ఆంధ్రప్రదేశ్‌పై ఆరెస్సెస్ నేతలు ప్రధానంగా దృష్టి పెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌పై ఆరెస్సెస్ నేతలు ప్రధానంగా దృష్టి పెట్టారు. నెలకో సారి కీలకమైన సమావేశం నిర్వహించి.. ఏం చేయాలో.. ఏం చేయకూడదో చెబుతున్నారు. మంగళవారం కూడా.. ఏపీ బీజేపీ ముఖ్యనేతలతో ఆరెస్సెస్ కీలక నేతలు గుంటూరులో సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మత మార్పిడుల కోసమే పని చేస్తోందన్న అభిప్రాయంతో.. ఆరెస్సెస్ నేతలు ఉన్నారు. జగన్ ఒక ప్రణాళిక లేకుండా వ్యవహారిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారన్న అభిప్రాయంతో ఉన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన కూలీల అంశం కూడా చర్చకు వచ్చింది. జేపీలో చేరాలనుకుంటున్న నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు పెట్టడం, పాత కేసులను తిరగదోడుతూ వేధిస్తున్నారని కొంత మంది నేతలు ఆరెస్సెస్ నేతల దృష్టికి తీసుకెళ్లారు. గత తెలుగుదేశం ప్రభుత్వం కంటే వైసీపీ ప్రస్తుత ప్రభుత్వం పోలీసులను ఎక్కువగా ఉపయోగించుకుంటుందని బీజేపీ నేతలు అభిప్రాయపడ్జారు. బీజేపీలో జగన్మోహన్ రెడ్డిని సమర్థించే వారిలో ముందుడే… సోము వీర్రాజు కూడా.. పాలనపై… ఆరెస్సెస్‌కు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు చేసిన తప్పులకంటే జగనే ఎక్కువగా తప్పులు చేస్తున్నారని ఇరువురి పాలనకు సంబంధించిన వివరాలతో.. సోము వీర్రాజు ఓ నివేదిక కూడా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను ఎండగట్టడం, భావసారూపత్య ఉన్న నేతలను ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేర్చుకోవడం, తద్వారా రాజకీయంగా ఎదిగే వ్యూహంతో ముందుకెళ్లాలని బీజేపీ పదాధికారుల సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనక్కి తగ్గాల్సిన అవసరంలేదని కేంద్ర పార్టీ నుంచి స్పష్టత రావడంతో పదాధికారుల సమావేశంలో ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడు ఏం చేయాలన్నదానిపై ఆరెస్సెస్ ఏపీ బీజేపీ నేతలకు.. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయనుంది. ప్రధానంగా.. మత మార్పిళ్ల అంశాన్ని ఆరెస్సెస్ స్వయంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. రాజకీయ అంశాలపై బీజేపీ నేతలు ప్రత్యక్షంగా పోరాటం చేయనున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..