అయ్యా.. మేము విధుల్లో చేరుతాం

  • కొంతమంది ఆర్టీసీ కార్మికుల వేడుకోలు
  • అనుమతి లేదంటున్న అధికారులు

హైదరాబాద్‌,

'అయ్యా మేము విధుల్లో చేరుతాం. మమ్మల్ని తీసుకోండి' అంటూ వివిధ ప్రాంతా ల్లో ఆర్టీసీ కార్మికులు అధికారులను వేడుకుంటున్నారు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని హైదరాబాద్‌-2 డిపోకు శుక్రవారం దాదాపు 30 మంది కార్మికులు డిపో మేనేజర్‌ రాజేందర్‌రెడ్డిని కలిశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని విన్నవించుకున్నారు. ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి అనుమతి రాన్నందున విధుల్లోకి తీసుకోలేకపోతున్నానని చెప్పి ఆయన కార్మికులను తిప్పి పంపారు.

జగిత్యాలలోనూ విధుల్లో చేరుతామని కొంతమంది కార్మికులు డిపో మేనేజర్‌ను కలవగా.. ఈ విషయమై తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆయన చెప్పారు.


Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?