ఆటోను డ్డీ కొన్న కారు

కడప జిల్లా:

ఆటోను కారు  ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఆరుగురు ప్రయాణీకులకు తీవ్రగాయాలైన ఘటన బుధవారం లక్కిరెడ్డిపల్లె- రామాపురం ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది. లక్కిరెడ్డిపల్లె- రామాపురం ప్రధాన రహదారిలో ఈడిగపల్లె క్రాస్‌ వద్ద రామాపురం నుండి ప్రయణీకులతో వస్తున్న ఆటోను, కడప వైపు వెళుతున్న కారు  ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గుర్తించి క్షతగాత్రులను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో రామచంద్రా రెడ్డి శరీరమంతా కాలిపోయింది. మరో మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలినవారు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది