యురాలు మీనతి ప్రధాన్‌, కొదలాలోని బాలవికాస్‌ ఆవాసిక కేంద్రం ప్రధానాచార్యుడు అవిరేష్‌ ప్రసాద్‌ కుమార్‌ మహాపాత్ర్‌  తెలిపారు. గంజాం జిల్లా దిగపొహండి సమీపాన తరుబుడి గ్రామానికి చెందిన షేక్‌ కమాల్‌, షహజబి దంపతుల ఏడేళ్ల మూగ బధిర కుమారుడు షేక్‌ బాబు 2009లో ఇంటి నుంచి తప్పిపోయాడు. ఆయన కోసం వివిధ చోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆశలు వదులుకున్నారు. కుమారునిపై బెంగతో షేక్‌ కమాల్‌ మృతిచెందాడు. ఆ బాలుడ్ని 2016లో బ్రహ్మపుర ఛైల్డ్‌లైన్‌ ప్రతినిధులు స్థానిక రైల్వే స్టేషన్‌లో కాపాడారు. ఆయన తన వివరాలేవీ చెప్పలేకపోవడంతో సీడబ్ల్యుసీ ఆదేశాల మేరకు ఛైల్డ్‌లైన్‌ ప్రతినిధులు ఆయనను గంజాం జిల్లా కొదలాలోని బాల వికాస్‌ ఆవాసిక కేంద్రానికి తరలించారు. ఆయన తన పేరు కూడా చెప్పలేకపోవడంతో కేంద్రం అధికారులు కాలియా అని పేరుపెట్టారు. 2018లో బాలునికి చదువు చెప్పడం ప్రారంభించారు. బాలుడు కుడివైపు నుంచి ఎడవవైపునకు రాయడంతో ముస్లిం కుటుంబానికి చెందినవాడ

ఆంధ్రప్రదేశ్‌పై ఆరెస్సెస్ నేతలు ప్రధానంగా దృష్టి పెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌పై ఆరెస్సెస్ నేతలు ప్రధానంగా దృష్టి పెట్టారు. నెలకో సారి కీలకమైన సమావేశం నిర్వహించి.. ఏం చేయాలో.. ఏం చేయకూడదో చెబుతున్నారు. మంగళవారం కూడా.. ఏపీ బీజేపీ ముఖ్యనేతలతో ఆరెస్సెస్ కీలక నేతలు గుంటూరులో సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మత మార్పిడుల కోసమే పని చేస్తోందన్న అభిప్రాయంతో.. ఆరెస్సెస్ నేతలు ఉన్నారు. జగన్ ఒక ప్రణాళిక లేకుండా వ్యవహారిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారన్న అభిప్రాయంతో ఉన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన కూలీల అంశం కూడా చర్చకు వచ్చింది. జేపీలో చేరాలనుకుంటున్న నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు పెట్టడం, పాత కేసులను తిరగదోడుతూ వేధిస్తున్నారని కొంత మంది నేతలు ఆరెస్సెస్ నేతల దృష్టికి తీసుకెళ్లారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కంటే వైసీపీ ప్రస్తుత ప్రభుత్వం పోలీసులను ఎక్కువగా ఉపయోగించుకుంటుందని బీజేపీ నేతలు అభిప్రాయపడ్జారు. బీజేపీలో జగన్మోహన్ రెడ్డిని సమర్థించే వారిలో ముందుడే… సోము వీర్రాజు కూడా.. పాలనపై… ఆరెస్సెస్‌కు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు చేసిన తప్పులకంటే జగనే ఎక్కువగా తప్పులు చేస్తున్నారని ఇరువురి