కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

కేంద్రం ప్రజా రవాణాలో పోటీతత్వాన్ని పెంచటం కొరకు కొన్ని నెలల క్రితం ప్రైవేటు ఆపరేటర్లను కూడా అనుమతించాలని రవాణా చట్ట సవరణలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైన తరువాత రూట్ల ప్రైవేటీకరణకు మొగ్గు చూపింది. న్యాయపరమైన సమస్యలు కూడా తొలగిపోవటంతో భారీ స్థాయిలో ప్రైవేట్ బస్సులు రాబోతున్నాయి. భారీ స్థాయిలో ప్రైవేట్ బస్సులు వస్తూ ఉండటంతో కార్మికుల భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం 50 సంవత్సరాలు పై బడిన ఆర్టీసీ కార్మికులందరికీ వీఆర్ఎస్ కల్పించే యోచనలో ఉందని తెలుస్తోంది.

50 సంవత్సరాల పై బడిన కార్మికులు స్వచ్ఛంద పదవీ విరమణకు ఒప్పుకుంటే దాదాపు 20 వేల మంది కార్మికులు రిటైర్ అవుతారు. మిగిలిన సిబ్బంది 50 శాతం బస్సుల నిర్వహణకు సరిపోతారని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వీఆర్ఎస్ కు ఒప్పుకున్న కార్మికులకు ప్రభుత్వం భారీ స్థాయిలో వరాలు కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రైవేట్ రూట్లకు సంబంధించిన విధివిధానాలు ప్రకటించిన తరువాత సీఎం కేసీఆర్ కార్మికుల విషయంలో తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో నాలుగు రోజుల్లో విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికుల గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుందని సమాచారం.

ఆర్టీసీ కార్మికులు షరతులకు లోబడి విధుల్లో చేరాలని కూడా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 50వ రోజుకు చేరింది. సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని బుధవారం ప్రకటన చేసిన జేఏసీ ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వ్యక్తం కాకపోవటంతో నిన్న మరలా సమ్మెలో కార్మికులు పాల్గొనబోతున్నట్లు ప్రకటన చేసింది. ప్రభుత్వ సానుకూల స్పందన కోసం ఆర్టీసీ కార్మికులు వేచి చూస్తున్నారు. కేసీఆర్ 50 సంవత్సరాలు పై బడిన కార్మికులకు వీఆర్ఎస్ ప్రకటిస్తే కార్మికులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..