డ్యూటీ ఎక్కుతాం.. తీసుకోండి!

ఆర్టీసీ కార్మికుల నుంచి వస్తున్న అభ్యర్థనలు -వచ్చినా విధుల్లోకి తీసుకునే వీలు లేకపోవడంతో వెనుదిరుగుతున్న వైనం -400 మంది కార్మికులు చేరేందుకు నిర్ణయం -అధికారుల నుంచి స్పందన కరువవ్వడంతో వెనక్కి -మళ్లీ ఆందోళనలకు జేఏసీ పిలుపు..స్పందన అంతంత మాత్రమే నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సంసిద్ధులవుతున్నా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నా రు. షరతుల్లేకుండా తమను విధుల్లోకి తీసుకోవాలని, వెం టనే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన విష యం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆత్రుతగా ఎదురుచూశారు. శుక్రవారం ఏకంగా చాలామంది కార్మికులు డిపోల వద్దకు వెళ్లి డ్యూటీ లో చేరాలని నిర్ణయించారు.

దాదాపు 400 మంది వరకు ఆర్టీసీ డ్రైవర్లు, కండకర్లు విధుల్లో చేరాలని బయలుదేరేందుకు సిద్ధ్దపడగా.. అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వెనుదిరిగారు. కామారెడ్డి డిపో వద్దకు ఇద్దరు డ్రైవర్లు వచ్చారు. తమను డ్యూటీలో చేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం ఇంకా రాలేదని, తమకు ఎలాంటి ఆదేశాలు లేవని చెప్పడంతో .. కనీసం తాత్కాలిక డ్రైవర్లుగా అయినా తీసుకోవాలని ప్రాదేయపడ్డారు. అయినా, అక్కడి అధికారులు పట్టించుకోలేదు. తామేమీ చేయలేమని తేల్చేశారు.

దీంతో ఉసూరుమంటూ వచ్చిన దారినే వెనుదిరిగారు. నిజామాబాద్‌ జిల్లాలో టీఎం యూ ఆధ్వర్యంలో దాదాపు 400 మం ది కార్మికులు డ్యూటీలో చేరేందుకు సిద్ధ్దమయ్యారు. కామారెడ్డిలో చోటుచేసుకున్న సంఘటన తెలుసుకుని తా ము అక్కడికి వెళ్లినా.. విధుల్లోకి తీసుకునే పరిస్థితి లేదని అర్థమై మిన్నకుండిపోయారు.

ఇదే విషయాన్ని టీఎం యూ రాష్ట్ర కార్యదర్శి మురళి ధ్రువీకరించారు. తాము విధుల్లో చేరేందుకు సిద్ధ్దమేనని ముందే ప్రకటించామని, శుక్రవారం పెద్ద ఎత్తున డ్యూటీల్లో జాయిన్‌ అయ్యేందుకు రెడీ అయ్యామని 'నమ స్తే తెలంగాణ'కు ఆయన వివరించారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని, ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇవ్వకపోవడంతో తాము విధుల్లో చేరే అవకాశం ల భించడం లేదని తెలిపారు. కాగా, మరోపక్క జేఏసీ మళ్లీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.

శనివారం ప్రజల మద్దతు కూడగట్టే క్రమంలో నాయకుల వద్దకు వెళ్లి ఆర్టీసీ సమ్మె గురించి వివరించాలని నిర్ణయించారు. ఈసారి ఇచ్చిన పిలుపునకు ఆర్టీసీ కార్మికుల నుంచి పెద్దగా స్పందన వచ్చినట్లు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని ఓ కార్మిక యూనియన్‌ నేత ఒప్పుకున్నారు. పరోక్షంగా స్పందన ఎలా ఉంటుందో చూడాలి అని నిర్వేదంగా మాట్లాడడం.. యూనియన్‌ నేతలపై కార్మికుల్లో నమ్మకం సన్నగిల్లిందనడానికి నిదర్శనం

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..