అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు

అమరావతి

అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. 

రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని.. ఎటువంటి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు 

అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించడానికి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని జీడీపీ తెలిపారు 

పౌరులకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే పోలీసులకు సమాచారమందించాలని కోరారు 

సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని... శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా పెట్టామని వెల్లడించారు. 

రాష్ట్రంలోని పరిస్థితులపై అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?