దేశంలో కొత్త జాతీయ విద్యావిధానం అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది

దేశంలో కొత్త జాతీయ విద్యావిధానం అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. కొత్త ముసాయిదా కోసం ఈ నెలాఖర్లో ఓ కమిటీని నియమించనుంది నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఎడ్యుకేషనల్​​ రీసర్చ్​ అండ్​ ట్రైనింగ్​ (ఎన్​సీఈఆర్​టీ). 14 ఏళ్ల నుంచి అమలులో ఉన్న ప్రస్తుత జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదా విధానాన్ని కమిటీ పరిశీలించి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ నెల చివర్లో కమిటీ... జాతీయ పాఠ్య ప్రణాళిక ముసాయిదాను (ఎన్​సీయఫ్​)ను పునఃపరిశీలించి కొత్త విధానం అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనుందని ఎన్​సీఈఆర్​టీ డైరెక్టర్​ రుశికేష్​ సేనాపతి తెలిపారు. కొత్త విద్యా విధానంలో భాగంగా పాఠ్య ప్రణాళిక నిర్మాణాత్మక, ఆవిష్కరణ, విశ్లేషణ-ఆధారిత, అందరికీ అర్థమయ్యే రీతిలో అభ్యాస శైలి ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు.

'కొత్త విద్యా విధానం తుది ముసాయిదా కోసం ఎదురు చూస్తున్నాం. ఈ నెల చివర్లో కమిటీ నివేదికను సమర్పిస్తుంది. నివేదిక ప్రకారం కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఆ కొత్త పాఠ్యప్రణాళిక ప్రకారమే నూతన పుస్తకాలను తీసుకొస్తాం.''

-సేనాపతి, ఎన్​సీఈఆర్​టీ డైరెక్టర్​.

చివరిసారిగా 2005లో పాఠ్య ప్రణాళిక ముసాయిదాను సవరించారు. 1975, 1988, 2000, 2005లో ఇలా మొత్తంగా ఇప్పటివరకు నాలుగు సార్లు విద్యావిధానాన్ని మార్చింది.

2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొత్త విద్యా విధానాన్ని భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..