హైబ్రీడ్ సెట్​ టాప్​ బాక్స్.

ప్రస్తుతం వీడియో కంటెంట్​కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వీటిని మొబైల్ ఫోన్లు, ల్యాప్​టాప్​లలో అధికంగా వినియోగిస్తుంటారు. అయితే ఇంట్లోని టీవీల్లో శాటిలైట్​ ఛానెళ్లతో పాటు.. వీడియో స్ట్రీమింగ్​ (ఓటీటీ) సేవలను ఇస్తున్నాయి హైబ్రీడ్ సెట్​ టాప్​ బాక్స్​లు. మరి అవి ఎలా పని చేస్తాయి? వాటితో లాభమేంటి? అనే విషయాలు మీ కోసం.

హైబ్రీడ్ సెట్​ టాప్​ బాక్స్.. దేశ ప్రసార రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న నయా ట్రెండ్​. ఇంతకీ ఏంటి ఈ హైబ్రీడ్ సెట్​ టాప్ బాక్స్​.. దీని ఉపయోగమెంత? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శాటిలైట్​ టీవీతో పాటు.. వీడియో స్ట్రీమింగ్​ (ఓటీటీ) కంటెంట్ వీలుగా వీలుగా ఉండటమే ఈ హైబ్రీడ్​ సెట్​ టాప్​బాక్స్ ప్రత్యేకత.
హైబ్రీడ్ సెట్​ టాప్​ బాక్స్​ ఎందుకు?
వీడియో స్ట్రీమింగ్ యాప్​లు వీడియో కంటెంట్​ను ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత మొబైళ్లు, ల్యాప్​టాప్​ల్లో వీడియో కంటెంట్​ను వీక్షించేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. టీవీల్లో కేవలం శాటిలైట్​ ఛానెళ్లు మాత్రమే ప్రసారం కావడం వల్ల వీక్షకుల సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు డీటీహెచ్ ఆపరేటర్లు, ఛానెళ్ల యాజమాన్యాలు భావిస్తున్నాయి. అమెజాన్ ఫైర్​ స్టిక్​తో టీవీల్లోనూ వీడియో స్ట్రీమింగ్ కంటెంట్​ను వీక్షించే వీలున్నా.. దేశంలో దాని వినియోగం అంతగా లేదు. ఈ కారణంగా టీవీల్లో శాటిలైట్​ ఛానెళ్లతో పాటు.. వీడియో స్ట్రీమింగ్ కంటెంట్​ను వీక్షించే వీలు కల్పించాలని ప్రణాళిక రూపొందించాయి డీటీహెచ్​ సంస్థలు. ఇందులో భాగంగానే హైబ్రీడ్​ సెట్​ టాప్​ బాక్స్​లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.
హైబ్రీడ్​ సెట్​టాప్​ బాక్స్ ఎలా పని చేస్తుంది?
ఈ హైబ్రీడ్​ సెట్​టాప్​ బాక్స్​లకు ఇంటర్నెట్​ అనుసంధానం చేసే వీలుంటుంది. అంతేకాదు వీడియో స్ట్రీమింగ్ సేవలందించే నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్, జీ5, హాట్​స్టార్ వంటి అప్లికేషన్లు ముందుగానే ఇన్​స్టాల్​ చెసి ఉంటాయి. ఏ సేవలు వినియోగించుకోవాలనుకుంటే వాటికి ప్రీమియం చెల్లించి కంటెంట్​ను వీక్షించొచ్చు. ఇదే సెట్​బాక్స్​కు డిష్​ అనుసంధానం చేసే వెసులుబాటు ఉంటుంది. దీని ద్వారా శాటిలైట్ టీవీ ఛానెళ్లను వీక్షించొచ్చు. ఈ రెండింటినీ నియంత్రించేందుకు ఒకే రిమోట్​ను వినియోగించడం దీని ప్రత్యేకత.
మార్కెట్లో ఉన్న హైబ్రీడ్​ సెట్​ టాప్​ బాక్స్​లు ఇవే..
హైబ్రీడ్​ సెట్​టాప్​బాక్స్​ను ముందుగా పరిచయం చేసింది ఎయిర్​టెల్ అనే చెప్పాలి. ఎయిర్​టెల్​ ఇంటర్​నెట్​ టీవీ పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది ఆ సంస్థ. ఆండ్రాయిడ్ టీవీతో పని చేసే ఈ సెట్​ టాప్​ బాక్స్​తో శాటిలైట్ ఛానెళ్లు, వీడియో స్ట్రీమింగ్ కంటెంట్​ను చూసే వీలుంది. ఇటీవలే ఎయిర్​టెల్ ఎక్స్​ట్రీమ్​ పేరుతో మరో హైబ్రీడ్​ సెట్​టాప్​ బాక్స్​ను ఆవిష్కరించింది. డీటీహెచ్​లలో మరో ప్రముఖ సంస్థ డిష్​టీవీ.. డిష్​ స్మార్ట్​హబ్​ పేరుతో హైబ్రీడ్ సెట్​టాప్ బాక్స్​ను తీసుకువచ్చింది. జియో ఆవిష్కరించిన 4కే-సెట్​టాప్​ బాక్స్​ ఇదే కోవలోకి వస్తుంది

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..