జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించాలని సీబీఐ.. కోర్టును కోరింది

హైదరాబాద్

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరిన జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించాలని సీబీఐ.. కోర్టును కోరింది.

చట్టం ముందు జగన్​తో సహా ప్రజలందరూ సమానమేనన్న సీబీఐ, మినహాయింపు రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది.

జగన్​కు ఉన్న ఆధునిక వసతులతో 275 కి.మీటర్లు ప్రయాణించడం అంత కష్టమేమీ కాదని అభిప్రాయపడింది.

జగన్ మినహాయింపు పిటిషన్​లో చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది.

విజయవాడ నుంచి వారానికోసారి రావడం కష్టమవుతుందన్నది సరైన కారణం కాదని సీబీఐ... కోర్టుకు తెలిపింది.

జగన్​కు ఆధునిక వసతులతో 275 కి.మీ ప్రయాణించడం కష్టమేమీ కాదన్న కేదాస... ఆర్థిక ప్రభావంతో సాక్ష్యాలను తారుమారు చేస్తారనే గతంలో జగన్​ను అరెస్టు చేశామని కోర్టుకు తెలిపింది.

ఇప్పుడు ప్రభుత్వాధినేతగా జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం మరింత ఎక్కువగా ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ అభిప్రాయపడింది.

సీఎం కుమారుడిగానే అక్రమ ఆర్థిక లావాదేవీలు చేశారని జగన్​పై అభియోగాలున్నాయని.. ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్నారని సీబీఐ పేర్కొంది.

జగన్ జైల్లో ఉన్నప్పుడే తన బలాన్ని ప్రదర్శించి సాక్షులను ప్రభావితం చేశారన్న సీబీఐ... ప్రజాప్రయోజనాల రీత్యా జగన్ అభ్యర్థనలన్నీ తిరస్కరించాలని సీబీఐ... కోర్టును కోరింది.

వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని జగనే అంటున్నారన్న సీబీఐ... బెయిల్ కోరినప్పుడు అంగీకరించిన షరతులకు కట్టుబడి ఉండాలని సీబీఐ సూచించింది.

అత్యవసర పరిస్థితి ఉంటే ఆ రోజు మినహాయింపు కోరవచ్చని తెలిపింది.

ప్రజావిధుల్లో ఉన్నందున మినహాయింపు ఇవ్వాలనడం రాజ్యాంగ విరుద్ధమని సీబీఐ... కోర్టుకు తెలిపింది.

చట్టం ముందు జగన్​తో సహా ప్రజలందరూ సమానులేనన్న సీబీఐ అభిప్రాయపడింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..