పట్టణ గృహనిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్‌

అమరావతి

పట్టణ గృహనిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్‌ చేపట్టనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

వివిధ దశల్లో ఉన్న నిర్మాణాల కాంట్రాక్టులు, టిడ్కోలో రివర్స్ టెండరింగ్​కు వెళ్లనున్నట్లు వివరించారు. 

ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా టిడ్కో రివర్స్ టెండర్​కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.

పట్టణప్రాంత గృహనిర్మాణ ప్రాజెక్టుల విషయంలోనూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించినట్లు... పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు... ఈ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపడతామని తెలిపారు.

ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి అనుగణంగానే పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులు చేపడుతోన్న ఏపీ టిడ్కోలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాల్సిందిగా మంత్రి బొత్స ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు టెండర్లు ఖరారు చేస్తూ... ప్రజాధనం దుర్వినియోగం అయ్యేలా వ్యవహరించారని పేర్కొన్నారు. దీనికి ఫుల్​స్టాప్ పెట్టేందుకు ఇప్పటికీ ప్రారంభంకాని పనుల రద్దు, కొనసాగుతున్న పనుల్ని సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం అదేశించినట్లు బొత్స వివరించారు.

టిడ్కోలో వివిధ దశల్లో ఉన్న గృహనిర్మాణ, మౌలిక సదుపాయల కల్పన ప్రాజెక్టుల స్థితిగతులను సమీక్షించిన తర్వాత రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టేందుకు సంబంధించిన ఉత్తర్వులపై మంత్రి సంతకం చేశారు. రివర్స్ టెండరింగ్​లో అనుసరించాల్సిన విధివిధానాలను మంత్రి ఖరారు చేశారు. ఈ నిర్ణయంతో ప్రాజెక్టుల వ్యయం తగ్గి ఖజానాకు మిగులుతో పాటు... ఆయా పథకాల్లోని లబ్దిదారులపై ఆర్థిక భారం ఉండబోదని మంత్రి వెల్లడించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా టిడ్కో రివర్స్ టెండర్​కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..