మద్యం కొనుగోలు చేసిన వారికి ప్రింటెడ్‌ బిల్లులు ఇవ్వాలి

మద్యం కొనుగోలు చేసిన వారికి ప్రింటెడ్‌ బిల్లులు ఇవ్వాలి :రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ముడావత్‌ మల్లికార్జున నాయక్‌

గుంటూరు కార్పొరేషన్‌,:షాపులలో మద్యం కొనుగోలు చేసిన వారికి ప్రింటెడ్‌ బిల్లులు ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ముడావత్‌ మల్లికార్జున నాయక్‌ ఆదేశించారు. 

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లూజు అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

బెల్ట్‌ అమ్మకాలు, కాపు సారా కనిపిస్తే సంబంధిత ఎక్సైజ్‌ స్టేషన్ల సీఐ, ఎస్సైలను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. 

మద్యం లూజు అమ్మకాలు, ఎంఆర్‌పీ ఉల్లంఘన, బెల్ట్‌ షాపులు, కాపుసారా ఉంటే టోల్‌ఫ్రీ నంబర్‌ 18004254868, కంట్రోల్‌ రూమ్‌ 9491030853కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..