ప్ర‌స్తుతానికి సినిమా చూసిన వాళ్లు మాత్రం బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటున్నారు.

సైరా సినిమా రిలీజ్‌కి ముందు అనేక వివాదాలు చిత్రాన్ని చుట్టుముట్టిన అన్నింటిని సాల్వ్ చేసుకుంటూ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.

ప్ర‌స్తుతానికి సినిమా చూసిన వాళ్లు మాత్రం బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటున్నారు.

సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో అభిమానుల ఆశించిన స్థాయి క‌న్నా ఎక్కువ వినోదం ఉంద‌ట‌.

రేనాటి సూరీడుగా చిరు ప్ర‌ద‌ర్శ‌న అద్భుతం అంటున్నారు.

ఆయ‌న చెప్పే డైలాగ్స్‌, యాక్ష‌న్ సీన్స్ లో చిరు న‌ట ప్ర‌ద‌ర్శ‌న సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని నెటిజ‌న్స్ అంటున్నారు.

అమిత్ త్రివేది అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువ‌లు, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, గ్రాండ్ విజువ‌ల్స్ సినీ ప్రేక్ష‌కుల‌కి ఎంతో ఆహ్ల‌దాన్ని పంచుతుంద‌ని చెబుతున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌ళం మెగా అభిమానుల ఆనందాన్ని మ‌రో మెట్టు ఎక్కేలా చేస్తుంద‌ని ట్వీట్స్ చేస్తున్నారు చిరంజీవికి గురువుగా అమితాబ్ స‌రిగ్గా స‌రిపోయారని, త‌మ‌న్నా, న‌య‌న‌తార‌ల‌తో పాటు విజ‌య్ సేతుప‌తి, సుదీప్, జ‌గ‌ప‌తి బాబు, నిహారిక త‌మ పాత్ర‌ల‌కి చక్క‌గా న్యాయం చేశార‌ని కొనియాడుతున్నారు.

క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో సురేంద‌ర్ రెడ్డి ఎంతో అందంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించ‌గా, ఫ‌స్టాఫ్‌ని మించి సెకండాఫ్ ఉంద‌ని చెబుతున్నారు.

సినిమా చూస్తున్నంత‌సేపు రోమాలు నిక్క‌పొడుచుకునే ఉంటాయ‌ని, దేశ‌భ‌క్తిని ఇనుమ‌డించే ఈ సినిమాని త‌న తండ్రికి చ‌ర‌ణ్ గిఫ్ట్‌గా ఇవ్వ‌డం ఎంతో అదృష్టం అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

మొత్తానికి సైరా చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని గ‌ట్టిగా చెబుతున్నారు మెగా ఫ్యాన్స్

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..