టిక్​టాక్ వీడియోల సరదా కోసం కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే మరికొందరు వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

పోలీస్​ స్టేషన్​ లోపల వీడియో తీసి టిక్​టాక్​లో పోస్ట్ చేసిన నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. గుజరాత్​లోని బనాస్​కాంఠా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

టిక్​టాక్ వీడియోల సరదా కోసం కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే మరికొందరు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పోలీస్​ స్టేషన్​లో వీడియో తీసి దానిని టిక్​టాక్​లో అప్​లోడ్​ చేశారు గుజరాత్​కు చెందిన వ్యక్తులు. అదికాస్తా వైరల్ అయి పోలీసుల కంటపడింది. వెంటనే కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది...

ఓ కేసు విచారణలో భాగంగా ఐదుగురిని అగథల్​ ​స్టేషన్​కు పిలిపించారు పోలీసులు. ఐదుగురిలో ఒకరిని విచారిస్తుండగా మిగిలిన నలుగురు పక్క గదిలో ఉండి వీడియో రికార్డు చేశారు. విచారణ ముగిశాక వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత వీడియోను టిక్​టాక్ యాప్​లో అప్​లోడ్​ చేశారు.

ఆ వీడియోకు సంబంధించిన లింక్​ వాట్సాప్​ ద్వారా పోలీసు అధికారికి అందింది.

"మాకు వాట్సాప్​లో టిక్​టాక్​ వీడియో రికార్డు చేసిన లింక్​ వచ్చింది. ఈ చర్యకు పాల్పడినందుకు వారిపై ఐపీసీ సెక్షన్​ 505 ప్రకారం, ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేశాము."

-ఎస్ఎస్ రాణే, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్​ పోలీస్

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..