Posts

Showing posts with the label ఎస్మా ప్రయోగించడం ఇష్టం లేదు
Image
ఎస్మా ప్రయోగించడం ఇష్టం లేదు : మమతా బెనర్జీ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె, నిరసనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా మరోమారు స్పందించారు. రాష్ట్రంలో ఎస్మా( ఎసెన్షియల్ సర్వీసెస్ మెయిన్టెనెన్స్ యాక్ట్)ను ప్రయోగించడం ఇష్టం లేదని పేర్కొన్నారు. జూనియర్ వైద్యులు విధుల్లో చేరాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. వారి అన్ని డిమాండ్లను అంగీకరిస్తామని వెల్లడించారు. సమ్మెలు, ధర్నాలు వంటి సందర్భాల్లో ప్రజల రోజువారి జీవనానికి ఇబ్బంది కలగకుండా పలు రకాల అత్యవసర సేవల నిర్వహణ కొనసాగేలా చూసేందుకు ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చింది. ఎస్మా నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యోగులను విధుల నుంచి తొలగించడంతో పాటు వివిధ రకాల క్రమశిక్షణా చర్యలు చేపట్టవచ్చు.