నోరుజారిన వైసీపీ నేత: మరో ‘ఆణిముత్యం’ అంటూ నెటిజన్ల సెటైర్లు

నోరుజారిన వైసీపీ నేత:

 మరో ‘ఆణిముత్యం’ అంటూ నెటిజన్ల సెటైర్లు

గుంటూరు: తమ అధినేతలను ప్రసన్నం చేసుకునేకుందుకు చాలా మంది నేతలు వారిపై ప్రశంసలు చేయడం సాధారణ విషయమే. 

ఈ సందర్భంలోనే పలువురు నేతలు పొరబాట్లు చేస్తూ విమర్శలను ఎదుర్కొవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంటారు. 

తాజాగా ఓ వైసీపీ నేత కూడా ఇలాంటి జాబితాలో చేరిపోయారు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ ఏసురత్నం రైతు భరోసా పథకంపై ప్రశంసలు కురిపించారు. 

పనిలో పనిగా ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా ప్రశంసలతో ముంచెత్తారు. 

జగన్ పాలనను ప్రశంసిస్తూ ఏదో చెప్పబోయిన ఆయన నోరు జారారు.

స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనబోయి స్వర్గీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు ఏసురత్నం. 

ఇంతలో పక్కనున్న వారు తప్పును సరిదిద్దడంతో.. వెంటనే కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయినా మళ్లీ తడబడ్డారు. 

స్వర్గీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా భారీగా వర్షాలు పడ్డాయన్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?