రాజమహేంద్రవరం లో రౌడీ బ్యాచ్ వీరంగం

రాజమహేంద్రవరం లో రౌడీ బ్యాచ్ వీరంగం
 

కానిస్టేబుల్ బైక్ ని ఢీకొని.. అతడిపైనే దాడి..

నడిరోడ్డుపై చితకబాదిన వైనం..

పోలీసుల అదుపులో ఒకరు, మరికొందరికోసం గాలింపు…

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆనందనగర్ లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ పై ముగ్గురు యువకులు పబ్లిక్ లోనే దాడి చేశారు. విచక్షణ రహితంగా అతన్ని కొట్టి, అడ్డుకోవాలని యత్నించినవారిని కత్తులతో బెదిరించారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం కలిగించింది. ఒక పోలీసుపైనే ఆకతాయి రౌడీలు ఇలా రెచ్చిపోవడాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించింది. దుండగులకోసం గాలింపు మొదలుపెట్టింది.

రాజమండ్రి అర్బన్ జిల్లా పరిధిలోని సీతానగరం, కోరుకొండ పోలీసు స్టేషన్ లలో నాగేశ్వరరావు స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఉదయం అతడు మోటారు సైకిల్ పై వెళ్ళుతుండగా వెనుకగా బైక్ పై వస్తున్న ముగ్గురు యువకులు బైక్ తో ఢీకొన్నారు. దీనితో హెడ్ కానిస్టేబుల్ సెల్ ఫోన్ లో ఆ ముగ్గురు యువకులను, బైక్ నీ ఫోటో తీశాడు. దీనితో ముగ్గురు యువకులు రెక్చిపోయారు. కట్టిలతో వీరంగం చేశారు. హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్ లు ఆపినప్పటికి.. వినకుండా విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. దగ్గరకు వస్తున్న స్థానికులను కత్తులతో బెదిరించారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన హెడ్ కానిస్టేబుల్ ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిలో ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..