జొన్నాడ గౌతమీ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం
*జొన్నాడ గౌతమీ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం*
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం గౌతమి బ్రిడ్జి సమీపంలో గల తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి కారులును తీసుకువెళ్తున్న ఓ కంటైనర్ సోమవారం తెల్లవారు జామున దూసుకుపోయింది దీనికి సంబంధించి సిఐ మంగాదేవి ఎస్సై శుభాకర్ తెలిపిన వివరాలు ప్రకారం ..
చెన్నై నుండి ఒడిశాకు హోండా కార్లు లోడుతో వెళుతున్న ఓ భారీ కంటైనర్ అదుపుతప్పి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి దూసుకుపోయింది అయితే కంటైనర్ కేబిను కాలువలోకి పూర్తిగా మునిగి పోవటంతో ఎంతమంది ఉన్నారనేది తెలియవలసి ఉందని. కాగా రావులపాలెం నుండి క్రేన్లను తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోవడంతో ఓఎన్జిసి అధికారులతో చర్చలు జరిపి భారీ క్రేన్లను రప్పించేందుకు సిఐ మంగాదేవి ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. Mp
Comments
Post a Comment