కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ వీడియోను విడుదల చేసింది పాకిస్థాన్

కర్తార్​పుర్ ఆధ్యాత్మిక నడవా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ వీడియోను విడుదల చేసింది పాకిస్థాన్. 

అయితే ముగ్గురు ఖలిస్థాన్ వేర్పాటువాద నేతలకు ఈ వీడియోలో స్థానం కల్పించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఖలిస్థానీ వేర్పాటువాద నేత జర్నైల్ సింగ్ బింద్రేన్​వాలేకు కర్తార్​పుర్ నడవా ప్రారంభోత్సవ వీడియోలో స్థానం కల్పించడంపై దౌత్య మార్గాల ద్వారా అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్​. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

కర్తార్​పుర్ నడవా నిర్మాణంపై చర్చల సమయంలోనూ.. పాక్​ తరఫు నుంచి ఖలిస్థానీ వేర్పాటువాద నేతకు స్థానం కల్పించడంపై తీవ్రంగా ఆక్షేపించింది భారత్.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..