ముంచుకువస్తున్న మహా తుపాన్

ముంబై: 

ముంచుకువస్తున్న మహా తుపాన్ ప్రభావం వల్ల మహారాష్ట్రలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ కేంద్రం వెల్లడించింది. 

మహా తుపాన్ ప్రభావం వల్ల మహారాష్ట్రలోని థానే, పాల్ఘార్ జిల్లాలతో పాటు ఐదు జిల్లాల్లో మంగళవారం నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

మధ్యమహారాష్ట్రలోని థానే, పాల్ఘార్, నాసిక్, ధూలే, నందూర్ బర్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. మహా తుపాన్ బుధవారం అర్దరాత్రికి గుజరాత్ రాష్ట్రంలోని డయ్యూ, పోరబందర్ వద్ద తీరం దాటవచ్చని ఈ సందర్భంగా గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. 

వాతావరణశాఖ జారీ చేసిన హెచ్చరికలతో థానే, పాల్ఘార్ జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు. 

ఈ సందర్భంగా పాల్ఘార్ జిల్లాలో బుధవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఆ జిల్లా కలెక్టరు ఆదేశాలు జారీ చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది