లింగమనేని రమేష్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం వాదనలు జరిగాయి. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు తగిన సమయం లేకపోవటంతో నేటికి వాయిదా వేసింది.

అమరావతి

లింగమనేని రమేష్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం వాదనలు జరిగాయి. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు తగిన సమయం లేకపోవటంతో నేటికి వాయిదా వేసింది.

కృష్ణానది కరకట్ట వద్ద నిర్మించిన లింగమనేని రమేష్ భవనం కూల్చివేతకు సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ భవన యజమాని పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు తగిన సమయం లేకపోవడంతో విచారణను నేటికి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె . విజయలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి. ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ... కూల్చివేతకు నోటీసులిచ్చే అధికారం సీఆర్‌డీఏ అధికారులకు లేదని పునరుద్ఘాటించారు. సంజాయిషీ నోటీసుకు అధికారుల ముందు హాజరై తగిన పత్రాలు సమర్పించి వివరణ ఇవ్వడానికి గడువు కోరితే ఇవ్వలేదన్నారు. కూల్చివేత నోటీసును రద్దు చేయాలని కోరారు. అడ్వొకేట్ జనరల్ ఎస్ . శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ... అనుమతి లేని కట్టడాలపై చర్యలు తీసుకునే అధికారం సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఉందన్నారు. చట్ట ప్రకారం అనుమతులు పొందకుండా పిటిషనర్ నిర్మాణం జరిపారన్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..