Posts

Showing posts with the label srinagar news

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం  జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు . షోపియాన్ జిల్లాలోని అవనీరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర ఆర్మీ జవాన్లు మంగళవారం ఉదయం గాలింపు చేపట్టారు. ఆర్మీ జవాన్లు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. జవాన్లు తిరిగి ఎదురుకాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం జవాన్ల గాలింపు కొనసాగుతోంది