తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులు

హైదరాబాద్: 

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులు తాము పనిచేస్తున్న డిపో మేనేజర్లకే కాక ఇంకా పలుచోట్ల తమ జాయినింగ్ లెటర్స్ ఇవ్వవచ్చని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. 

కార్మికులు ఆయా జిల్లాల కలెక్టరర్ కార్యాలయంలో, ఎస్పీ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, డిఎస్పీ కార్యాలయంలోగానీ, తాము పనిచేస్తున్న డిపో మేనేజర్ కార్యాలయంలో గానీ, డివిఎం కార్యాలయంలో గానీ, రీజనల్ మేనేజర్ కార్యాలయంలో గానీ విధుల్లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ లేఖ ఇవ్వవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?